శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సిఎం అవుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మరాఠా రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. శనివారం ఉదయాన్నే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాత్రికి రాత్రే రాజకీయం మారిపోగా... గవర్నర్ నేరుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
2019-11-23శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారు. శుక్రవారం ముంబయిలోని నెహ్రూ సైన్స్ సెంటరులో కాంగ్రెస్ సహా మూడు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఆయనీ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేన, ఎన్సీపీ పంచుకుంటాయన్న ఊహాగానాలకు పవార్ తెర దించారు. ఐదేళ్లూ థాకరేనే ముఖ్యమంత్రి అని చెప్పారు. అయితే, కనీస ఉమ్మడి కార్యక్రమంలోని కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది.
2019-11-22తమ ఎంపీలు ఒక్కరు కూడా పార్టీ మారబోరని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉద్ఘాటించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు మాథ్యమం విషయంలో ముఖ్యమంత్రి జగన్ వైఖరికి భిన్నంగా పార్లమెంటులోనూ, వెలుపలా రఘురామకృష్ణంరాజు మాట్లాడటం కలకలం రేపిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే తనకు పరిచయం ఉందని వివరణ ఇచ్చారు.
2019-11-22తెలంగాణ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖ బుధవారం వెల్లడించింది. 1993లొ జర్మనీ వెళ్లిన రమేష్.. తర్వాత ఆ దేశ పౌరసత్వం పొందారు. 2009లో ఇండియా వచ్చి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులు రమేష్ ద్వంద పౌరసత్వంపై న్యాయపోరాటం చేశారు. రమేష్ పౌరసత్వం రద్దుపై కేంద్ర హోం శాఖ 2017లో నిర్ణయం తీసుకోగా, ఆయన సమీక్ష కోరారు. దశాబ్ద కాలపు ఈ వివాదానికి కేంద్రం బుధవారం ముగింపు పలికింది.
2019-11-20మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సిఫారసు చేసిన సమయానికే కేంద్ర కేబినెట్ కూడా ఈ అంశంపై తీర్మానం చేసింది. కేబినెట్ సిఫారసు ఫైల్ ను కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతకంకోసం ఆయన కార్యాలయానికి పంపింది. ప్రభుత్వ ఏర్పాటుకోసం మూడో అతి పెద్ద పార్టీ ఎన్సీపీకి ఇచ్చిన గడువులో మరో 5 గంటలు మిగిలి ఉండగానే ఈ రెండు పరిణామాలు జరిగాయి. మహారాష్ట్ర రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నిర్ధారించారు.
2019-11-12మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకోసం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాత్రి 8.30 వరకు గడువిచ్చిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, ఈలోగానే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. రాజ్యాంగంలోని 356 అధికరణం కింద రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు మంగళవారం నివేదిక పంపినట్టు మహారాష్ట్ర రాజ్ భవన్ ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని గవర్నర్ అభిప్రాయపడినట్టు ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ విఫలమయ్యాక శివసేనకు ఒకరోజు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.
2019-11-12మరాఠా రాజకీయం సోమవారం అనూహ్య మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 రోజులు గడువు ఇవ్వాలన్న శివసేన విన్నపాన్ని తోసిపుచ్చిన గవర్నర్, మూడో అతి పెద్ద పార్టీ ఎన్సీపీని ఆహ్వానించారు. నిన్న బీజేపీ వెనక్కు తగ్గిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకోసం గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ శివసేనను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, ఒక్క రోజే గడువు ఇవ్వడంతో... సోమవారం సాయంత్రం శివసేన నేత అదిత్య థాకరే గవర్నర్ ను కలసి మరో 48 గంటలు సమయం కోరారు. దీనికి గవర్నర్ తిరస్కరించినట్టు థాకరే వెల్లడించారు.
2019-11-11ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం లేదని బీజేపీ గురువారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీకి తెలిపింది. దీంతో గవర్నర్ రెండో అతి పెద్ద పార్టీ శివసేనకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై సోమవారం సాయంత్రం 7.30 గంటల వరకు సమయం ఇచ్చారు. ఎన్నికలకు ముందు కలసి పోటీ చేసిన ఈ రెండు పార్టీల మధ్య సిఎం సీటు విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సిఎం కుర్చీని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని శివసేన తెగేసి చెబితే బీజేపీ ససేమిరా అంది.
2019-11-10అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా పోటీ చేయాలని వ్యాపారవేత్త మైకేల్ ఆర్. బ్లూమ్ బెర్గ్ భావిస్తున్నట్టు ఆయన సలహాదారు ఒకరు చెప్పారు. 77 ఏళ్ళ ఈ న్యూయార్క్ నగర మాజీ మేయర్, అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలనుకోవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో ఓసారి ఆసక్తిని కనబరచి, ఆ తర్వాత మనసు మార్చుకొని డెమోక్రాట్లకు మద్ధతు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వంకోసం పోటీ పడుతున్నవారిలో ఎవరూ ట్రంప్ ను తట్టుకోలేరని బ్లూమ్ బెర్గ్ భావిస్తున్నారట!
2019-11-08 Read Moreసోషలిస్టు దేశం క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షలకు స్వస్తి పలుకుతూ ఐక్యరాజ్య సమితి గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి మద్ధతుగా ఏకంగా 187 దేశాలు ఓటు వేశాయి. బ్రెజిల్ ఒక్కటే అమెరికాకు మద్ధతుగా ఓటు వేయగా కొలంబియా, ఉక్రెయిన్ గైర్హాజరయ్యాయి. ఫైడెల్ కాస్ట్రో నాయకత్వంలో విప్లవం విజయవంతమయ్యాక 1958లో అమెరికా ఆంక్షల పర్వం మొదలైంది. వీటితో క్యూబా ప్రజలు 922 బిలియన్ డాలర్ల (రూ. 65.46 లక్షల కోట్లు) మేరకు నష్టపోయినట్టు అంచనా.
2019-11-07 Read More