దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. సోమవారం ఎన్నికల షెడ్యూలుతో పాటు ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది ఎన్నికల సంఘం. మొత్తం 1,46,92,136 మంది ఓటర్లకు గాను 80.55 లక్షల మంది (55 శాతం) పురుషులు. మహిళలు కేవలం 66.35 లక్షలు (45 శాతం).

2020-01-06

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలో విడుదల చేసింది. దాని ప్రకారం... జనవరి 14న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లకు 21 వరకు గడువు ఉంటుంది. 22వ తేదీన స్క్రూటినీ తర్వాత 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సోమవారం నుంచే ఎన్నికలబంధనావళి అమల్లోకి వచ్చింది.

2020-01-06

టి.ఆర్.ఎస్. కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావు మున్సిపల్ ఎన్నికల కసరత్తును ముమ్మరం చేశారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులతో ఆయన హైదరాబాద్ నగరంలోనే మంత్రి దయాకరరావు నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు పాల్గొన్నారు.

2020-01-04

ఎన్నికలకు ముందు ‘‘ఆపరేషన్ గరుడ’’ వంటి సంచలనాలకు తెర లేపిన సినీ నటుడు శివాజీ మరోసారి రంగంలోకి దిగారు. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మారుస్తుంటే ఆంధ్రప్రదేశ్ యువత సిగ్గు, పౌరుషం లేకుండా చూస్తూ కూర్చుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం టీవీ ఛానళ్లతో మాట్లాడుతూ...కుల గజ్జి, కేసుల భయంతో ఆంధ్రులు మగ్గిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ ఫ్యాక్షనిజం అని వైసీపీపై ధ్వజమెత్తారు.

2020-01-04

రాజధాని గ్రామాల ప్రజల ఆందోళనలపై ఎస్వీబీసీ ఛైర్మన్ ప్రుథ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తున్నవారంతా రైతులైతే వారికి ‘ఆడి’కార్లు, ఖద్దరు షర్టులు, చేతులకు బంగారు గాజులు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇది కార్పొరేట్ ముసుగులో సాగుతున్న ఉద్యమమని విమర్శించారు. పవన్ కల్యాణ్ కు ఇలాంటివి కనపడడం లేదా అని ప్రుథ్వి ప్రశ్నించారు.

2020-01-04

టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 120 మున్పిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో టీఆర్ఎస్ గెలుపుపై సిఎం ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయన్నారు. బీజేపీని పోటీగా భావించొద్దని, టీఆర్ఎస్ కు ఎవరూ పోటీ కాదని కేసీఆర్ అన్నారు. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు.

2020-01-04

ఏపీ రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బి.సి.జి) ఇచ్చిన నివేదికను ఓ చెత్త కాగితంగా అభివర్ణించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సంక్రాంతి పండుగ వస్తున్నందున భోగి మంటల్లో ఆ చెత్తను వేసి కాల్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సచివాలయం, సిఎంఒ, రాజ్ భవన్, అత్యవసర అసెంబ్లీ, ప్రధాన ప్రభుత్వ విభాగాలు విశాఖలో ఏర్పాటు చేయాలంటూ నిన్న బి.సి.జి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడారు.

2020-01-04

‘‘మీసం మెలేసి చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ నాయుడే..! పాలకొల్లు పవన్ నాయుడు!! మీమీద మీకేమైనా డౌట్ ఉంటే డి.ఎన్.ఎ. పరీక్ష చేయించుకోండి’’...అని తెలుగుదేశం మాజీ శాసన సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు వైసీపీ నేతలకు సూచించారు. చంద్రబాబు దంపతులపైనా, పవన్ కళ్యాణ్ పైనా వైసీపీ నేతలు చేసిన విమర్శలకు బొండా ఘాటుగా బదులిచ్చారు. ‘చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు’ అన్న వ్యాఖ్యపై.. ‘మీరు జగన్ పెంపుడు కుక్కలా’ అంటూ మండిపడ్డారు.

2020-01-02

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. మైనారిటీలపై పాకిస్తాన్ దాష్ఠీకానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని హితవు పలికారు. గురువారం కర్నాటకలోని తుమకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. ‘‘మతం పునాదులపైనే పాకిస్తాన్ ఏర్పాటైంది. అందువల్లనే... హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లపై దాడులు పెరిగాయి. కానీ, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడవు’’ అని ఆరోపించారు.

2020-01-02 Read More

2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాలీలను ఆకట్టుకోవడానికి అమిత్ షా బంగ్లా భాషను నేర్చుకుంటున్నారు. ఎన్నికల వ్యూహాలకు భాష అడ్డు కాకూడదని షా భావిస్తున్నారట. ‘‘బెంగాలీ ఆత్మగౌరవ’’ నినాదంతో మమతా బెనర్జీ చేస్తున్న ఎదురు దాడిని తట్టుకోవాలంటే భాషను నేర్చుకోక తప్పదని షా భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ‘బయటి వ్యక్తులు’ అని మమత వ్యాఖ్యానించడం బిజెపికి ఇబ్బందికరమైంది.

2020-01-02 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page