నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ (ఆన్.ఆర్.సి)ని బెంగాల్ రాష్ట్రానికీ విస్తరిస్తామని, చొరబాటుదారులను వెళ్ళగొడతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే, ఈలోగా పౌరసత్వ చట్టానికి సవరణ బిల్లు తెస్తామని, దేశంలోకి వచ్చిన హిందువులు, సిక్కులు, జైన్లు, బుద్ధిస్టులు అందరికీ పౌరసత్వం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. మంగళవారం బెంగాల్ పర్యటనలో ఉన్న అమిత్ షా, ఎన్.ఆర్.సి.పై జరిగిన ఓ సదస్సులో మాట్లాడారు.

2019-10-01 Read More

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో హూస్టన్ సభలో ‘అబ్ కి బార్ ట్రంప్ సర్కార్- మరోసారి ట్రంప్ ప్రభుత్వం’ అని పిలుపు ఇవ్వడంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వివరణ ఇచ్చారు. మోదీ ఉద్ధేశం అది కాదని, ట్రంప్ గతంలో చెప్పిన మాటను మాత్రమే గుర్తు చేశారని జైశంకర్ పేర్కొన్నారు. ‘‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటున్న మీరు (ట్రంప్) అధ్యక్ష అభ్యర్ధిగానూ ఇండియన్ అమెరికన్లతో బంధాన్ని కోరుకుంటున్నారని అర్ధమవుతోంది’’ అని మోదీ చెప్పారని జైశంకర్ చెప్పుకొచ్చారు.

2019-10-01 Read More

అమెరికా నుండి ఆంక్షల బెదిరింపు ఉన్నప్పటికీ రష్యా నుండి క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసే హక్కును విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సమర్థించారు. అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్, ఆ దేశ మంత్రి మైక్ పాంపీని కలవడానికి ముందు ఈ అంశంపై విలేకరులతో మాట్లాడారు. "మేము ఏం కొనుగోలు చేస్తాం, ఎవరినుంచి కొనుగోలు చేస్తాం అన్నది మా సార్వభౌమ హక్కు. అమెరికా నుంచి ఏం కొనాలో ఏం కొనగూడదో మరో దేశం చెబితే మాకు ఇష్టం ఉండదు. అలాగే రష్యా నుంచి ఏం కొనాలో, కొనగూడదో మరే దేశం చెప్పినా మాకు ఇష్టం ఉండదు’’ అని జైశంకర్ ఉద్ఘాటించారు.  

2019-10-01 Read More

తెలంగాణ తెలుగుదేశం యువజన విభాగం అధ్యక్షుడు వీరేందర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన అక్టోబర్ 3వ తేదీన బిజెపిలో చేరనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడే ఈ వీరేందర్ గౌడ్. తెలంగాణలో టీడీపీ బలహీనపడటంతో ఆ పార్టీ నేతలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు.

2019-09-30

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని బిజెపి, శివసేన ఖరారు చేసినట్లు రాష్ట్ర బిజెపి సీనియర్ మంత్రి చంద్రకాంత్ పాటిల్ సోమవారం ఇక్కడ చెప్పారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సంయుక్త ప్రకటన ద్వారా సీట్ల భాగస్వామ్య పరిమాణాన్ని ప్రకటించనున్నట్లు పాటిల్ విలేకరులతో అన్నారు. ఆదిత్య ఠాక్రే ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి ఠాక్రే అవుతారు. ముంబైలోని వర్లి అసెంబ్లీ విభాగంలో పోటీ చేయనున్నట్లు ఆయన సోమవారం చెప్పారు.

2019-09-30 Read More

రాజకీయ కారణాలతో తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశంలో అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ వెళ్లి తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావుతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు సాయం చేయడంలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలను కేంద్రం వ్యతిరేకిస్తోందని, ఈ విషయంలో బీజేపీ వైఖరి సరిగా లేదని ఈ సమావేశంలో సిఎంలు అభిప్రాయపడినట్టు తెలిసింది.

2019-09-24 Read More

దేశంలో ప్రతి అభివృద్ధి పనినీ అడ్డుకుంటున్నవారే ‘జమ్మూ కాశ్మీర్’పై తమ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘‘ప్రజలకు తాగునీరు అందించడానికి ఓప్రాజెక్టు ఉంటే వ్యతిరేకిస్తారు. ఓ రైల్వే ట్రాక్ నిర్మిస్తుంటే వ్యతిరేకిస్తారు. వారి హృదయాలు కేవలం మావోయిస్టులు, తీవ్రవాదులకోసం స్పందిస్తాయి’’ అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370, 35(ఎ) ఇన్నాళ్లూ కాశ్మీర్ ప్రజల పాలిట బంధనాలుగా ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.

2019-08-14

కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను ఆ పార్టీ నేతలు మరోసారి సోనియాగాంధీకి అప్పగించారు. శనివారం సమావేశమైన పార్టీ వర్కింగ్ కమిటీ సోనియాను ‘మధ్యంతర’ అధ్యక్షురాలిగా ఎంపిక చేసింది. ఈ విషయం శనివారం బాగా పొద్దుపోయిన తర్వాత వెల్లడైంది. అంతకు ముందు వర్కింగ్ కమిటీ ఐదు సబ్ గ్రూపులు సమర్పించిన నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపింది. శనివారం ఉదయం ఓసారి సమావేశమైన కమిటీ రాహుల్ గాంధీని కొనసాగవలసిందిగా కోరింది. అయితే, ఆయన అప్పుడూ తిరస్కరించారు.

2019-08-10 Read More

కాంగ్రెస్ కొత్త సారథి ఎంపిక ఈ రాత్రి 9 గంటలకల్లా పూర్తవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ కొత్త సారథి ఎంపికకోసం శనివారం సమావేశమైంది. పార్టీ రాష్ట్ర కమిటీల నేతలు, 5 జోనల్ కమిటీల బాధ్యుల చర్చల అనంతరం ఎంపిక జరుగుతుంది. 2019 ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శనివారం నాటి సమావేశ ప్రారంభంలో హాజరైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. తర్వాత జరిగిన చర్చల్లో పాల్గొనలేదు.

2019-08-10 Read More

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర విభజన చట్టానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించి జమ్మూ-కాశ్మీర్ ప్రాంతాన్ని అసెంబ్లీ సహిత కేంద్రపాలిత ప్రాంతంగా, లడక్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. భారత తొలి హోం శాఖ మంత్రి, 565 సంస్థానాల విలీనంలో కీలక పాత్రధారిగా భావించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అక్టోబర్ 31) నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉనికిలోకి వస్తాయి.

2019-08-09 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page