ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కాంశ్య విగ్రహాన్ని లక్నోలో ఆవిష్కరించారు. బుధవారం వాజపేయి జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆయన పేరిట ఉత్తరప్రదేశ్ రాజధానిలోనే వైద్య విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. వాజపేయి లక్నో నుంచి లోక్ సభ కు ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు.

2019-12-25

జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈ నెల 29వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర గవర్నర్ బుధవారం సోరెన్ ను కోరినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో జెఎంఎం-కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్ కూటమికి 47 సీట్లు లభించిన విషయం తెలిసిందే. ఇతరులతో కలిపి మొత్తం 50 మంది మద్ధతుతో కూడిన లేఖను సోరెన్ మంగళవారం గవర్నర్ కు సమర్పించారు.

2019-12-25

బిజెపితో కలసి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూణ్ణాళ్లు కూడా ముచ్చట తీర్చుకోలేకపోయిన అజిత్ పవార్ మరోసారి ఆ కుర్చీలో కూర్చోనున్నట్టు సమాచారం. కొద్ది రోజుల్లో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నట్టు ఎన్.సి.పి. వర్గాలు తెలిపాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మంత్రివర్గంలో ఆయనకు రెండు మంత్రిత్వ శాఖలు ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. దిలీప్ వాల్సే పాటిల్ హోంమంత్రి అవుతారని సమాచారం.

2019-12-25

ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో వ్యవస్థ పని చేయడం అనేది పిచ్చి ఆలోచనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభివర్ణించారు. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించి... వివిధ వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కన్నా తీవ్రంగా తప్పు పట్టారు. ముఖ్యమంత్రి మారగానే రాజధానిని చంకన పెట్టుకొని పోతారా? అభివృద్ధిని ఆపేస్తారా? అని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను కన్నా బుధవారం పరామర్శించారు.

2019-12-25

ఎన్నికల తర్వాత టీడీపీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా ఓ కలకలానికి కేంద్ర బిందువయ్యారు. విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా, నగరానికి చెందిన ఇతర టీడీపీ ఎమ్మెల్యేలతో సమావేశమై ‘‘విశాఖపట్నంలో రాజధాని’’ని స్వాగతిస్తూ తీర్మానం చేయించారు. విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

2019-12-25

ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ ఇ.వి. రామస్వామి వర్ధంతి రోజైన మంగళవారం బిజెపి తమిళనాడు శాఖ సామాజిక మాథ్యమాల్లో పెట్టిన ఓ పోస్టు వివాదాస్పదమైంది. పెరియార్ తన భార్య మణియమ్మయితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘‘పిల్లలను లైంగికంగా వేధించేవారికి మరణశిక్షను సమర్ధిద్దాం. ‘పోక్సో’ నిందితులు లేని సమాజాన్ని సృష్టిద్దాం’’ అని బిజెపి పిలుపునిచ్చింది. పెరియార్ 69 సంవత్సరాల వయసులో 31 ఏళ్ళ మణియమ్మయిని వివాహం చేసుకోవడాన్ని హేళన చేయడం ఈ పోస్టు ఉద్ధేశంగా ఉంది.

2019-12-24

‘‘మన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి శత్రువులు పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. కానీ, వారు చేయలేకపోయిన పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపిస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలో చేపట్టిన సత్యాగ్రహ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. ‘‘ద్వేషం మాటున దాక్కోకండి మోడీ జీ.. మీరు ఉపాధి ఎందుకు కల్పించలేదో యువతకు చెప్పండి. ఆర్థిక వ్యవస్థను ఎందుకు నాశనం చేశారో దుకాణదారులకు, చిన్న పారిశ్రామికవేత్తలకు చెప్పండి’’ అని డిమాండ్ చేశారు.

2019-12-23

దేశంలో డిటెన్షన్ సెంటర్లు లేనే లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నొక్కి వక్కాణించిన కొద్దిసేపటికే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘మోడీ చెప్పిన అబద్ధాలపై భారతీయులు సింపుల్ గూగుల్ సెర్చ్ కూడా చేయలేరని ఆయన నమ్మకమా? డిటెన్షన్ సెంటర్లు ఉన్నది ముమ్మాటికీ వాస్తవం. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు అవి పెరుగుతూనే ఉంటాయి’’ అని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో విమర్శించింది. డిటెన్షన్ సెంటర్లకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ షేర్ చేసింది.

2019-12-22

దేశ పౌరుల్లో భయాందోళనలు కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, అర్బన్ నక్సల్స్ అవాస్తవాలను ప్రచారంలో పెట్టారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ముస్లింలను డిటెన్షన్ సెంటర్లకు పంపుతారంటూ పుకార్లు పుట్టించారని, అసలు ఇండియాలో డిటెన్షన్ సెంటర్లే లేవని మోడీ చెప్పారు. ఆదివారం ఢిల్లీ రామ్ లీలా మైదానంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర తీసిన మోడీ, పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

2019-12-22

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు చేయగలిగిన ఉత్తమమైన పని... తన పదవికి రాజీనామా చేయడమేనని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అభిప్రాయపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో... చిదంబరం ‘‘ద వీక్’’ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ ప్రభుత్వం ఐసియులో పెట్టిందని, మోడీ తన సన్నిహిత పెట్టుబడిదారులకు మాత్రమే మేలు చేస్తున్నారని చిదంబరం విమర్శించారు.

2019-12-22
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page