కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి తన పేరు పరిశీలనలోకి తీసుకోవద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సీనియర్ నేతల సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి సోదరుడు రాహుల్ రాజీనామా చేసిన నేపథ్యంలో, ఆ బాధ్యతను చేపట్టాల్సిందిగా కొంతమంది నేతలు ప్రియాంకా గాంధీని కోరారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కొత్త అధ్యక్షలు ఎవరన్న విషయమై నిర్ణయం తీసుకోనుంది.
2019-08-01కొద్ది రోజుల క్రితం 10 వేల మంది పారా మిలిటరీ సిబ్బందిని అదనంగా ‘జమ్మూ-కాశ్మీర్’కు పంపిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో 25 వేల మందిని తరలించడానికి గురువారం ఆదేశాలిచ్చింది. దీంతో కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలేవో తీసుకుంటుందన్న ఆందోళన ఆ రాష్ట్రంలో తీవ్రమవుతోంది. అమరనాథ్ యాత్రకోసం ఇదివరకే పంపిన 40 కంపెనీల పారామిలిటరీ దళాల్లో ఎక్కువ మందిని వివిధ జిల్లాలకు పంపాలని ఆదేశాలందాయి.
2019-08-01 Read Moreకర్నాటక కొత్త ముఖ్యమంత్రి యెడియూరప్ప ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, జెడి(ఎస్) బహిష్కరించాయి. ఈ కార్యక్రమాన్ని ‘అపవిత్ర పరిణామం’గా కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు. మూడు రోజుల క్రితం విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జెడి(ఎస్) కూటమి ఓడిపోగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎడియూరప్ప ముందుకొచ్చారు. విశ్వాస పరీక్షలో ఓటు వేస్తామని కాంగ్రెస్-జెడి(ఎస్) రెబల్ ఎమ్మెల్యేలు హామీ ఇచ్చాకే బిజెపి ఇందుకు సమ్మతించినట్టు సమాచారం.
2019-07-26కాంగ్రెస్-జెడి(ఎస్) ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత సిఎంగా ప్రమాణం చేసిన యెడియూరప్ప సోమవారం విశ్వాస పరీక్షకు సిద్ధమైనట్టు సమాచారం. బలపరీక్షకు జూలై 31వరకు గడువు ఇవ్వగా ఆయన ఈలోగానే విశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం కూలిపోయాక రెండు రోజులపాటు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూసిన యెడియూరప్ప శుక్రవారం ఉదయం గవర్నర్ వాజూభాయ్ వాలాను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరారు.
2019-07-26కర్నాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యెడియూరప్ప (76) శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వాజూభాయ్ వాలా రాజ్ భవన్ వేదికగా యెడియూరప్ప చేత ప్రమాణం చేయించారు. యెడియూరప్ప సిఎం కావడం ఇది నాలుగోసారి. గత ఏడాది మేలో మూడోసారి ప్రమాణం చేసిన యెడియూరప్ప బలం నిరూపించుకోలేక కేవలం మూడు రోజుల్లోనే తప్పుకొన్నారు. కాంగ్రెస్-జెడిఎస్ కూటమి ప్రభుత్వంలో సంక్షోభంతో మరోసారి యెడియూరప్పకు అవకాశం వచ్చింది.
2019-07-26 Read Moreతెలుగుదేశం పార్టీ ఇక ఆంధ్రప్రదేశ్ గతంలోనే ఉంటుందని, వర్తమానంలో ఆ పార్టీ నుంచి నేతలంతా తమవద్దకు చేరుతున్నారని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాంమాధవ్ ‘ఏపీ గతం టీడీపీ.. వర్తమానం వైసీపీ.. భవిష్యత్తు బీజేపీ’ అని గంటాపథంగా చెప్పారు. భారతదేశపు వర్తమానం, భవిష్యత్తు కూడా నరేంద్ర మోదీయేనని ఉద్ఘాటించారు.
2019-07-24ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి బుధవారం బీజేపీలో చేరిన సందర్భంగా రాంమాధవ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడవక ముందే ముఖ్యమంత్రి (జగన్) వీరంగం వేస్తున్నారని రాంమాధవ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రజలు భయపడే రోజులు వస్తున్నాయనిపిస్తోందని పేర్కొన్నారు.
2019-07-24‘‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో కాశ్మీర్ అంశంపై చర్చే రాలేదు. ఆ అంశంపై మధ్యవర్తిత్వం ప్రశ్నే లేదు’’ అని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం లోక్ సభలో స్పష్టం చేశారు. ట్రంప్ చెప్పిన విషయంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టిన కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసి వెళ్లిపోయాక, రాజ్ నాథ్ సింగ్ ఈ అంశంపై మాట్లాడారు.
2019-07-24 Read Moreకర్నాటకలో అధికార కాంగ్రెస్- జెడిఎస్ కూటమినుంచి 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశాక నెలకొన్న రాజకీయ సంక్షోభానికి మంగళవారం తెరపడింది. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి విశ్వాస పరీక్షలో ఓడిపోయి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో మంగళవారం రాత్రి నిర్వహించిన విశ్వాస పరీక్షలో కుమారస్వామికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు నమోదయ్యాయి. ఓటమి తర్వాత గవర్నర్ వాజూభాయ్ వాలాను కలసిన కుమారస్వామి రాజీనామా సమర్పించారు.
2019-07-23కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త పత్రికా సమావేశంలో ట్రంప్ ఈ మాట చెప్పడం సంచలన కారకమైంది. ‘‘రెండు వారాల క్రితం మోదీని కలిశాను. ఈ అంశంపై మాట్లాడాం. మీరు మధ్యవర్తిత్వం వహిస్తారా.. అని నన్ను అడిగారు. ఎక్కడ అని అడిగితే.. కాశ్మీర్ అన్నారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
2019-07-22