భారత ‘లోక్ పాల్’ వ్యవస్థలో భాగమైన సభ్యుడు జస్టిస్ డి.బి. భోసాలె తన పదవికి రాజీనామా చేశారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన భోసాలె ‘లోక్ పాల్’లో జ్యుడిషియల్ సభ్యుడిగా ఉన్నారు. జస్టిస్ భోసాలె 2019 మార్చి 27న సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనే సీనియర్ మోస్ట్ సభ్యుడు. ఈ రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమని చెబుతున్నారు.

2020-01-09

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీన ప్రారంభం కానున్నట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో తొలి భాగం ఫిబ్రవరి 11వరకు నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాల్లో రెండో భాగం మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 3 వరకు ఉంటాయని తెలుస్తోంది.

2020-01-09

నాగ్ పూర్...బి.జె.పి. మాతృ సంస్థ ఆర్.ఎస్.ఎస్.కి కేంద్రం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర బిజెపి తాజా మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ అక్కడివారే. అలాంటి కీలక ప్రాంతంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో 58 సీట్లకు గాను 30 కాంగ్రెస్ గెలుచుకుంది. విదర్భ మొత్తంలో బి.జె.పి. పతనానికి నాగపూర్ జడ్.పి. ఎన్నిక నాంది అని ఎన్.సి.పి. చీఫ్ జయంత్ పాటిల్ వ్యాఖ్యానించారు. బిజెపికి బలమైన నాయకత్వం ఉన్నచోటే ఓడిపోయారని పాటిల్ పేర్కొన్నారు.

2020-01-08 Read More

కార్మిక సమస్యలు, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేక కార్యక్రమాల సమ్మేళనంగా బుధవారం ‘‘భారత్ బంద్’’ జరిగింది. సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన 10 కేంద్ర కార్మిక సంఘాలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తోడై విస్తృత ప్రాతిపదికన బంద్ చేపట్టారు. ప్రభుత్వం ఇటీవల చేసిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), భవిష్యత్తులో చేపట్టనున్న జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)లను వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం ప్రదర్శనలు జరిగాయి.

2020-01-08

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, కార్మిక చట్టాల సరళీకరణ వంటి విధానాలకు వ్యతిరేకంగా పది కార్మిక సంఘాలు బుధవారం ‘‘భారత్ బంద్’’ నిర్వహించాయి. కేరళ, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బంద్ దాదాపు సంపూర్ణంగా జరిగింది. దక్షిణాదిన కర్నాటక మినహా మిగిలిన చోట్ల బంద్ మెరుగ్గా జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభించింది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, రవాణా రంగాలు బాగా ప్రభావితమయ్యాయి.

2020-01-08

జె.ఎన్.యు. విద్యార్ధుల పరామర్శకు వెళ్ళిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఎల్లుండి విడుదల కానున్న ఆమె సినిమా ‘ఛపాక్’కు ఈ సెగ తగులుతోంది. దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూర్ బాటలోనే హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఛపాక్ బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఛపాక్ ఎవరూ చూడొద్దని రాజాసింగ్ కోరారు.

2020-01-08

#BoycottDeepika పేరిట బాలీవుడ్ నటీమణి దీపికా పదుకొనేపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని డి.ఎం.కె. నేత కనిమొళి తప్పుపట్టారు. నటిని బహిష్కరించాలన్న పిలుపు... ప్రజలు ఇష్టంతో ఆమె సినిమా చూసేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. తాను హిందీ సినిమాలు పెద్దగా చూడనన్న కనిమొళి, ఇప్పుడు మాత్రం ‘ఛపాక్’ చూస్తానని స్పష్టం చేశారు. జె.ఎన్.యు.లో దాడికి గురైన విద్యార్ధులను నిన్న దీపిక పరామర్శించిన నేపథ్యంలో ఆమెను బహిష్కరించాలని బిజెపి నేతలు పిలుపునిచ్చారు.

2020-01-08

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న జనసేన కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్ధులుగా రంగంలోకి దిగడానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటి చేయడం లేదని జనసేన బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. స్వతంత్రులుగా పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్ధతు ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

2020-01-08

దీపికా పదుకొనే నూతన చిత్రం ‘ఛపాక్’ను బహిష్కరించాలని బి.జె.పి. దక్షిణ ఢిల్లీ ఎం.పి. రమేష్ బిధూరి పిలుపునిచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో ఎ.బి.వి.పి. దాడికి గురైన విద్యార్ధులను నిన్న దీపిక పరామర్శించిన నేపథ్యంలో ఎం.పి. ఇలా స్పందించారు. యాసిడ్ దాడికి గురైన యువతి తన జీవితాన్ని పునర్నిర్మించుకున్న తీరును వివరించే సందేశాత్మక చిత్రం ‘ఛపాక్’. దీపికపై కోపంతో బిజెపి నేతలు..,జనవరి 10న ‘ఛపాక్’తో పాటు విడుదలవుతున్న ‘తన్హాజీ’కి ప్రమోటర్లుగా మారారు.

2020-01-08

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికల నగారా మోగింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 17వ తేదీన జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి 10వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. ఎంపిపి, జడ్.పి.పి. అధ్యక్షుల ఎన్నిక ఫిబ్రవరి 15న జరుగుతుంది. ఇదే విధంగా పంచాయతీల ఎన్నికలకోసం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 3లోగా ప్రక్రియ పూర్తవుతుంది.

2020-01-08
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page