నిజం మాట్లాడినందుకు తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ‘‘మేకిన్ ఇండియా’’ అని చెప్పారని, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ‘‘రేప్ ఇన్ ఇండియా’’ కనిపిస్తోందని రాహుల్ గాంధీ నిన్న చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది. దీనికి రాహుల్ ‘‘నేను రాహుల్ సావర్కర్ కాదు... రాహుల్ గాంధీ’’ అని ఉద్ఘాటించారు. బ్రిటిషర్లను సావర్కర్ క్షమాపణ కోరిన ఉదంతాన్ని పరోక్షంగా గుర్తు చేశారు.

2019-12-14

ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ (యునైటెడ్) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో చేతులు కలిపారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి విజయవంతంగా వ్యూహాలు రచించిన ప్రశాంత్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. 2021 బెంగాల్ ఎన్నికలకోసం మమతా బెనర్జీతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ‘‘ఆప్’’తో కలసిన విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు.

2019-12-14 Read More

పవన్ కళ్యాణ్ చెప్పే మాటలను నమ్మవద్దని, చేసే పనులను చూడాలని జనసేనకు రాజీనామా చేసిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ్ ప్రజలకు విన్నవించారు. జనసేన వ్యవస్థాపకుల్లో ఒకరైన రవితేజ్ రాజీనామా చేయగా.. ఆమోదిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రవితేజ్ విలేకరులతో మాట్లాడుతూ... పవన్ రాజకీయాలు కులం, మతం, హింస వైపు పయనిస్తున్నాయని విమర్శించారు. కుల, మత ప్రీతి లేని పవన్...వాటిని రాజకీయ సాధనాలుగా ఉపయోగించడం మరింత ప్రమాదకరమన్నారు.

2019-12-14

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సిఎం జగన్మోహన్ రెడ్డిపై పొగడ్తల వర్షం కొనసాగుతోంది. ముఖ్యమంత్రిని భగవంతుని ధూతగా.. కారణ జన్ముడుగా.. యుగ పురుషుడుగా అభివర్ణించారు అధికార పార్టీ (పాతపట్నం) ఎమ్మెల్యే రెడ్డి శాంతి. దిశ చట్టం వంటివి తేగలమని భారత దేశానికే చూపించిన యోధుడని పొగిడారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని...రావణ సంహారాన్ని, ‘దిశ చట్టం’లో పేర్కొన్న శిక్షలను పోల్చారు. దేశమంతా సాహో జగనన్న.. జయహో జగనన్న అంటోందని రజని పేర్కొన్నారు.

2019-12-13

ప్రభుత్వాధినేతను అధికార పార్టీ నేతలు పొగడటం కొత్తేమీ కాదు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అవి కాస్త శృతి మించాయి. ‘అత్యాచారానికి ఉరిశిక్ష’ విధించేలా ప్రభుత్వం ‘దిశ చట్టం’ పేరిట ఓ బిల్లును శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లును పరిచయం చేసిన హోంమంత్రి సుచరిత సహా వైసీపీ మహిళా నేతలంతా సిఎం జగన్మోహన్ రెడ్డిని తెగ పొగిడారు. తానేటి వనిత ఏకంగా ముఖ్యమంత్రిని సృష్టికర్తగా, ఆయన పాలనను త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడి తరహా పాలనగా అభివర్ణించారు.

2019-12-13

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రోజుకో అంశాన్ని హైలైట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ... గురువారం మీడియాపై ప్రభుత్వ ఆంక్షలను ఎంచుకుంది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే వార్తలు రాసేవారిపై కేసులు పెట్టే అధికారాన్ని వివిధ శాఖల అధికారులకు కట్టబెడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430ను, అసెంబ్లీ సమావేశాల ప్రసారాల విషయంలో మూడు ఛానళ్లపై విధించిన ఆంక్షలను నిరసిస్తూ నల్ల రిబ్బన్లతో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు ర్యాలీ చేపట్టారు.

2019-12-12

చంద్రబాబు సొంత కొడుకును గెలిపించుకోలేకపోయారన్న వైసీపీ నేతల వ్యంగ్యాస్త్రాలకు నారా లోకేష్ బుధవారం స్పందించారు. ‘‘నేను చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రకం కాదు. నాన్న ఎక్కడ గెలిచారో అక్కడే గెలిచి కాలర్ ఎగరేసే బ్యాచ్ కాదు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవలేదో..అక్కడే నిల్చొని గెలవాలనేది లక్ష్యం. 1985 తర్వాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎప్పుడూ ఎగరలేదు. ఆ చరిత్రను తిరగరాయాలనే అక్కడికి వెళ్లాను. ఓడిపోయాను. అది టీడీపీ కంచుకోట కాదు.. పులివెందులా కాదు’’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.

2019-12-11

రాయలసీమకు ద్రోహం చేసింది రాజశేఖరరెడ్డేనని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు. రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా...కృష్ణా మిగులు జలాలపై హక్కును వదులుకుంటున్నట్టు ట్రిబ్యునల్ కు తెలిపారని, ఈ విషయాన్ని అప్పుడే తాము అసెంబ్లీలో ఎండగట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల తర్వాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.

2019-12-11

అసెంబ్లీలో మాట్లాడటానికి ఎన్టీ రామారావుకు (గతంలో) అవకాశం ఇవ్వని పాపంలో తానూ భాగమని, అందుకే 15 సంవత్సరాలు అధికారానికి దూరమయ్యానని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఓ సభ్యుడు ఆ ఉదంతాన్ని గుర్తు చేసిన నేపథ్యంలో తమ్మినేని పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఎన్టీఆర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నిజమే. ఆ పాపంలో నేనూ భాగమయ్యాను. పశ్చాత్తాపపడ్డాను. దానికి ప్రతిఫలమే.. భగవంతుడు నన్ను 15 సంవత్సరాలు అధికారానికి దూరం చేశాడు’’ అని స్పీకర్ చెప్పారు.

2019-12-10

మాజీ ఎం.పి, బీజేపీ సీనియర్ నేత గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, వారి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సాపురం ఎం.పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు రఘురామరాజు కేంద్రంలో బీజేపీ నేతలతో సన్నిహితంగా మెలగడం పట్ల సిఎం జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తమ సొంత పార్టీ ఎం.పి.కి, ఆయనను దువ్వుతున్న బీజేపీకి డబుల్ బ్లో ఇవ్వడానికి జగన్ వ్యూహాత్మకంగా గోకరాజు కుటుంబాన్ని వైసీపీలోకి లాగుతున్నట్టు సమాచారం.

2019-12-09
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page