కర్నాటక ప్రభుత్వ ‘విశ్వాసపరీక్ష’పై గవర్నర్ వాజూభాయ్ వాలా ఆదేశాలను ముఖ్యమంత్రి కుమారస్వామి, అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. రమేష్ కుమార్ పెద్దగా పట్టించుకోలేదు. విశ్వాస పరీక్షకోసం గవర్నర్ గురు, శుక్రవారాల్లో విధించిన మూడు ‘డెడ్ లైన్’లను వారు బేఖాతరు చేశారు. శుక్రవారం సభలో చర్చ తర్వాత స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. అదే రోజున ‘విశ్వాస పరీక్ష’ చేపట్టవచ్చని కాంగ్రెస్, జెడిఎస్ నేతలు సభాపతికి తెలియజేశారు.
2019-07-19బీజేపీ సౌజన్యంతో కర్నాటక కాంగ్రెస్-జెడిఎస్ క్యాంపులో మొదలైన సంక్షోభం ఆదివారం మరింత ముదిరింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే ధ్యేయంగా రాజీనామాలు చేసిన 12 మంది కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేల క్యాంపులో.. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్. నాగరాజ్ కూడా చేరిపోయారు. రాజీనామాలకు సిద్ధపడినవారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఓవైపు ప్రయత్నిస్తుండగా, మరోవైపు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అంతకంటే తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2019-07-14 Read Moreబీజేపీకి పూర్వరూపమైన ‘జనసంఘ్’లో పని చేసిన ఓ గత తరం కార్యకర్తకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాళ్ళు కడిగి మరీ పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఆదివారం విజయవాడ పర్యటనకు వచ్చిన శివరాజ్ గోడుబర్తి శ్రీనివాసరావు అనే జనసంఘ్ కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీనివాసరావు దంపతుల కాళ్ళు కడిగిన సింగ్, బీజేపీ సభ్యత్వ డ్రైవ్ లో భాగంగా జనంసంఘీయులకు సభ్యత్వం అందజేశారు.
2019-07-14వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన బీజేపీ కృష్ణా జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు భవిష్యత్తు లేదని, తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ లా మారి తన మిత్రులను బిజెపికి వదిలేసిందని శివరాజ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బలం పుంజుకుంటోందని చెప్పారు.
2019-07-14కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు చేసిన ‘ధర్మపోరాట’ దీక్షలను కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తప్పు పట్టారు. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన చౌదరి ఆదివారం విజయవాడ వచ్చారు. అప్పటి తమ నేత చేసినవి ’అధర్మ పోరాట’ దీక్షలు అని విమర్శించారు. స్వాతంత్రం వచ్చాక ఒక రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వమూ చేయనంతగా.. గత నాలుగేళ్ళలో కేంద్రం సాయం చేసిందని సుజనా ఉద్ఘాటించారు.
2019-07-14పంజాబ్ మంత్రివర్గం నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. గత నెల 10న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సమర్పించిన రాజీనామా లేఖను సిద్ధు ఆదివారం ట్విట్టర్లో వెల్లడించారు. తన రాజీనామాను ముఖ్యమంత్రికి పంపుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. సిఎం కెప్టెన్ అమరీందర్ తో మొదటినుంచీ సిద్ధుకు పడటంలేదు. జూన్ 6న మంత్రివర్గ విస్తరణలో స్థానిక సంస్థల శాఖను సిద్ధూ నుంచి తప్పించారు. దీంతో 10వ తేదీన సిద్ధూ రాహుల్ గాంధీని కలసి రాజీనామా లేఖను సమర్పించారు.
2019-07-14 Read Moreఅవకాశాల్లో సగం కావాలని మహిళలంతా కోరుతుంటే.. అవినీతిలోనూ సగం కావాలంటున్నారు తాసీల్దారు వి. లావణ్య వంటి వారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో పని చేస్తున్న ఆమె ఇంట్లో బుధవారం ఏసీబీ తనిఖీల్లో ఏకంగా రూ. 93.5 లక్షల నగదు, 40 తులాల బంగారం దొరికాయి. ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత మొత్తంలో నగదు దొరకడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వీఆర్వో అనంతయ్యను ఆరా తీస్తే లావణ్య అవినీతి బాగోతం తెలిసింది.
2019-07-10కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి జ్యోతిరాదిత్య సింథియా, ముంబై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మిలింద్ దేవొరా ఆదివారం రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన కొద్ది రోజుల తర్వాత వారిద్దరూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యానికి బాధ్యత తీసుకున్నట్టు అటు రాహుల్, ఇటు సింథియా చెప్పారు. మిలింద్ దేవొరా మాత్రం జాతీయ స్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నట్టు సంకేతాలిచ్చారు.
2019-07-07మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరపాలని ఆయన కుమారుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూలై 8వ తేదీన వైఎస్ 70వ జయంతి. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇకపైన రైతు దినోత్సవం పేరిట అధికారికంగా వైఎస్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
2019-06-24ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ప్రక్కనున్న ‘ప్రజావేదిక’లో తొలి కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసిన కొత్త సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆ భవనంలో జరిగే చివరి భేటీ అదేనని ప్రకటించారు. కృష్ణా నది కరకట్టకు లోపల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వమే నిర్మించిన ‘ప్రజావేదిక’ను రేపటి సమావేశాల తర్వాత ఎల్లుండినుంచి కూల్చివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా కూర్చున్న భవనం అక్రమ నిర్మాణమని చాటడానికే కలెక్టర్ల సమావేశం అక్కడ ఏర్పాటు చేయాలని సూచించినట్టు జగన్ చెప్పారు.
2019-06-24