తాము వీడినా తెలుగుదేశం మరింత బలపడుతుందని ఆ పార్టీ రాజ్యసభాపక్ష నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. ఓ టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడిన సుజనాను అదెలా అని ప్రశ్నిస్తే.. ‘మా స్థానంలో కొత్తవాళ్ళు వస్తారు కాబట్టి’ అని బదులిచ్చారు. బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే దేశ ప్రజల ఆలోచన అర్ధమవుతోందని, దేశాభివృద్ధిలో భాగం కావాలనే బీజేపీలో చేరుతున్నామని సుజనా చెప్పుకొచ్చారు. తమపైన ఎలాంటి ఒత్తిళ్లూ లేవని, తనపైన ఉన్న కేసులకు.. ఈ నిర్ణయానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
2019-06-20తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీకి వీడ్కోలు పలికారు. అందులో ముగ్గురు గురువారం ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మోడీ 1.0 ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన టీడీపీ రాజ్యసభాపక్ష నేత సుజనా చౌదరి, ఎంపీలు సిఎం రమేష్, టీజీ వెంకటేశ్ బీజేపీ కండువాలు కప్పుకొన్నారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని లేఖ ఇచ్చిన నాలుగో ఎంపీ గరికపాటి మోహన్ రావు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన కాలి గాయం కారణంగా రాలేదని జె.పి. నడ్డా చెప్పారు.
2019-06-20జమిలి ఎన్నికల (ఒకే దేశం.. ఒకే ఎన్నికలు) విధానం అమలుకోసం ఒక కమిటీని నియమించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆ కమిటీ రాజకీయపరమైనదని, వివిధ పార్టీల నేతలు అందులో ఉంటారని రాజ్ నాథ్ చెప్పారు. జమిలి ఎన్నికలకు మద్ధతు కూడగట్టడంకోసం 40 పార్టీల అధ్యక్షులను కేంద్రం సమావేశానికి ఆహ్వానించగా 21 పార్టీల ముఖ్యులు హాజరయ్యారు.
2019-06-19 Read Moreకృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన భవనంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్కడినుంచి ఖాళీ చేయిస్తామని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కరకట్ట అక్రమ నిర్మాణాలపై కోర్టులో పోరాడుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆర్కే మంగళవారం లాబీల్లో మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకోని చంద్రబాబు రాజధాని ఏం నిర్మిస్తారని ఎద్దేవా చేశారు.
2019-06-18ప్రధాని మోదీ ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను వామపక్షాలు వ్యతిరేకించాయి. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య సూత్రానికి వ్యతిరేకమని లెఫ్ట్ నేతలు చెప్పారు. ఈ అంశమే ప్రధాన ఎజెండాగా మోదీ ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో వామపక్షాలు స్పందించాయి. ‘ఒక రాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ కోల్పోతే ఒకే ఎన్నికల ఫార్ములా ప్రకారం అదే ప్రభుత్వాన్ని కొనసాగించాలి..లేదా రాష్ట్రపతి పాలన విధించాలి. కేంద్రంలో ఉన్న పార్టీ అధికారాన్నే రాష్ట్రాలపై రుద్దే విధానం ఇది’ అని సీపీఎం నేత రామచంద్రన్ పిళ్ళై పేర్కొన్నారు.
2019-06-17 Read Moreఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులుగా మరో పదిహేనేళ్లపాటు జగన్, కేసీఆర్ కొనసాగాలని శారదా పీఠం అధిపతి స్వరూపానంద ఆకాంక్షించారు. వారిద్దరినీ రెండు రాష్ట్రాలకు రాజులుగా అభివర్ణించారు. సోమవారం విజయవాడలో జరిగిన శారదాపీఠం ఉత్తరాధికారి పట్టాభిషేక కార్యక్రమంలో స్వరూపానంద ఇద్దరు సిఎంలను కొనియాడారు. కేసీఆర్ యాదాద్రి, వేములవాడ దేవాలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, దేవాలయాల పరిరక్షణకోసం జగన్ పరితపించారని ప్రశంసించారు.
2019-06-17చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ఈ నెల 20-21 తేదీల్లో తొలిసారిగా ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానంమేరకు గ్జి అక్కడికి వెళ్తున్నారు. గత కొద్ది కాలంగా ఇరు దేశాల సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కొరియా అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించి పలు ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు చైనా కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంలో కిమ్ రెండుసార్లు చైనాలో పర్యటించారు.
2019-06-17 Read Moreబి.జె.పి. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జె.పి. నడ్డాను ఎంపిక చేస్తూ ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో.. నడ్డాను పార్టీ పదవికి ఎంపిక చేసినట్టు మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలో చేరాక నడ్డా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి నడ్డాను ‘వర్కింగ్ ప్రెసిడెంట్’గా నియమించారు.
2019-06-17 Read Moreరుణ మాఫీ అర్హత పత్రాలు కలిగిన రైతులకు 4, 5 విడతల సొమ్ము చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. సోమవారం చంద్రబాబు నివాసం వద్ద ప్రజావేదికలో నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. రుణ మాఫీ అంశాన్ని కేవలం ఒక పార్టీ హామీగా పేర్కొంటూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆక్షేపించారు.
2019-06-17తెలంగాణలో భారీ ఎత్తిపోతల పథకం ‘కాళేశ్వరం’ ప్రారంభోత్సవానికి రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. సోమవారం ఏపీ పర్యటనకు వచ్చిన కేసీఆర్ కు తాడేపల్లిలోని తన నివాసంలో జగన్మోహన్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్ ఆహ్వానించారు. కేసీఆర్ ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గ దేవాలయాన్ని వెళ్లి పూజలు చేశారు.
2019-06-17