370వ రాజ్యాంగ అధికరణలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే క్లాజులను తొలగించడంతో దేశంలో ప్రజలందరికీ హక్కులు సమానం అయ్యాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటులో 370పై తీర్మానం చేసిన రెండు రోజుల తర్వాత గురువారం ప్రధాని జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. సర్దార్ పటేల్, బాబా సాహెబ్ అంబేద్కర్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్ పేయిలతో పాటు కోట్లాది మంది దేశభక్తుల కల ఇప్పుడు నెరవేరిందని మోదీ వ్యాఖ్యానించారు.
2019-08-08కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి(ఆర్టికల్ 370)తో పాటు రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. జమ్మూ, కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019 ద్వారా రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాలను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లడక్ ప్రాంతాన్ని అసెంబ్లీ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రతిపాదించింది. ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ ముఖచిత్రం మారిపోయింది. ఆ రాష్ట్ర రాజకీయ నాయకత్వం నామమాత్రంగా మారి ప్రజలు పూర్తిగా కేంద్ర పాలనలోకి వెళ్తున్నారు.
2019-08-05జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 370 అధికరణంలో 1 మినహా మిగిలిన సబ్ క్లాజులన్నిటినీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్రపతికి సిఫారసు చేశారు. సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఆర్టికల్ 370 ఉపసంహరణ, కాశ్మీర్ రాష్ట్ర విభజన చర్యలకు ఆమోదం తెలిపింది. అనంతరం రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
2019-08-05భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహ్మద్ సయీద్ లను గృహనిర్భంధంలో ఉంచారు. తమను అరెస్టు చేసినట్టు సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామి, కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్ చెప్పారు. రాష్ట్రమంతటా 144వ సెక్షన్, కొన్ని జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. కాశ్మీర్ లోయలోని అన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మొబైల్ ఫోన్స్ చాలాచోట్ల పని చేయడంలేదు.
2019-08-05అమరనాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడి చేస్తారన్న విశ్వసనీయ సమాచారంతోనే భద్రతకోసం అదనపు దళాలు వచ్చాయని, రాజ్యాంగ సవరణలు ఏమైనా ఉంటాయా అన్న సంగతి తనకు తెలియదని కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు. శనివారం తనను కలసిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి బృందంతో మాట్లాడిన అంశాలపై గవర్నర్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సరిహద్దులో పాకిస్తాన్ పెద్ద ఎత్తున కాల్పులు జరపడాన్ని ఆయన ప్రస్తావించారు.
2019-08-03 Read Moreఆర్టికల్ ‘35ఎ’ను బలహీనపరచడం, నియోజకవర్గాల పునర్విభజన లేదా రాష్ట్ర విభజన (మూడు భాగాలుగా) వంటి చర్యలకు పూనుకోవడంలేదని జమ్మూ-కాశ్మీర్ గవర్నర్ తనకు హామీ ఇచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి అదనపు బలగాల తరలింపు నేపథ్యంలో ఆయన శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను కలిశారు. పర్యాటకులు, అమరనాథ్ యాత్రికులు వెళ్లిపోవాలన్న ప్రభుత్వ ప్రకటన రాష్ట్రంలో భయాందోళనలకు కారణమైందని ఒమర్ చెప్పారు.
2019-08-03 Read More‘జమ్మూ కాశ్మీర్’కు రాజ్యాంగం కల్పించిన హోదాను నీరుగార్చే ఎలాంటి ప్రయత్నమూ చేయవద్దని ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మాజీ ముఖ్యమంత్రి, పీడీఎఫ్ నేత మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో వివిధ పార్టీల నాయకులు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ను కలసి ఓ వినతిపత్రం సమర్పించారు. మత ప్రాతిపదికన విభజనలను వ్యతిరేకించి సెక్యులర్ పంథాలో ఇండియాను ఎంచుకున్న కాశ్మీర్ మనసు గెలుచుకోవడంలో ఢిల్లీ నాయకత్వం విఫలమైందని వారు విమర్శించారు.
2019-08-02 Read Moreస్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) పరిమాణంలో ఇండియా ర్యాంకు 7కు దిగజారింది. 2018 జీడీపీ ర్యాంకులను ప్రపంచ బ్యాంకు తాజాగా వెల్లడించింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యు.కె. తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇండియాను అధిగమించిన ఫ్రాన్స్ 6వ స్థానానికి ఎగబాకింది. ఇండియా (7) తర్వాత ఇటలీ, బ్రెజిల్, కెనడా ఉన్నాయి. ఇండియా జీడీపీ 2.726 ట్రిలియన్ డాలర్లుగా ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అంటే.. శుక్రవారం ఉన్న మారకం విలువ ప్రకారం రూ. 189.86 లక్షల కోట్లు.
2019-08-02 Read Moreకాశ్మీర్ వివాదంపై ఏ చర్చలైనా ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షికంగానే జరుగుతాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అమెరికా స్టేట్ సెక్రటరీ మైక్ పాంపియోకి స్పష్టం చేశారు. థాయ్ లాండ్ లో జరుగుతున్న ఆసియాన్ 2019 సదస్సుకు ఈ ఇద్దరూ హాజరయ్యారు. కాశ్మీర్ అంశంలో జోక్యానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య ఆ ప్రస్తావన వచ్చింది.
2019-08-02 Read Moreజమ్మూ కాశ్మీర్ వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి అనుమానాస్పదంగా మారింది. ఇండియా, పాకిస్తాన్ కోరితే వివాద పరిష్కారానికి తాను జోక్యం చేసుకుంటానని మరోసారి వ్యాఖ్యానించారు. కాశ్మీర్లో మధ్యవర్తిత్వానికి తనను ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కోరారని గత వారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో బహిరంగంగా ట్రంప్ చెప్పారు. ఆ ప్రకటనను ఇండియా ఖండించింది. అయినా గురువారం మళ్ళీ అదే పాట పాడారు.
2019-08-02 Read More