ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇటీవల మధు రెండు మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. తాడేపల్లిలో సిఎం నివాసానికి దగ్గర్లోనే మధు నివాసం కూడా ఉంది.

2019-11-07

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యంనుు అర్ధాంతరంగా తొలగించిన తీరుపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ప్రధాన కార్యదర్శిని అవమానించినట్టుగా తొలగించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించగా, అది ముఖ్యమంత్రి నిరంకుశ ధోరణి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. షోకాజ్ నోటీసు అందుకున్న అధికారి (సిఎంఒ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్) ప్రధాన కార్యదర్శిని తప్పిస్తూ జీవో ఇవ్వడం ఏమిటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

2019-11-04

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సినీ నటుడు మోహన్ బాబు సోమవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘రెండు రోజుల క్రితం... క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటినుంచి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్దం తెలియని వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే’’ అని మోహన్ బాబు ట్విట్టర్లో స్పందించారు. ‘‘దయచేసి నా పేరుకు భంగం కలిగించేట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది’’ అని మోహన్ బాబు హెచ్చరించారు.

2019-11-04

పోయిన చోటే వెతుక్కోవాలన్నారు పెద్దలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తాను ఓటమి పాలైన విశాఖ నగరంలో అదే పని చేశారు. భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా ఆదివారం నిర్వహించిన ‘లాంగ్ మార్చ్’ విజయవంతమైంది. మార్చ్ తలపెట్టిన వీధులన్నీ జనంతో నిండిపోయాయి. వేదిక, పార్కింగ్ విషయంలో పోలీసులు సహాయ నిరాకరణ చేయగా వాహనం పైనుంచే పవన్ ప్రసంగించారు. రాజకీయ అనుభవం లేదని గత ఎన్నికల్లో తనను ప్రజలు నమ్మకపోయినా... తాను మాత్రం అండగా ఉంటానని పవన్ వ్యాఖ్యానించారు.

2019-11-03

‘‘మీరు ఎక్కువ చిందులు వేస్తే ఏం చేయాలో నాకు తెలుసు. చాలా బలమైన వ్యక్తులు తెలుసు. ఈ దేశాన్ని పాలించే వ్యక్తులు నేనంటే ఇష్టపడేవారు. ప్రత్యేకించి ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలకు వివరిస్తా’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతలను హెచ్చరించారు. ఆదివారం విశాఖ ‘‘లాంగ్ మార్చ్’’లో మాట్లాడుతూ ‘‘వీళ్ళను ఇప్పటికిప్పుడు దింపి అధికారంలోకి రావాలని నాకు లేదు. కాకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను’’ అని హెచ్చరించారు. కూల్చివేతలతో మొదలు పెట్టిన ప్రభుత్వం కూలిపోతుందనీ పవన్ వ్యాఖ్యానించారు.

2019-11-03

తనను విమర్శించిన వైసీపీ మంత్రులపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యక్షంగా కన్నబాబును, పరోక్షంగా అవంతి శ్రీనివాస్ ను హెచ్చరించారు. ‘‘కన్నబాబును మేమే రాజకీయాల్లోకి తెచ్చాం. నాగబాబుగారు తెచ్చారు. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇక్కడ (విశాఖలో) ఒకరు (అవంతి శ్రీనివాస్) మాట్లాడుతున్నారు. మీ బతుకులు మాకు తెలియవా? మీరు ఎక్కడినుంచి వచ్చారు...ఏం మాట్లాడుతారు. ఓడిపోయామనా?’’ అని పవన్ మండపడ్డారు. ఓడిపోయినవారికి హక్కు లేదంటే అంబేద్కర్, కాన్షీరాం ఓడిపోయారు.

2019-11-03

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన... పోయిన తెలుగుదేశం పార్టీ బెటర్ అనుకునేలా ఉందని జనసేన నాయకుడు, పవన్ సోదరుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకు ఆయన ఓ తండ్రీ కొడుకుల కథ చెప్పారు. ‘‘ఓ తండ్రి ఊళ్లోవాళ్లని తిడుతూ ఉండేవాడు. చనిపోయే సమయంలో కొడుకును పిలిచి తనకు మంచి పేరు తేవాలని కోరాడు. కొడుకు ఆలోచించి ఊళ్లో జనాన్ని తన్నడం మొదలుపెట్టాడు. అప్పుడు జనం... వీడికంటే వాళ్ల బాబే బెటర్ అనుకున్నారు. అలాగే... టీడీపీ తిడితే ఇప్పుడు వైసీపీ కొడుతోంది’’ అని నాగబాబు చెప్పారు.

2019-11-03

భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో విశాఖపట్నంలో ‘లాంగ్ మార్చ్’ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు. ‘‘వైసీపీకి, నన్ను విమర్శించిన ప్రతి మంత్రికీ చెబుతున్నా... రెండు వారాలు టైం ఇస్తున్నా. ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరికి రూ. 50 వేలు పరిహారం ఇవ్వండి. చనిపోయిన 36 మందికి 5 లక్షలు ఇవ్వండి. రెండు వారాల్లో స్పందన రాకపోతే నేను అమరావతి వీధుల్లో నడుస్తా. పోలీసులను పెడతారో... ఆర్మీని తెప్పించుకుంటారో మీ ఇష్టం’’ అని పవన్ హెచ్చరించారు.

2019-11-03

పరిధి దాటితే తాట తీస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల ‘లాంగ్ మార్చ్’లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘విజయసాయిరెడ్డి మాట్లాడితే టీమ్ బి, దత్తపుత్రుడు, డిఎన్ఎ అంటున్నారు. మా డిఎన్ఎ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికీ లేదు. విజయసాయిరెడ్డిని అడుగుతున్నా... ఏ డిఎన్ఎ ఉందని మీ అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచారు?’’ అని పవన్ విరుచుకుపడ్డారు.

2019-11-03

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ తిరుగు బాణం వదిలారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉన్నందున నష్టాల్లో ఆ మేరకు భాగం పంచుకోవాలని కోరనున్నట్టు శనివారం చెప్పారు. కేంద్రం ఇటీవల చేసిన చట్టం ప్రైవేటు బస్సులకు అవకాశం కల్పిస్తోందని, ఆ చట్టాన్ని ఆమోదించిన తెలంగాణ బీజేపీ ఎంపీలు తమను ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీని విలీనం చేయడం విపరిణామాలకు దారి తీస్తుందని, మరో 90 కార్పొరేషన్లు అదే డిమాండ్ చేస్తాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

2019-11-02
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page