ప్రభుత్వం ఏ ఒక్కరి హక్కులనూ లాక్కోవడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు దేశమంతా విస్తరించిన నేపథ్యంలో... మోడీ ఆదివారం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాంలీలా మైదానంలో భారీ జనసమీకరణను ఉద్దేశించి మాట్లాడిన మోడీ ‘‘మేము లక్షల ఇండ్లు కట్టించాం. ఎవరినీ వారి మతం ఏమిటో అడగలేదు... పౌరసత్వ సవరణ చట్టంపై తప్పుడు సమాచారం, అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు’’ అని మోడీ వ్యాఖ్యానించారు.
2019-12-22వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నోరు జారారు. రాష్ట్ర అసెంబ్లీలో 225 స్థానాలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ‘‘గత ఎన్నికల్లో 151 స్థానాలు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో 225 స్థానాలకు గాను 224 ఇవ్వాలి’’ అని ప్రజలకు విన్నవించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం... ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. అలా జరిగితే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 225కు పెరుగుతుంది. అయితే, కేంద్రం అందుకు సానుకూలంగా లేదు.
2019-12-21జార్ఖండ్ లో కాంగ్రెస్- జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి అధికారంలోకి వస్తుందని ‘ఇండియా టుడే- యాక్సెస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. 5 దశల పోలింగ్ శుక్రవారం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. 81 సీట్ల అసెంబ్లీలో మెజారిటీకి 41 అవసరం. కాంగ్రెస్ కూటమికి 38 నుంచి 50 సీట్లు, బీజేపీకి 22 నుంచి 32 సీట్లు, ఎ.జె.ఎస్.యు.కి 3 నుంచి 5, ఆర్.జె.డి.కి 2 నుంచి 4, జెవిఎంకు 2 నుంచి 4 సీట్లు వస్తాయని అంచనా. ఓట్లు కాంగ్రెస్ కూటమికి 37 శాతం, బీజేపీకి 34 శాతం వస్తాయని అంచనా.
2019-12-20పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో హింస తనను తీవ్రంగా బాధించిందని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పేర్కొన్నారు. ‘‘ఏ అంశానికైనా పరిష్కారం కనుగొనడానికి హింస ఒక మార్గం కాకూడదు. దేశ భద్రత, సంక్షేమాన్నిదృష్టిలో పెట్టుకొని భారత ప్రజలు ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలి’’ అని రజినీ ట్వీటారు. దీనిపై ఎక్కువమంది నెటిజన్లు ప్రతికూలంగా స్పందించారు. కేంద్రం చర్యలు తప్పని ఒక్క మాటా అనలేదేమని ప్రశ్నించారు.
2019-12-20అమెరికా ప్రతినిధుల సభ అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్ కు తన పార్టీ సహచరులు మాత్రం మూకుమ్మడిగా మద్ధతు తెలిపారు. ఒక్కరు కూడా అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయలేదు. బుధవారం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సభలో ఓటింగ్ జరిగింది. సభలో డెమోక్రాట్లకు మెజారిటీ ఉండటంతో 229-198 తేడాతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. డెమోక్రాటిక్ పార్టీ 2020 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న తుల్సి గబ్బార్డ్ మాత్రం ‘‘హాజరు’’ వేయించుకున్నారు తప్ప వ్యతిరేకించలేదు.
2019-12-19అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీదారు అవుతాడనుకున్న జో బిడెన్, ఆయన కుమారుడు లక్ష్యంగా విచారణ జరపాలని ఉక్రెయిన్ ప్రభుత్వంపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. ఉక్రెయిన్ కు ఆర్థిక సాయాన్ని ప్రకటించి ప్రతిగా ‘జో’పై విచారణ కోసం పట్టు పట్టారు. దీంతో... అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ట్రంప్ అభిశంసనకు డెమోక్రాట్లు ప్రతిపాదించారు. ట్రంప్ పదవిలో కొనసాగుతారా.. లేదా అన్నది మాత్రం సెనెట్ లో చేపట్టే విచారణపై ఆధారపడి ఉంటుంది.
2019-12-19జనసేన పార్టీ లెటర్ హెడ్ పై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ పేరిట కొంతమంది నకిలీ ప్రెస్ నోట్లు ప్రచారంలో పెడుతున్నారని ఆ పార్టీ పేర్కొంది. ఈ అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు జనసేన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పార్టీ ప్రకటనలు అధికారిక గ్రూపుల ద్వారానే పంపిస్తామని నేతలు తెలిపారు.
2019-12-19గత ఏడు నెలల్లో రాష్ట్రంలో ఏం జరిగిందో ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విన్నవించారు. ‘‘ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని టీడీపీని ఓడించారు. లేదంటే.. పదేళ్లు తిరిగాడు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓట్లు వేశారు. ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చు... మరి ఏం జరిగింది? 7 నెలల్లో ఒక్క అభివృద్ధి పనీ లేదు. మేము తెచ్చిన అదానీ, లులు ప్రాజెక్టులు వెళ్లిపోయాయి’’ అని బుధవారం అనంతపురంలో జిల్లా పార్టీ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2019-12-18‘‘రాజద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ కు మరణశిక్ష విధించారు. రాజధాని పేరిట రాష్ట్రద్రోహం చేసిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలో ప్రజలు చూసుకుంటారు’’... వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడివాడ్ అమరనాథ్ మంగళవారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య ఇది. రాజధాని అమరావతిని చంద్రబాబు భ్రమరావతిగా మార్చారని మరో ఎమ్మెల్యే సుధాకర్ బాబు విమర్శించారు.
2019-12-17రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందంటూ... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం అసెంబ్లీకి రివర్స్ నడక ద్వారా నిరసన తెలిపారు. అమరావతిపై ప్రభుత్వం రోజుకో మాట చెప్పడం, రివర్స్ టెండర్లు వంటి అంశాలపై ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర అభివృద్ధినే రివర్స్ చేశారని నినాదాలు చేశారు.
2019-12-16