కర్నాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో శాసనసభా పక్ష నేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రకటించారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పూర్తి ఫలితాలు రాక ముందే పరిస్థితి స్పష్టం కావడంతో... అందుకు బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అదే లేఖలో... సోనియా నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయతను ప్రకటించారు.

2019-12-09

కర్నాటక ఉప ఎన్నికల్లో బిజెపికి మెజారిటీ సీట్లు రావడంతో ఎడియూరప్ప ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఉప ఎన్నికలు జరిగిన 15 అసెంబ్లీ స్థానాల్లో 10 బిజెపి వశమయ్యాయి. మరో రెంటిలో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. రెండు చోట్ల కాంగ్రెస్, మరో చోట ఇండిపెండెంట్ అభ్యర్ధులు గెలిచారు. పార్టీ ఫిరాయించి బిజెపికి అనుకూలంగా ఓటు వేసిన కాంగ్రెస్, జెడి(ఎస్) సభ్యులు అనర్హతకు గురి కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కనీసం 6 చోట్ల గెలిస్తే తప్ప సాధారణ మెజారిటీ నిలువని పరిస్థితుల్లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి.

2019-12-09

మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన పత్రిక ‘‘సాక్షి’’ వెల్లడించింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి కార్యరూపం ఇవ్వనున్నట్టు పేర్కొంది. అత్యాచార కేసులపై విచారణను కేవలం మూడు వారాల్లో పూర్తి చేసి సత్వరమే శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్టు ఈ కథనం చెబుతోంది.

2019-12-09 Read More

‘‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయత, క్రమశిక్షణ ముఖ్యం. ఎవరు గీత దాటినా సహించే ప్రసక్తే లేదు’’...ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని ఉద్ధేశించి పరోక్షంగా చేసిన హెచ్చరిక ఇది. నిన్న నెల్లూరులో ఆనం చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి శనివారం స్పందించారు. వ్యవస్థలు తమ పని తాము చేసుకుపోయే పరిస్థితి నెల్లూరులో లేదని, మాఫియా ఆగడాలపై ప్రజలు కుమిలిపోతున్నారని ఆనం నిన్న వ్యాఖ్యానించారు.

2019-12-07

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం నాడిక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలసిన బీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. వెంటనే సిఎం జగన్మోహన్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేయలేకపోయిన పనులను కూడా జగన్ చేస్తున్నారని బీద ఈ సందర్భంగా ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బీద నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

2019-12-07

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. 20 నియోజకవర్గాలకు గాను 260 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కూడా వారిలో ఉన్నారు. మొత్తం 6,066 పోలింగ్ స్టేషన్లలో 949 సమస్యాత్మకమైనవిగా ప్రకటించారు. వాటిలో 762 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. 18 సీట్లలో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. తూర్పు జంషెడ్ పూర్, పశ్చిమ జంషెడ్ పూర్ లలో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

2019-12-07

నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటూ ఆయన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు శుక్రవారం లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. యాదవ సామాజికవర్గానికి చెందిన బీదకు చంద్రబాబునాయుడు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత నేతలు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. మస్తాన్ రావు అధికార వైసీపీలో చేరతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

2019-12-06

భారీ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని తెలంగాణ మంత్రి కె. తారకరామారావు విమర్శించారు. బుల్లెట్ ట్రైన్, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను ప్రస్తావించిన కేటీఆర్... దక్షిణ భారతంలో నగరాలు లేవా? అని నిలదీశారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికలో జరిగిన టి.ఎస్.పాస్ ఐదో వార్షికోత్సవంలో కేటీఆర్ ప్రసంగించారు. పని చేస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రోత్సాహం లేదని ఆయన విమర్శించారు. దక్షిణాదికి రావలసిన ప్రాజెక్టులను పెండింగ్ లో పెడుతున్నారని ఆక్షేపించారు.

2019-12-04 Read More

అనేకానేక మలుపుల తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా తొలిసారి థాకరేల కుటుంబం నుంచి ఉద్ధవ్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి), కాంగ్రెస్ మద్ధతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఒప్పందం ప్రకారం ఎన్.సి.పి. నుంచి డిప్యూటీ సిఎం, కాంగ్రెస్ నుంచి స్పీకర్ ఉంటారు. ప్రస్తుతానికి ఉద్ధవ్ థాకరేతోపాటు జయంత్ పాటిల్, చగన్ భుజబల్ (ఎన్.సి.పి), బాలాసాహెబ్ థొరాట్, నితిన్ రౌత్ (కాంగ్రెస్), ఏకనాథ్ షిండే, సుభాష్ దేశాయ్ (శివసేన) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

2019-11-28

అధికారం దక్కించుకోవడానికి బీజేపీ ఏమైనా చేస్తుందని మరోసారి రుజువైంది. మహారాష్ట్రలో అనూహ్యంగా శనివారం ఉదయాన్నే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకు వీలుగా రాష్ట్రపతి పరిపాలను ఎత్తివేస్తూ వేకువ జామున 5.47 గంటలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుపై నిన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు జరపగా... రాత్రికి రాత్రి బీజేపీకి గవర్నర్ అవకాశం ఇవ్వడం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆయన డిప్యూటీగా ప్రమాణం చేయడం ఆశ్చర్యకరం.

2019-11-23
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page