రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చెబుతున్నవన్నీ అసత్యాలేనని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సరఫరాలపై చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. సుమారు రూ. 2.6 లక్షల కోట్ల అప్పులు, పెద్ద మొత్తంలో గ్యారంటీలతో దరిద్రాన్ని రూ. 20 వేల కోట్లు వడ్డీలకు చెల్లించాల్సిన దరిద్రాన్ని వారసత్వంగా ఇచ్చారని బుగ్గన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అధికంగా ఉండటాన్నే ఎస్.బి.ఐ. ఎత్తి చూపిందని చెప్పారు.

2019-10-23

ఇండియన్ కెనడియన్లలో సిక్కుల ప్రభావం బాగా ఎక్కువ. ఆ దేశ పార్లమెంటు దిగువ సభ(హౌస్ ఆఫ్ కామన్స్)కు తాజాగా తాజాగా జరిగిన ఎన్నికల్లో 18 మంది సిక్కులు ఎన్నికయ్యారు. అదే సమయంలో ఇండియా లోక్ సభలో సిక్కుల సంఖ్య 13. అక్కడ అధికార లిబరల్ పార్టీ నుంచే 13 మంది ఎన్నిక కాగా, కన్సర్వేటివ్ పార్టీ నుంచి నలుగురు, న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. మొత్తం 338 సీట్లలో లిబరల్ పార్టీ ఈసారి మెజారిటీ కంటే తక్కువగా 157 సీట్లను మాత్రమే గెలిచింది. ప్రధాని జస్టిన్ ట్రూడూ మైనారిటీ ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తోంది.

2019-10-23

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో ట్రెండింగ్ జాబితాలో చేరింది. దానికి కారణం ఆ ఫొటోలో ఆయన... అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన విదేశాంగ మంత్రి ‘హెన్రీ కిసింజర్’తో కలసి ఉండటమే. 1971 యుద్ధంలో పాకిస్తాన్ కోసం నేవీని ఇండియాపైకి పంపడమే కాకుండా, ‘‘ఇండియన్స్ బాస్టర్డ్స్’’ అని నిందించిన పెద్ద ‘‘యుద్ధ నేరస్తుడు’’. జెపి మోర్గాన్ అంతర్జాతీయ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరిగిన సందర్భంగా మోదీ కిసింజర్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లను కలుసుకున్నారు.

2019-10-22

అమరావతి అభివృద్ధి అయితే తన పేరే చెబుతారన్న దుగ్ధతో చంపేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. 33 వేల ఎకరాలు సమీకరించడం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎలా సాధ్యమైందంటూ అంతర్జాతీయంగా అధ్యయనాలు జరుగుతున్నాయన్న బాబు, అలాంటి బంగారు గుడ్లు పెట్టే బాతును మీ చేతికి ఇస్తే చంపేస్తారా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి కూడా ఇదే పని చేసి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి కొనసాగేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

2019-10-22

విభజనతో తలెత్తిన సమస్యలు ప్రత్యేక కేటగిరి హోదా ద్వారానే పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు విన్నవించారు. మంగళవారం అమిత్ షాను కలసిన సిఎం జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి వినతిపత్రం సమర్పించారు. అందులోని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 76.2 శాతంగా ఉండే పరిశ్రమలు, సేవారంగాల వాటా విభజన తర్వాత 68.2 శాతానికి పడిపోయిందని జగన్ కేంద్ర మంత్రికి నివేదించారు.

2019-10-22

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘అపాయింట్ మెంట్’ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం అపాయింట్ మెంట్ లభించని నేపథ్యంలో సిఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లి నిన్నంతా వేచి చూశారు. మంగళవారం అమిత్ షా పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసే అవకాశం వచ్చింది. శుభాకాంక్షలు తెలిపిన జగన్ తో కొద్ది నిమిషాలే అమిత్ షా మాట్లాడారని, అప్పుడే సిఎం ఓ వినతి పత్రాన్ని సమర్పించారని వార్తలు వచ్చాయి. అయితే, అమిత్ షాతో 45 నిమిషాల సేపు సిఎం చర్చించారని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

2019-10-22

విమర్శకులపై కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడుతున్న వేళ ‘దేశద్రోహం’ కేసులు నమోదు చేయడం పెరిగింది. 2017లో 51 దేశద్రోహం కేసులు నమోదైనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) 2017 నివేదిక చెబుతోంది. ఈ కేటగిరిలో 2015లో 30 కేసులు నమోదు కాగా, 2016లో 35 నమోదు చేశారు. రాజ్యానికి వ్యతిరేకంగా ఇతర నేరాలకు పాల్పడిన ఉదంతాల్లో 109 కేసులు నమోదయ్యాయి. 2015లో 117, 2016లో 143 నమోదు కాగా ఈ కేసులు 2017లో తగ్గాయి. దేశద్రోహం కేసుల్లో 2018, 2019లలో మరింత పెరుగుదల కనిపించొచ్చు.

2019-10-22

గత చంద్రబాబు మంత్రివర్గంలో సీనియర్ మోస్ట్ యనమల రామకృష్ణుడిని దేశంలోనే అత్యంత అసమర్ద ఆర్థిక మంత్రిగా అభివర్ణించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి. ‘‘దేశంలోనే అత్యంత అసమర్థ ఆర్థిక మంత్రిగా యనమల గారు రికార్డులకెక్కారు. అధిక వడ్డీ ఆశ చూపి దొరికిన చోటల్లా అప్పు చేసి బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీ కంటే దారుణంగా ఆర్థిక నిర్వహణ సాగింది ఆయన హయాంలో. అధికారం కోల్పోయాక శ్రీరంగ నీతులు చెబుతున్నారు’’ అని సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.

2019-10-21

గ్రామ వాలంటీర్ల పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వేలకోట్లు దోచిపెడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ‘‘4 లక్షల మందికి రూ. 8000 అంటే మొత్తం రూ. 8,400 కోట్లు. ఎవడబ్బ సొమ్మని మీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు?’’ అని శ్రీకాకుళం పార్టీ సమావేశంలో సిఎంను ప్రశ్నించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నాపత్రం టైపు చేసిన అమ్మాయికే ర్యాంకు వస్తుందని, ఒకే ఇంట్లో ర్యాంకులు వస్తాయని ఎద్దేవా చేశారు.

2019-10-21

తమ పార్టీ నేతలు దాడులకు గురవుతుంటే చర్యలు తీసుకోవలసిన డీజీపీ, తామే మీడియా షో చేస్తున్నామని వ్యాఖ్యానించడం ఏమిటని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ‘‘పోలీసు అమరవీరుల దినోత్సవాన మాట్లాడకూడదనుకున్నా. కానీ, ఆయన (డీజీపీ) ఏం మాట్లాడాడు? మనది మీడియా షో అంటాడు. ఇంతమంది చనిపోయి, బాధలు పడుతుంటే మళ్లీ మాపైనే దాడులు చేస్తారా? పత్రికలపై కేసులు పెట్టమంటారా? సోషల్ మీడియాలో మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

2019-10-21
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page