మహారాష్ట్రలో అధికార పీఠం రిమోట్ కంట్రోల్ శివసేన చేతుల్లో ఉందని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. బాల్ థాకరే సమయంలో వాడుకలో ఉన్న ఈ పదజాలంతో బీజేపీకి మరోసారి హెచ్చరికలు పంపారు. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేసిన శివసేన 56 సీట్లను గెలిచింది. బీజేపీ 105 సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో సిఎం కుర్చీని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని, ఈ విషయంపై రాతపూర్వక ఒప్పందం కుదుర్చుకుందామని శివసేన నిన్న ప్రతిపాదించింది.

2019-10-27 Read More

తీహార్ జైలునుంచి బెయిలుపై విడుదలై శనివారం కర్నాటకలో అడుగుపెట్టిన సీనియర్ కాంగ్రెస్ నేత డి.కె. శివకుమార్ కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్టుకు వచ్చిన నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘వాళ్లు (బీజేపీ పెద్దలు) నన్ను మరింత ధృఢంగా మార్చారు. బలహీనంగా మారే ప్రశ్నే లేదు. లొంగిపోయే ప్రశ్న అంతకంటే లేదు. న్యాయంకోసం పోరాడతా’ అని శివకుమార్ ఉద్ఘాటించారు.

2019-10-26

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన నేపథ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులను ప్రకటించారు. నియోజకవర్గంలోని హుజూర్ నగర్ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, నేరేడుచెర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేశారు. మండల కేంద్రాలకు రూ. 30 లక్షల చొప్పున, 134 గ్రామాలకు రూ. 20 లక్షల చొప్పున సిఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేయనున్నట్టు శనివారం హుజూర్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో సిఎం వెల్లడించారు.

2019-10-26

హర్యానాలో బిజెపి, జననాయక్ జనతా పార్టీ (జెజెపి) కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. జెజెపి అధినేత దుష్యంత్ చౌతాలా శుక్రవారం రాత్రి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమై ఒక ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారం బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారు. దుష్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నదే తమ అభిప్రాయమని చౌతాలా ఈ సందర్భంగా చెప్పారు. రేపు చండీగఢ్ లో గవర్నరును కలవనున్నట్టు సిఎం మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు.

2019-10-25

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు అశ్వత్థామరెడ్డిపై కూకట్ పల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కార్మికుల ఆత్మహత్యలకు అశ్వత్థామరెడ్డిదే బాధ్యత అంటూ కూకట్ పల్లి డిపో డ్రైవర్ కోరేటి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ కార్మికులది కాదని, అది అశ్వత్థామరెడ్డిదేనని రాజు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

2019-10-25

హర్యానాలో తాతలు స్థాపించిన ఐ.ఎన్.ఎల్.డి.ని చీల్చి జన్ నాయక్ జనతా పార్టీ (జెజెపి)ని స్థాపించిన దుష్యంత్ చౌతాలా బీజేపీకి స్నేహహస్తం చాచారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన బీజేపీకి మద్ధతు ప్రకటించే అవకాశం ఉంది. చౌతాలాను హర్యానా డిప్యూటీ సిఎంగా ప్రకటించవచ్చని సమాచారం. 90 సీట్ల హర్యానా అసెంబ్లీలో ఎవరికీ మెజారిటీ రాని పరిస్థితుల్లో జెజెపి గెలిచిన 10 సీట్లు కీలకమయ్యాయి.

2019-10-25 Read More

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే (గన్నవరం) వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలసి వంశీ తాడేపల్లిలోని సిఎం నివాసానికి వెళ్ళారు. వంశీ నకిలీ ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారంటూ ఇటీవల కేసు నమోదైంది. సీఎంను ఈ కేసు విషయమై కలిశారా? అధికార పార్టీలో చేరతారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిఎంను కలవక ముందు వంశీ గుంటూరులో బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు.

2019-10-25

‘‘ముగిసేది సమ్మె కాదు... ఆర్టీసీనే’’ అని తెలంగాణ సిఎం కేసీఆర్ గురువారం పదే పదే ప్రకటించారు. వచ్చే వారం 7000 ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తామనీ చెప్పారు. ఆ ప్రకటనల్లోని అంతరార్ధం... ఆర్టీసీ కార్మికులను మరింతగా భయపెట్టి సమ్మెను భగ్నం చేయడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తబస్సులకోసమని చెప్పిన కొద్ది రోజుల సమయం నిజానికి కార్మికులకు విధించిన ‘డెడ్ లైన్’గా భావిస్తున్నారు. 30న ‘సకలజనుల సమరభేరి’ జరగక ముందే సమ్మెను ముగించడమే అసలు లక్ష్యమట! కేసీఆర్ మాటలకు అర్ధాలే వేరు!!

2019-10-24

ఆశ్చర్యకరంగా... ఇండియాలో రెండు ప్రధాన వివాదాస్పద అంశాలపై అమెరికా కాంగ్రెస్ చర్చించింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలపై విధించిన అంక్షలు, అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి) ప్రచురణ నేపథ్యంలో ఇండియాలో మైనారిటీల పరిస్థితిపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. మంగళవారం జరిగిన ఈ చర్చలో సభ్యురాలు అలిస్ వెల్స్ మాట్లాడుతూ... మత స్వేచ్ఛపై సార్వత్రిక హక్కును గౌరవించాలని సూచించారు. పౌరులే కాదంటున్న 19 లక్షల మంది అస్సాం వాసులతో పాటు ప్రమాదంలో ఉన్న అందరినీ కాపాడాలని కోరారు.

2019-10-23

కేసులున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ధైర్యం చేయలేరని, నిన్న జగన్ ఢిల్లీ పర్యటనతో అదే రుజువైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. సీఎంకు కేంద్ర మంత్రుల ఇంటర్వ్యూలు కూడా లభించడంలేదని, గట్టిగా మాట్లాడితే సీబీఐ కేసులు బయటకు తీస్తారని భయమని పవన్ వ్యాఖ్యానించారు. బుధవారం ప్రకాశం జిల్లా జనసేన నాయకుల సమావేశంలో పవన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి నేరాలను ప్రోత్సహించడంవల్లనే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తున్నారని పవన్ ఆరోపించారు.

2019-10-23
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page