ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరగదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తమలో కసి పెరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆర్టీసీ విలీనం విషయంలో ‘ఏపీలో ఏ మన్నూ జరగలేద’ని గత వారం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో ఏపీ ప్రభుత్వం విలీన ప్రక్రియపై ఓ కమిటీని అదే రోజు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ‘‘వ్యవస్థలన్నీ ప్రైవేటుపరం అవుతున్న తరుణంలో ఒక కార్పొరేషన్ ను ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప నిర్ణయం, మొండి నిర్ణయం. కేసీఆర్ వ్యాఖ్యలు మాలో కసిని పెంచాయి’’ అని నాని చెప్పారు.
2019-10-30వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజదొంగల్లా, పందికొక్కుల్లా ఇసుకను దోచుకుంటున్నారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇసుక సంక్షోభంతో నిర్మాణ రంగం నిలిచిపోయి కార్మికులు కొందరు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, ప్రభుత్వ విధానానికి నిరసనగా లోకేష్ బుధవారం గుంటూరులో ఒక రోజు దీక్ష చేపట్టారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా గత ప్రభుత్వం అని తమపైనే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
2019-10-30రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానానికి నిరసనగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన దీక్షను మంత్రి శ్రీకాంత్ రెడ్డి ఎగతాళి చేశారు. బుధవారం మంత్రివర్గ సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... మాజీ సీఎం చంద్రబాబును ఉద్ధేశించి ‘‘గతంలో నీ కొడుకు ఎలా దోచుకున్నాడో.. ఆయన శరీరం చూస్తేనే తెలుస్తుంది. ఈరోజు డైటింగ్ కార్యక్రమంలా దీక్ష పెట్టాడు’’ అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కూడా టీడీపీ పార్లమెంటు సభ్యులు నలుగురు ‘హోదా రాదు... ఆరోగ్యంకోసం దీక్షలో కూర్చుందాం’ అన్నారని గుర్తు చేశారు.
2019-10-30ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుతింటోందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా బుధవారం సరూర్ నగర్లో నిర్వహించిన ‘సకల జనుల సమర భేరి’లో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీనం మా ఎజెండాలో లేదన్న మంత్రులపై రేవంత్ మండిపడ్డారు. ఆర్టీసీలో 20 శాతాన్ని మేఘ కృష్ణారెడ్డికి రాసి ఇస్తామని మీ మేనిఫెస్టోలో ఉందా? అని ప్రశ్నించారు. ఏపీ తరహాలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తీరాలని రేవంత్ అల్టిమేటం జారీ చేశారు.
2019-10-30ఇసుక సంక్షోభంపై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన నవంబర్ 3న విశాఖపట్నంలో తలపెట్టిన "లాంగ్ మార్చ్"కు హాజరు కావాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. ఇందుకు కన్నా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు జనసేన ప్రకటించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యపై అన్ని పార్టీలనూ కూడగట్టినట్టే... ఇక్కడ తమ ఉపాధికోసం అందరినీ ఏకం చేయాలని భవన నిర్మాణ కార్మికులు పవన్ కల్యాణ్ కు విన్నవించారని జనసేన తెలిపింది. అందులో మొదటి అడుగుగా కన్నాకు ఫోన్ చేసినట్టు జనసేన ప్రకటనలో పేర్కొన్నారు.
2019-10-30‘‘ఉగ్రవాదం అంతం, శాశ్వత శాంతి’’ కోసం భారత ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వనున్నట్టు యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రైవేటు పర్యటనకు వచ్చిన 23 మంది ఎంపీల బృందం ముఖ్యులు బుధవారం శ్రీనగర్లో విలేకరులతో మాట్లాడారు. అయితే, ఈ సమావేశానికి స్థానిక కాశ్మీరీ మీడియాను అనుమతించలేదు. నిన్నటినుంచి పర్యటనలో కూడా స్థానికులెవరితోనూ, రాజకీయ నాయకులతోనూ ఈ బృందం చర్చించలేదు. ఇంకోసారి కలుస్తామని ఎంపీలు చెప్పారు.
2019-10-30ఆగస్టు 5వ తేదీన కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఒక విదేశీ బృందం మంగళవారం ఆ రాష్ట్రంలో పర్యటించింది. దేశంలోని రాజకీయ నాయకులనే కాశ్మీర్లో అడుగు పెట్టనివ్వని కేంద్ర ప్రభుత్వం, యూరోపియన్ పార్లమెంటరీ బృందపు ‘అనధికార’ పర్యటనకు ఏర్పాట్లు చేయడం వివాదాస్పదమైంది. ఈ బృందంలోని ముఖ్యులు జాత్యహంకార, ముస్లిం వ్యతిరేక పార్టీల ప్రతినిధులు కావడమే అందుకు కారణం. భారీ భద్రత మధ్య శ్రీనగర్లో కర్ఫ్యూ వాతావరణంలో ఈ బృందం పర్యటన సాగింది.
2019-10-29ముఖ్యమంత్రి పీఠాన్ని సగం సగం కాలం (50:50) పంచుకుందామన్న హామీ ఏదీ శివసేనకు ఇవ్వలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. మరో ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఉద్ఘాటించారు. ఎన్నికల అవగాహనలో భాగంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తనకు 50:50 ఫార్ములాపై హామీ ఇచ్చారని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే చెప్పిన నేపథ్యంలో ఫడ్నవీస్ స్పందించారు. బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్నిక బుధవారం లాంఛనమేనని ఆయన చెప్పారు.
2019-10-29‘‘తండ్రి జైల్లో ఉన్న దుష్యంత్ చౌతాలా ఎవరూ ఇక్కడ (మహారాష్ట్రలో) లేరు’’... బిజెపిపై శివసేన నేత సంజయ్ రౌత్ విసిరిన వ్యంగ్యాస్తం ఇది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యంపై ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా స్పందించారు. హర్యానాలో మెజారిటీ లేక జెజెపి అధినేత దుష్యంత్ చౌతాలాను కలుపుకోవడానికి, తీహార్ జైలులో ఉన్న ఆయన తండ్రి అజయ్ చౌతాలాను ఉపయోగించుకుంది బీజేపీ. మహారాష్ట్రలో ఇలాంటి ఒత్తిళ్లు నెరవేరవని శివసేన స్పష్టం చేసింది. శరద్ పవార్ ఎప్పటికీ బీజేపీతో కలవరని కూడా సంజయ్ వ్యాఖ్యానించారు.
2019-10-29గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, బీజేపీ నేత సుజనా చౌదరిని కలసిన నేపథ్యంలో వంశీ పార్టీ మారతారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఊహించినట్టుగానే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన వంశీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. అయితే, తాను రాజకీయాలనుంచే తప్పుకొంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పుడైనా తన కార్యకర్తలకు వైసీపీ ప్రభుత్వం నుంచి వేధింపులు తప్పుతాయని ఆశిస్తున్నట్టు వంశీ పేర్కొన్నారు.
2019-10-27