జమ్మూ కాశ్మీర్, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చర్చనీయాంశాలుగా ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఒ.ఐ.సి) 2020 ఏప్రిల్ మాసంలో సమావేశం కానుంది. ఈ సమావేశం భారత దాయాది పాకిస్తాన్లో జరుగుతుంది. 57 ఇస్లామిక్ దేశాలు సభ్యులుగా ఉన్న ఒ.ఐ.సి., ఇండియాలో పరిణామాలపై చర్చించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మన దేశానికి ఇది ఒకింత ఇబ్బందికర పరిణామం. ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతారు.

2019-12-29

రాష్ట్ర రాజధానిని మార్చే నైతిక హక్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని సీపీఐ జాతీయ నేత కె. నారాయణ వ్యాఖ్యానించారు. రాజధానిని మార్చాలనో... 3 రాజధానులు ఏర్పాటు చేయాలనో.. అనుకుంటే పదవులకు రాజీనామా చేసి ఆ అంశం ఆధారంగా ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా చేయడానికి ఇదేమీ చిన్న విషయం కాదని, రాష్ట్రం మొత్తానికి సంబంధించిన కీలక అంశమని నారాయణ పేర్కొన్నారు.

2019-12-28

సిఎం వైఎస్ జగన్ ఏడు నెలలుగా తవ్వుతున్నది అవినీతిని కాదని, వైకాపా ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఆధారాలు ఉంటే బయటపెట్టమని తాము డిమాండ్ చేస్తే... పాత కాకి లెక్కలే చెబుతున్నారని విమర్శించారు. అమరావతి భూ లావాదేవీలలో అవినీతి జరిగిందని నిన్న మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిన నేపథ్యంలో లోకేష్ శనివారం ‘ఫేస్ బుక్’లో స్పందించారు.

2019-12-28

భారత జాతీయ కాంగ్రెస్ (ఐ.ఎన్.సి) పార్టీ నేటితో 134 వసంతాలు పూర్తి చేసుకుంది. సివిల్ సర్వీసు నుంచి తప్పుకొన్న ఆంగ్లేయుడు ఎ.ఒ. హ్యూమ్ చొరవతో 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగింది. తొలి సభ 1985 డిసెంబర్ 28 నుంచి 31వరకు బొంబాయిలో జరిగింది. బ్రిటిష్ పాలనలో భారతీయుల ప్రాతినిధ్యంకోసం పని చేసే సంస్థగా మాత్రమే ప్రాథమిక దశలో కాంగ్రెస్ గుర్తింపు పొందింది. తర్వాత కాలంలో జన సామాన్యానికి దగ్గరై జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించింది.

2019-12-28

రాజధాని భూముల విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న జగన్ ప్రభుత్వం ఏడు నెలలుగా ఏం తవ్విందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’పై సీబీఐ విచారణ జరిపించాలని మంత్రివర్గ సమావేశంలో చర్చించిన నేపథ్యంలో... చంద్రబాబు స్పందించారు. ‘‘చట్టపరంగా నీవల్ల ఏమైతే అది చేసుకో. నువ్వు వేరేవాళ్ళ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడ్డావ్. మేము నీ దయాదాక్షిణ్యాలపై లేము’’ అని సిఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

2019-12-27

రాష్ట్ర రాజధానిని విశాఖపట్నానికి తరలించే విషయంలో ‘పార్టీ వైఖరికి నిరసన’గా... తెలుగుదేశం విశాఖపట్నం అర్బన్ అధ్యక్షుడు రెహ్మాన్ రాజీనామా చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉద్యమం చేయిస్తున్నారని రెహ్మాన్ తప్పుపట్టారు. విశాఖపట్నాన్ని రాజధానిగా స్వాగతించకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతానని రెహ్మాన్ వ్యాఖ్యానించారు.

2019-12-26

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా లేక విజయసాయిరెడ్డా?! అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. ‘‘విశాఖపట్నం పరిపాలనా రాజధాని’’గా విజయసాయిరెడ్డి గురువారం వెల్లడించిన నేపథ్యంలో తులసిరెడ్డి ఓ మీడియా సంస్థ చర్చలో ఈ ప్రశ్నను సంధించారు. గతంలో కొంతకాలం ఏపీ సిఎం కేసీఆరేమో అనే అనుమానం ఉండేదని, ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే అనుమానం వస్తోందని తులసిరెడ్డి చెప్పారు.

2019-12-26

28వ తేదీన విశాఖ ఉత్సవంలో పాల్గొనడానికి వస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డికి 24 కిలోమీటర్ల పొడవున మానవ హారంతో ఘన స్వాగతం పలకనున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా ప్రకటించాక తొలిసారి నగరానికి వస్తున్న సిఎంకు చరిత్రలో నిలిచిపోయేలా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

2019-12-26

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ బ్రిటన్ ఆర్థిక మంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రధాని బోరిస్ జాన్సన్ ఫిబ్రవరిలో చేపట్టే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రిషికి ప్రమోషన్ వస్తుందని సమాచారం. ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్న రిషి, పార్లమెంటు ఎన్నికలకు ముందు టీవీ డిబేట్లలో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. గోల్డ్ మన్ శాచ్స్ వంటి సంస్థల్లో పని చేసిన ఈ ఆర్థికవేత్త బ్రిటన్ ఆర్థిక మంత్రి పదవికి సరైనవాడని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారట.

2019-12-25

రాజధానిని ‘‘గ్రేటర్ రాయలసీమ’’లో ఏర్పాటు చేయాలని సీనియర్ రాజకీయ నేత మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. అమరావతినుంచి రాజధానిని విశాఖపట్నానికి తరలించే సంకేతాలు వెలువడ్డ నేపథ్యంలో... బుధవారం ‘‘గ్రేటర్ రాయలసీమ’’ వాదన తెరపైకి వచ్చింది. విశాఖ నుంచి కర్నూలుకు ఎంత దూరమో.. కర్నూలు నుంచి విశాఖకూ అంతే దూరమని మైసూరా వ్యాఖ్యానించారు. ‘‘అడగనివాళ్ళకు రాజధాని ఇచ్చి... కోరినవాళ్ళకు ఎంగిలి మెతుకులు విదిలిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు.

2019-12-25
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page