‘‘వైసీపీ ఫ్యాన్ రెక్కలు మూడున్నాయి కాబట్టి రాష్ట్ర రాజధాని కూడా మూడు ముక్కలు చేద్దామనుకుంటున్నారేమో!’’ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యంగ్యాస్త్రం విసిరారు. ‘మూడు రాజధానులు’ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. దక్షిణాఫ్రికాలో ఉన్న జాతి విభేదాలు, విదేశీ పాలకుల కారణంగా అక్కడ చారిత్రకంగా మూడు రాజధానులు ఉన్నాయని, అది సరి కాదని నెల్సన్ మండేలా కూడా చెప్పారని యనమల గుర్తు చేశారు.

2020-01-02

తమ డిగ్రీలు చూపించలేని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు దేశ పౌరులను ఆధారాలు అడుగుతున్నారని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆక్షేపించారు. ఇది చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ఎన్.ఆర్.సి.కి ఎన్.పి.ఆర్. ప్రాతిపదిక అవుతుందని స్పష్టం చేసిన ఏచూరి, సంబంధం లేదన్న విధంగా కేంద్రం తప్పుడు వివరణలు ఇస్తోందని విమర్శించారు. గురువారం ఉదయం ఏచూరి వరుస ట్వీట్లతో కేంద్రంపై విరుచుకుపడ్డారు.

2020-01-02

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఆర్.టి.సి.ని విలీనం చేసే విషయంలో ‘‘ఏపీలో ఏ మన్నూ జరగదు’’ అని కొద్ది కాలం క్రితం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... ‘‘మేం చేసి చూపించాం’’ అని నాని గర్వంగా చెప్పారు. తెలంగాణలో ఆర్.టి.సి. సమ్మె జరుగుతున్నప్పుడు.. విలీనం సాధ్యం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు.

2020-01-01

తమకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీయేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు. ఎత్తుపల్లాలను చూసినా ఆ పార్టీని తక్కువగా అంచనా వేయలేమని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. 2020 దశకం కూడా టీఆర్ఎస్ దేనని ఉద్ఘాటించారు. తెలంగాణలో బిజెపి పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని, తన చిన్నతనంలో ఎలా ఉందో ఇప్పుడూ అంతే ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

2020-01-01

మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి రైతులకు ఇవ్వవలసింది చేతి గాజులు కాదని, ‘ఇన్సైడర్ ట్రేడింగ్’లో కొట్టేసిన భూములని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ఫశ్రీవాణి వ్యాఖ్యానించారు. రైతు ఉద్యమానికి మద్ధతుగా భువనేశ్వరి గాజులు విరాళంగా ఇవ్వడంపై డిప్యూటీ సిఎం స్పందించారు. ఐదేళ్ళలో రాజధానిని నిర్మించలేకపోవడం, రైతులకు అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వలేకపోవడంపై సమాధానం చెప్పలేక చంద్రబాబు కొత్త నాటకం వేస్తున్నారని విమర్శించారు.

2020-01-01

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి రాజధాని రైతులకు మద్ధతుగా రంగంలోకి దిగారు. బుధవారం చంద్రబాబుతో కలసి ఎర్రబాలెం వద్ద రైతుల దీక్షలో పాల్గొని ఉద్యమానికి మద్ధతు తెలిపారు. అమరావతి నిర్మాణంకోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడిన నేపథ్యంలో... నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. అమరావతి ఉద్యమానికి విరాళంగా భువనేశ్వరి తన చేతి గాజులను ఇచ్చారు.

2020-01-01

ఏపీ సిఎం జగన్ రాయలసీమ ప్రజలనూ మోసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. హైకోర్టును కర్నూలుకు మార్చాలంటే సుప్రీంకోర్టు అనుమతి కావాలని, జి.ఎన్.రావు కమిటీ అసెంబ్లీని విజయనగరంలో పెట్టాలని చెప్పింది తప్ప భీమిలిలో కాదని పేర్కొన్నారు. మనసులో ఏముందో గాని, అన్ని ప్రాంతాల ప్రజలనూ సిఎం మభ్యపెడుతున్నారని ఆక్షేపించారు. రాజధాని ఎక్కడో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

2019-12-31

హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నరు తమిళిసైని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు మంగళవారం మధ్యాహ్నం గవర్నరును కలిశారు. అంజనీకుమార్ అవినీతి, అక్రమ వర్తనపై అనేక ఆరోపణలు ఉన్నాయని, విచారణ జరిపించాలని కోరామని తర్వాత ఉత్తమ్ మీడియాకు చెప్పారు.

2019-12-31

జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) ప్రక్రియను చేపట్టడానికి రాష్ట్రాలు నిరాకరించజాలవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ఎన్.పి.ఆర్. అంటే జనగణనే. అదనపు వివరాలు తీసుకునేది సంక్షేమ కార్యక్రమాలకోసమే’’ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.సి.ఆర్)కు అవసరమైన సమాచారాన్ని ఎన్.పి.ఆర్. ప్రశ్నావళిలో కోరుతుండటంతో కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.

2019-12-31

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కట్టు తప్పారు. గుంటూరు-2 ఎమ్మెల్యే మద్దాల గిరి సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలసి మద్ధతు ప్రకటించారు. ఆ తర్వాత బయటకు వచ్చి చంద్రబాబును విమర్శించారు. గతంలో తాను ఇన్ఛార్జిగా ఉన్నా పనులేమీ జరగలేదని, చంద్రబాబు మాటలకే పరిమితమయ్యారని ఆరోపించారు. ఇటీవల ఆంగ్ల మాథ్యమంపై టీడీపీ మాటలు మార్చడాన్ని తాను తప్పు పట్టినట్టు చెప్పుకొచ్చారు.

2019-12-30
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page