ఉత్తర సిరియాలో కుర్దులకు వ్యతిరేకంగా చేపట్టిన మిలిటరీ దాడిని 120 గంటలపాటు నిలిపివేసేందుకు టర్కీ అంగీకరించిందని అమెరికా వెల్లడించింది. గురువారం అంకారా వెళ్ళిన అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చర్చల తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు. కుర్దు దళాలు సిరియా సరిహద్దులనుంచి 20 మైళ్ళు లోపలికి వెళ్లడానికి ఈ ఐదు రోజుల సమయాన్ని వినియోగించుకోవాలని పెన్స్ సూచించారు. సిరియాలో టర్కీ సరిహద్దు పొడవునా ఆ 20 మైళ్ళ ప్రాంతంలో ‘‘రక్షిత జోన్’’ ఏర్పాటు చేయాలని టర్కీ తలపెట్టింది.
2019-10-17 Read Moreప్రాంతీయ పార్టీలు కులతత్వం, అవినీతిలో మునిగి తేలుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత వైఎస్ (సుజనా) చౌదరి వ్యాఖ్యానించారు. ‘గాంధీ సంకల్ప యాత్ర’ పేరిట కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న చౌదరి, బుధవారం తన సొంత ప్రాంతమైన కంచికచర్లలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ‘‘బిజెపికి అవకాశం ఇవ్వండి. రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడండి. నేను పుట్టిన గడ్డ కంచికచెర్ల నుంచి పిలుపు ఇస్తున్నా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతివ్వండి’’ అని విన్నవించారు.
2019-10-16తెలంగాణ గవర్నరుగా ఇటీవలే నియమితురాలైన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం తీరుపై గవర్నర్ ఓ నివేదికను కేంద్రానికి సమర్పించినట్టుగా స్థానిక మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అయితే... రాజ్ భవన్ చేపట్టిన ప్లాస్టిక్ వాడకం, యోగా తరగతులు, రక్తదానం కార్యక్రమాలపై గవర్నర్ నివేదిక సమర్పించినట్టు తెలంగాణ సమాచార-ప్రజా సంబంధాల శాఖ తెలిపింది.
2019-10-15‘రైతుభరోసా’పై సిఎం జగన్ మాట మార్చారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 50 వేలు ఇస్తామని 2017 వైకాపా ప్లీనరీలో చెప్పారని, ప్రతి ఏటా మే నెలలోనే రూ. 12,500 ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కలిపి ‘రైతు భరోసా’ను ప్రకటించారని, అది కూడా ఏటా మూడు విడతలుగా ఇస్తామంటున్నారని నరేంద్ర ఆక్షేపించారు. 4 నెలల కాలంలోనే మాట తప్పిన ఏకైక ప్రభుత్వం ఇదేనని దుయ్యబట్టారు.
2019-10-15జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని (ఆర్టికల్ 370ని) ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ సవాలు విసిరారు. దమ్ముంటే ఆ నిర్ణయాన్ని రివర్స్ చేయాలన్నారు. ఆదివారం మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మోదీ ‘‘దాన్ని (370ని) మళ్లీ తెచ్చే ధైర్యం ఎవరికైనా ఉందా? ఆ ధైర్యం చేస్తే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుందా’’ అని మోదీ ప్రశ్నించారు.
2019-10-13 Read Moreఅక్టోబర్ 2 సెలవు రోజున మూడు బాలీవుడ్ సినిమాలు రూ. 120 కోట్లు వసూలు చేయడం ‘‘బలమైన ఆర్థికవ్యవస్థ’’కు నిదర్శనమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యం సూచనలను తోసిపుచ్చడానికి ఆయన సినిమా కలెక్షన్లను ప్రస్తావించారు. ఆర్థిక మాంద్యం ప్రభావం ఇండియా, బ్రెజిల్ దేశాలపై ఎక్కువగా ఉందని ఐఎంఎఫ్ పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వాదన వినిపించారు. 2017లో అత్యధిక నిరుద్యోగ రేటు 45 సంవత్సరాల గరిష్ఠానికి చేరిందన్న ఎన్ఎస్ఎస్ఒ నివేదికను కూడా రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు.
2019-10-12 Read Moreసరిహద్దు దేశం ఎరిత్రియాతో శాంతి స్థాపన ప్రయత్నాలకు గాను ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ 2019 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. 1998 నుండి 2000 వరకు సరిహద్దు యుద్ధంలో పోరాడిన దీర్ఘకాల శత్రువులు ఇథియోపియా, ఎరిత్రియా మధ్య 2018 జూలైలో సంబంధాలు పున:ప్రారంభమయ్యాయి. ఆ కృషిలో భాగమైన అబి అహ్మద్ నోబెల్ బహుమతిని డిసెంబర్ 10వ తేదీన ఓస్లోలో అందుకోనున్నారు.
2019-10-11 Read Moreచైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి ‘జి’కి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. జిన్ పింగ్ చెన్నైలో అడుగు పెట్టగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘వెల్ కం టు ఇండియా’’ అంటూ ట్విట్టర్లో ఆహ్వానం పలికారు. కొద్ది గంటల ముందుగా మోదీ చెన్నై చేరుకొని అక్కడినుంచి మామల్లాపురం వెళ్ళారు. ‘జి’తో తన అనధికార సమావేశంతో ఇండియా-చైనా సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్టు మోదీ చైనా భాషలో ఓ ట్వీట్ చేశారు.
2019-10-11 Read Moreచైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈ నెల 11, 12 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. చెన్నైకి దగ్గరగా ఉన్న మమల్లాపురం వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే 2వ అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో జిన్ పింగ్ ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై కూడా వారు చర్చించనున్నట్టు సమాచారం. తర్వాత జిన్ పింగ్ 13న నేపాల్ పర్యటనకు వెళ్తారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ బుధవారం ప్రకటించారు.
2019-10-09 Read Moreనరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ఏకంగా 22 అంశాలపై విజ్ఞాపన పత్రాలను ప్రధానికి అందించారు. విభజన హామీ మేరకు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఓ సంవత్సరానికి పెండింగ్ లో ఉన్నాయన్న కేసీఆర్, నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ కాకతీయ పథకానికి రూ. 5,000 కోట్లు, ‘మిషన్ భగీరథ’కు రూ. 19,205 కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరారు. * పూర్తి జాబితాకోసం ఎడమకు స్వైప్ చేయండి *
2019-10-04 Read More