చంద్రబాబు సంస్కారహీనుడు కావడంవల్లనే లోకేష్ మతిలేని మనిషిలా తయారయ్యాడని ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. లోకేష్ మతి లేనివాడనే మంగళగిరి ప్రజలు ఓడించి ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మోపిదేవి, టీడీపీ సమీక్షా సమావేశాల్లో చంద్రబాబు అసందర్భ ప్రేలాపనలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని మోపిదేవి ధ్వమజెత్తారు.
2019-10-21ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోమవారం కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకలేదు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో 15 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఉండటంతో ఈరోజు అమిత్ షా కలవలేకపోయారని చెబుతున్నారు. అయితే, జగన్ సోమవారం రాత్రి ఢిల్లీలో ఉండేందుకు ముందే సిద్ధపడి వెళ్ళారు. మంగళవారం అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన జగన్, ప్రధానమంత్రి మోదీని కలవగలిగారు. కానీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకలేదు.
2019-10-21బొలీవియా ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ఎవో మొరేల్స్ ఆధిక్యత చాటారు. 83 శాతం బ్యాలెట్లను లెక్కించేసరికి మొరేల్స్ 45 శాతం ఓట్లతో తన ప్రత్యర్ధి కార్లోస్ మీసా (38 శాతం) కంటే ముందున్నారు. అయితే, రెండో రౌండ్ పోటీ తప్పకపోవచ్చని భావిస్తున్నారు. బొలీవియాలో... మొదటి రౌండ్ లో 50 శాతం ఓట్లు లేదా 40 శాతం ఓట్లతో ప్రత్యర్ధిపై 10 పాయింట్ల లీడ్ ఉంటే సరేసరి. లేదంటే ప్రధాన ప్రత్యర్ధులిద్దరూ డిసెంబర్ 15న రెండో రౌండ్ లో తలపడాల్సి ఉంటుంది. దక్షిణ అమెరికాలో ఎక్కువ కాలం పని చేసిన అధ్యక్షుడు మొరేల్స్.
2019-10-21 Read Moreఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాటకీయంగా వ్యవహరించింది. ప్రగతి భవన్ వరకు రాకుండానే నేతలను అరెస్టు చేయాలనే పోలీసుల ప్రయత్నాలను రేవంత్ రెడ్డి, మరికొందరు నేతలు ఛేదించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో లేరని బయట కాపలా కాస్తున్న పోలీసులను నమ్మించి ఆ తర్వాత మోటారు సైకిల్ పైన బయలుదేరారు. వెంబడించిన పోలీసులు మధ్యలో అరెస్టు చేశారు.
2019-10-21ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం ఉదయం ఢిల్లీలో ఆయనకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాషాయ కండువా కప్పారు. ఆదినారాయణరెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది కొంత కాలానికి అధికార టీడీపీలో చేరారు. చంద్రబాబు చివరి మంత్రివర్గంలో ఆయనొక సభ్యుడు. టీడీపీ ఓటమి తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఆయనను తట్టుకోవడం సాధ్యం కాదని బీజేపీలో చేరారు.
2019-10-21తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె 17 రోజున ‘ప్రగతి భవన్’ ముట్టడిని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉండగా, ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ప్రగతి భవన్ చుట్టుప్రక్కల పోలీసులను భారీగా మోహరించారు. మొన్న జరిగిన తెలంగాణ బంద్ విజయవంతం కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
2019-10-21పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన సందర్భంపై కాంగ్రెస్ నాయకుడు అఖిలేష్ సింగ్ సందేహం వ్యక్తం చేశారు. హర్యానా, మహారాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు దాడులు జరగడాన్ని ఎత్తిచూపారు. "దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా జరిగే సర్జికల్ స్ట్రైక్ వెనుక ఒక నమూనా ఉంది" అని సింగ్ పాట్నాలో విలేకరులతో అన్నారు. "ఇప్పుడు, ఈ దేశ రాజకీయాలు సర్జికల్ స్ట్రైక్స్ పైనే జరుగుతాయి.’’ అని వ్యాఖ్యానించారు.
2019-10-20‘యూరోపియన్ యూనియన్ (ఇయు)’ నుంచి తప్పుకునే ప్రక్రియ (బ్రెగ్జిట్) ఈ నెల 31నే జరుగుతుందని బ్రిటన్ ప్రభుత్వ మంత్రి మైఖేల్ గోవ్ ఆదివారం స్పష్టం చేశారు. ‘బ్రెగ్జిట్’ను ఆలస్యం చేయాలని బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు పట్టుపట్టినప్పటికీ ప్రభుత్వ నిర్ణయంలో మార్పు లేదని మంత్రి మాటలను బట్టి తెలుస్తోంది. ‘‘పార్లమెంటు పంపమన్నందున ఆ లేఖను పంపాల్సి వచ్చింది. అయితే, ప్రధానమంత్రి నిర్ణయాన్ని, ప్రభుత్వ విధానాన్ని పార్లమెంటు మార్చలేదు’’ అని గోవ్ ఉద్ఘాటించారు.
2019-10-20 Read Moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమవుతారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలసిన జగన్మోహన్ రెడ్డి, అప్పట్లో అమిత్ షా బిజీగా ఉండటంవల్ల కలవలేకపోయారు. అమిత్ షా అపాయింట్ మెంట్ మళ్లీ ఇప్పటికి దొరికింది. ఈ సందర్భంగానే ఇతర మంత్రులనూ కలిసే అవకాశం ఉంది. విభజన అంశాలతో పాటు వివిధ అంశాలపై అమిత్ షాతో సిఎం చర్చిస్తారని అధికారిక సమాచారం.
2019-10-20అమెరికా, మిత్ర దేశాలు వ్యతిరేకించినా... ఐక్యరాజ్య సమితి (యుఎన్) మానవ హక్కుల మండలిలో వెనెజులా స్థానం దక్కించుకుంది. గురువారం జరిగిన ఈ పరిణామాన్ని ‘‘చారిత్రక విజయం’’గా వెనెజులా అభివర్ణిస్తే, ‘‘ఐరాసకే అవమానకరం’’గా అమెరికా పేర్కొంది. జెనీవాలోని మానవ హక్కుల మండలికి ఐరాస సాధారణ అసెంబ్లీ 14 మంది నూతన సభ్యులను ఎన్నుకుంది. మూడేళ్ళ కాలానికి ప్రాంతీయ గ్రూపుల వారీగా సభ్య దేశాలను ఎన్నుకుంటారు. దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్ 153 ఓట్లు, వెనెజులా 105 ఓట్లతో సభ్యులయ్యాయి.
2019-10-18 Read More