అమరావతిని మోసం చేసినవారు రేపు ఉత్తరాంధ్రను మోసం చేయరా? అనే ప్రశ్నను ప్రభుత్వానికి సంధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిని రాజధానిగా అంగీకరించి ఇప్పుడు మాట తప్పారని సిఎం జగన్ పై మండిపడ్డారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన వేలాది మందిని పట్టించుకోనివారు రేపు కొద్దిమంది వ్యక్తులను ఏం లెక్క చేస్తారని ఆయన ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలో పార్టీ సమావేశంలో పవన్ మాట్లాడారు. రైతులకు న్యాయం చేయకపోతే బలమైన ఉద్యమం చేస్తామన్నారు.

2020-01-11

ముఖ్యమంత్రి మారగానే రాజధానిని చంకలో పెట్టుకొని పోవడానికి ఇది ఆయన పార్టీ కార్యాలయం కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలన్న బిజెపి వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. అందుకోసం పోరాడతామని ప్రకటించారు. బిజెపి కోర్ కమిటీ సమావేశం అనంతరం కన్నా, జీవీఎల్ నరసింహరావు, పురంధేశ్వరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

2020-01-11

చంద్రబాబును లం...కొడకా అని తిట్టాలని ఉందని, కొట్టాలని ఉందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నోరు చేసుకున్నారు. శనివారం ‘3 రాజధానుల’కు మద్ధతుగా జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు తిప్పి కొట్టారని, మళ్ళీ ఆ ‘ముసలోడు’ లేవకూడదని వ్యాఖ్యానించారు. ‘పప్పు లోకేష్ కొవ్వు కరిగేలాగా బుద్ధి చెప్పాల’ని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి ‘నువ్వ చేసే పనులు లం... చేసినట్టు చేస్తున్నావు దొంగ నా....కా’ అని ధూషించారు.

2020-01-11

అమరావతి రైతు ట్రాన్స్ ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఓ వీడియో నిన్నటినుంచి సామాజిక మాథ్యమాల్లో పంపిణీ అవుతోంది. అది ఫేక్ అని తెలిసినవారు ఆపేశారు. అయితే, ఇప్పటికీ టిక్ టాక్ వంటి మాథ్యమాల్లో కనిపిస్తోంది. ఆ వ్యక్తి అమరావతి రైతు కాదు. తమిళనాడుకు చెందిన ఓ సైనికుడు మూడు రోజుల క్రితం మదురై జిల్లా కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్న చేశాడు. కుటుంబ వివాదంతో ముందు రోజే అతని భార్య ఆత్మహత్య చేసుకోవడం ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి.

2020-01-11

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం ఈ నెల 20వ తేదీన జరగనుంది. రాజధానిపై జి.ఎన్.రావు కమిటీ, బిసిజి సిఫారసుల పరిశీలనకోసం ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ తన నివేదికను నేరుగా అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని సమాచారం. ఆయా నివేదికలతో పాటు గతంలో శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది.

2020-01-11

సిఎఎ, ఎన్.ఆర్.సి.లకు మద్ధతుగా బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్న బైక్ ర్యాలీపై కేరళ కమ్యూనిస్టులు దాడి చేశారంటూ ఓ వీడియో గురువారం హల్ చల్ చేస్తోంది. నిజానికి ఆ వీడియో గత ఏడాది జనవరి 3న టైమ్స్ ఆఫ్ ఇండియా పోస్టు చేసినది. అప్పటికి సిఎఎ ప్రస్తావనే లేదు. మహిళల అయ్యప్ప దర్శనంపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎడప్పల్ లో జరిగిన బైక్ ర్యాలీ అది. ర్యాలీ నిర్వహించిన ’శబరిమల కర్మ సమితి’పై ఓ ‘గుంపు’ దాడి చేశారని టైమ్స్ అప్పట్లో పేర్కొంది.

2020-01-09 Read More

వారణాసి సంస్కృత విశ్వ విద్యాలయంలో విద్యార్ధి సంఘం ఎన్నికలు జరిగాయి. ఎవరు గెలిచి ఉంటారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు... అందులోనూ సంస్కృత విశ్వవిద్యాలయం... ఇంకెవరు గెలుస్తారు ఎబివిపినే కదా!! అనుకున్న వాళ్లు ముక్కున వేలేసుకున్నారు. ఎన్నికలు జరిగిన నాలుగు పోస్టుల్లోనూ కాంగ్రెస్ అనుబంధ సంఘం ఎన్.ఎస్.యు.ఐ. ఘన విజయం సాధించింది. ఆర్.ఎస్.ఎస్. అనుబంధ ఎబివిపి చిత్తుగా ఓడిపోయింది.

2020-01-09 Read More

"130 కోట్లలో ఒక పౌరుడిపై ప్రతికూల ప్రభావం చూపినా... పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)ను మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి నొక్కిచెప్పారు. సిఎఎపై దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి గురువారం మాట్లాడారు. "మతపరమైన హింసను ఎదుర్కొని పొరుగు దేశాల నుండి వచ్చిన శరణార్థులకు పౌరసత్వాన్ని కల్పించే ప్రత్యేక డ్రైవ్‌గా మా ప్రభుత్వం సిఎఎని ముందుకు తెచ్చింది" అని కిషన్ రెడ్డి చెప్పారు.

2020-01-09 Read More

నిరసన తెలిపితే భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి కంటే పిరికివాళ్ళు మరెవరూ ఉండరని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాను సిఎంగా ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ కూడా పాదయాత్ర చేశారని, ప్రజల్లోకి వెళ్లడానికి వారికి అనుమతి ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, అమరావతికోసం ప్రజల్లోకి వెళ్తుంటే జగన్ అడ్డుకుంటున్నారని, ఇది పిరికితనమేనని చంద్రబాబు పేర్కొన్నారు.

2020-01-09

భారత దేశంలో అమెరికా రాయబారి సహా 15 మంది దౌత్య ప్రతినిధులు గురువారం ఉదయం శ్రీనగర్ చేరుకున్నారు. రెండు రోజులపాటు వారు జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 అధికరణను రద్దు చేసి, రెండు కేంద్ర పాాలిత ప్రాంతాలుగా విడదీసిన కేంద్రం ఆగస్టులో తీవ్రమైన ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విదేశీ దౌత్యవేత్తలు తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.

2020-01-09 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page