మన యూనివర్శిటీలు విద్వేష రాజకీయాలకు, హింసకు స్వర్గధామాలు కాకూడదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ...పిల్లలు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వెళ్ళేప్పుడు విజ్ఞానంతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలన్నారు. వర్శిటీలలో విద్యా ప్రమాణాలు, అనుబంధ కార్యకలాపాలు ప్రాముఖ్యతను సంపాదించాలని, అంతేగాని వర్గ విభజన ధోరణలు కాదని ఉద్భోదించారు.
2020-01-07తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. 118 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్ ప్రకటించారని ఆరోపిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది.
2020-01-07ఈ నెల 20న ప్రభుత్వానికి హై పవర్ కమిటీ నివేదిక సమర్పిస్తుందని మంత్రి బుగ్గన చెప్పారు. ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్లో హై పవర్ కమిటీ తొలి భేటీ జరిగింది. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రతినిధులు హై పవర్ కమిటీకి తాము సమర్పించిన నివేదికల గురించి వివరించారు. అభివ్రుద్ది, పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిందేనని కమిటీ అభిప్రాయపడిందని మంత్రి కన్నబాబు చెప్పారు. రెండు నివేదికలపై తదుపరి సమావేశంలో మరింత విస్త్రుతంగా చర్చిస్తామని తెలిపారు.
2020-01-07ప్రభుత్వం కాశ్మీర్ ను మిగిలిన ఇండియాలా మార్చామని చెప్పుకుంటోందని, ఆచరణలో ఇండియా మొత్తాన్ని కాశ్మీర్ లా మార్చిందని బిజెపి మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. ఆదివారం జె.ఎన్.యు. విద్యార్ధులు, అధ్యాపకులపై జరిగిన దాడి ‘‘ప్రభుత్వ గూండాలు, ప్రభుత్వ పోలీసుల’’ మధ్య తేడా లేకుండా చేసిందని ఆయన ఆక్షేపించారు. సోమవారం జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ వద్ద జరిగిన ‘పౌరసత్వ చట్ట వ్యతిరేక’ ప్రదర్శనలో సిన్హా మాట్లాడారు.
2020-01-07రాజధానిని అమరావతినుంచి తరలించడానికి సిఎం జగన్ వేగంగా పావులు కదుపుతుంటే.. ఆయన సొంత ప్రాంతం రాయలసీమ నుంచి కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని తరలింపు తప్పనిసరైతే రాయలసీమను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని, లేదంటే కర్నూలును తెలంగాణలో కలపాలని టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి వాదిస్తున్నారు.
2020-01-06అమరావతిలో భారీ ఎత్తున ఆందోళనలు సాగుతున్నా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సచివాలయ తరలింపు దిశగా కీలక అడుగు వేస్తోంది. విశాఖలోని మిలీనియం టవర్స్ లో కొత్త సచివాలయం ఏర్పాటుచేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రాధాన్యతా శాఖల్లోని ముఖ్యవిభాగాల తరలింపు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. రిపబ్లిక్ డే ఉత్సవాలను కూడా విశాఖలోనే నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఆ లోపే క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది.
2020-01-06బీజేపీలోకి ఆహ్వానంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు మోహన్ బాబు. కూతురు మంచు లక్ష్మీ, కొడుకు మంచు విష్ణు, కోడలు విరోనికతో కలిిసి మోహన్ బాబు సోమవారంప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీల్లో ఏం చర్చించామో తర్వాత చెబుతానన్నారు మోహన్ బాబు. ఏపీలో సీఎం జగన్ మంచి పాలన అందిస్తున్నారన్నారు. మోడీకి ఉత్తరాది, దక్షిణాది నటులన్న భేదాలు లేవని మంచు విష్ణు అన్నారు. త్వరలో ప్రధాని దక్షిణాది నటులను కలుస్తారని చెప్పారు.
2020-01-06తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. విచారణ పూర్తయ్యేవరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్లో నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
2020-01-06జేఎన్ యూ హింసాకాండకు పాల్పడింది ఆరెస్సెస్, ఏబీవీపీ గూండాలేనని వర్శిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ చెప్పారు. ఆరెస్సెస్ అనుబంధ ప్రొఫెసర్లు, ఏబీవీపీ నాయకులు నాలుగు రోజుల నుంచి యూనివర్శిటీలో హింసను ప్రేరేపించారని ఆమె ఆరోపించారు. వర్శిటీ వైస్ ఛాన్సలర్ జగదీశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.
2020-01-06విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోని పలు పార్లమెంటు నియోజకవర్గాలకు, వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జిలను నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గానికి వి.వి. లక్ష్మీనారాయణ (సీబీఐ మాజీ జెడి), కాకినాడకు పంతం నానాజీ, అమలాపురానికి డిఎంఆర్ శేఖర్, రాజమండ్రికి కందుల దుర్గేష్, గుంటూరుకు బోనబోయిన శ్రీనివాస యాదవ్ నియమితులయ్యారు.
2020-01-06