బీజేపీలోకి రావాలని తాను ఎవరినీ బొట్టు పెట్టి పిలవబోనని తాజాగా టీడీపీ నుంచి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలను బీజేపీలో చేర్పించబోతున్నారా అని ఓ టీవీ ఛానల్ న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు చౌదరి పరస్పర భిన్నమైన సమాధానాలు ఇచ్చారు. ‘బొట్టు పెట్టి పిలవను..ఈ పరిస్థితుల్లో నాతో ఎవరూ టచ్ లో లేరు’ అంటూనే, ‘నేను సింపుల్ కాల్ ఇస్తే వచ్చేవాళ్లు వస్తారు. నేను వెళ్లాను కదా’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ సిద్దాంతాలు, విధానాలు నచ్చినవాళ్లు రావాలన్నారు.
2019-06-23బహుజన సమాజ్ పార్టీ (బి.ఎస్.పి) అధినేత్రి మాయావతి తన సోదరుడు ఆనంద్ కుమార్, మేనల్లుడు ఆకాష్ ఆనంద్ లను జాతీయ ఉపాధ్యక్షుడు, సమన్వయకర్తలుగా నియమించారు. మరో నేత రాంజీ గౌతంను కూడా మరో జాతీయ సమన్వయకర్తగా నియమించారు. ఆదివారం లక్నోలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమ్రోహా ఎంపి డానిష్ ఆలి లోక్ సభలో పార్టీ నేతగా, నగీనా ఎంపి గిరీష్ చంద్ర చీఫ్ విప్ గా నియమితులయ్యారు.
2019-06-23 Read Moreఇరాన్‌పై సరికొత్త ఆంక్షలు విధించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. అవి సోమవారం అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. అమెరికా నిఘా డ్రోన్ ను ఇరాన్ కూల్చివేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఒబామా భయానక ప్రణాళిక ప్రకారం కొద్ది సంవత్సరాల్లోనే ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకునేదంటూ ట్రంప్ శనివారం ఒక ట్వీట్ చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటానికి వీల్లేదని ఆయన ఉద్ఘాటించారు.
2019-06-22 Read Moreఅమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ‘స్పష్టమైన వివక్ష’ చూపిస్తోందని బిజెపి ధ్వజమెత్తింది. అమెరికా నిన్న విడుదల చేసిన ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ రిపోర్టు 2018‘పై శనివారం బిజెపి స్పందించింది. మైనారిటీలపై హింసను ప్రోత్సహిస్తున్నారంటూ భారత ప్రభుత్వాన్ని, బిజెపి నేతలను ఆ నివేదిక వేలెత్తి చూపించింది. విద్వేష ప్రసంగాలను, గోరక్షక దళాల పేరిట జరుగుతున్న హింసను నివేదికలో ప్రస్తావించారు.
2019-06-22 Read Moreమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ప్రక్కన ఉన్న ‘ప్రజావేదిక’ నుంచి ఆయన సామాగ్రిని బయటపడవేయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ వేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాసినా స్పందించకుండా, ఇలాంటి హేయమైన చర్యలకు ఒడిగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికృతానందం పొందుతోందని టీడీపీ ఓ ప్రకటనలో విమర్శించింది. గతంలో వైఎస్ మరణించాక ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఆరు నెలలపాటు జగన్ ఖాళీ చేయలేదని గుర్తు చేసింది.
2019-06-22తన ప్రైవేటు నివాసం ప్రక్కనే ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ‘ప్రజావేదిక’ను ఇప్పుడు ప్రతిపక్ష నేతనైన తనకే కేటాయించాలని మాజీ సిఎం చంద్రబాబునాయుడు కొద్ది రోజుల క్రితం విన్నవించారు. అయితే.. ఆ లేఖకు బదులివ్వని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అక్కడ ఈ నెల 24న కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఆ పేరిట ‘ప్రజావేదిక’ను స్వాధీనం చేసుకుంది. కలెక్టర్ల సమావేశం సచివాలయంలో జరుగుతుందని నిన్న ప్రకటించిన అధికారులు శుక్రవారం వేదికను మార్చారు.
2019-06-21తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కావని, భయపడవలసిన అవసరం లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యకర్తలకు అభయమిచ్చారు. ‘‘గతంలో అనేకమంది వీడారు.. పార్టీ మరణించిందన్నారు. ముగిసిన అధ్యాయం అన్నారు. కానీ, మనం సన్యసించలేదు. మళ్ళీ వచ్చాం. లక్షలా కార్యకర్తలు, కోట్లాదిమంది తెలుగు ప్రజలు మన వెనుక ఉన్నారు. చరిత్ర పునరావృతమవుతుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. నలుగురు ఎంపీలు బీజేపీలో చేరిన నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు.
2019-06-20టీడీపీ కాపు నేతల సమావేశం పార్టీ మారడానికి ఉద్ధేశించింది కాదని మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో తమ ఓటమికి కారణాలను, పార్టీ నాయకత్వంతో చర్చించాల్సిన అంశాలను విశ్లేషించామని వారు చెప్పారు. సుమారు గంటా 40 నిమిషాలు చర్చించామని, ఈ సమావేశం కాకతాళీయంగా ఈ రోజే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో తమ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్ళారన్న జ్యోతులు, వారిని తిరిగి టీడీపీవైపు ఎలా తీసుకురావాలనే ఆలోచన చేశామని చెప్పారు.
2019-06-20రాజ్యసభ సభ్యులు నలుగురు పార్టీ మారుతున్న రోజే కాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం కలకలం రేపింది. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో కాపు, బలిజ వర్గాలకు చెందిన 13 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కాకినాడలో సమావేశమయ్యారు. పార్టీ ఓటమికి, కాపు నాయకత్వం దెబ్బతినడానికి ప్రధానంగా అధినాయకత్వం అనుసరించిన విధానాలే కారణమని ఈ సమావేశంలో ఎక్కువమంది అభిప్రాయపడినట్టు సమాచారం.
2019-06-20పార్టీ మారాలంటే బాధతో గరికపాటి మోహనరావుకు బీపీ డౌన్ అయిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి రఘురాం వ్యాఖ్యానించారు. టీడీపీలో కీలకపాత్ర పోషించిన గరికపాటి వంటి వారే పార్టీ మారడం అక్కడి దుస్థితిని తెలియజేస్తోందని రఘురాం పేర్కొన్నారు. దుర్యోధనుడి కొడుకు ఉత్తర కుమారుడిలా..చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను తెచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారని గురువారం ఓ టీవీ చర్చలో వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఇప్పుడు తండ్రీ కొడుకుల పెత్తనం నుంచి, బానిసత్వం నుంచి స్వేచ్ఛవైపు బయటపడుతున్నారనిపేర్కొన్నారు.
2019-06-20