జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి)ను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ప్రకటించిన ముఖ్యమంత్రులంతా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) ప్రక్రియనే నిలిపివేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో కోరింది. ఎన్.పి.ఆర్. ప్రాతిపదికనే ఎన్.ఆర్.సి.ని చేపట్టనున్నందున, ప్రారంభంలోనే అడ్డుకోవాలని సూచించింది. శని, ఆదివారాల్లో ఢిల్లీలో సమావేశమైన పొలిట్ బ్యూరో... సిఎఎకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మద్ధతు ప్రకటించింది.

2020-01-12

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గత సెప్టెంబరులో సమావేశమయ్యారు. మళ్లీ కొద్ది రోజుల్లోనే కలవాలనుకున్నారు. అయితే, అది జరగలేదు. సుమారు 110 రోజుల తర్వాత సోమవారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఈ ఇద్దరి భేటీకి మరోసారి వేదిక కానుంది. కృష్ణా గోదావరి జలాలు, విభజన సమస్యల పరిష్కారంపై ఇద్దరూ చర్చించే అవకాశం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ విడిగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి.. రాజకీయ చర్చకు అస్కారముంది.

2020-01-13

ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చెడు చేసిన ముఖ్యమంత్రి జగన్ తప్ప చరిత్రలో మరొకరు లేరని మాజీ సిఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పల్నాటి గడ్డపైన సిఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అమరావతి పరిరక్షణ చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం నర్సరావుపేటలో జెఎసి నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభలలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ చేసే అరాచకానికి, అమరావతిలో చేస్తున్న వినాశనానికి రాష్ట్రంలో అందరూ నష్టపోతారని ఆయన పేర్కొన్నారు.

2020-01-12

తొమ్మిది నెలల నుంచి తాను మద్యం తాగలేదని ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్ చెప్పారు. కావాలంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలని కోరారు. తనపై కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందన్నారు. పదవి లేదు కాబట్టి ఇప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, రేపటి నుంచి ఏదైనా మాట్లాడతానని, అందరినీ కడిగిపారేస్తానని అన్నారు. అమరావతి రైతులందరినీ తాను పెయిడ్ ఆర్టిస్టులనలేదని పృథ్వీ వివరణ ఇచ్చారు.

2020-01-12

ఆదివారం కాకినాడలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. తాను ఢిల్లీ సమావేశం ముగించుకొని నేరుగా కాకినాడకే వస్తానని, అక్కడే తేల్చుకుందామని వైసీపీకి సవాలు విసిరారు. జరిగిన సంఘటనకు కారకులైన వైసీపీ నాయకులను వదిలేసి, జనసేన నాయకులపై ఐపిసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని పవన్ విమర్శించారు. శనివారం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి జనసేన అధినేతను బూతులు తిట్టడంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ మొదలైంది.

2020-01-12

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. టీటీడీ ఉద్యోగినితో పృథ్వీ సరస సంభాషణల ఆడియో బయటకు వచ్చిన కొన్నిగంటలకే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. సంభాషణ విషయంలో పృథ్వీపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారని, చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారని వార్తలొచ్చాయి. ఆ వెంటనే పృథ్వీ తనంతతానుగా పదవికి రాజీనామా చేశారు. ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ తనది కాదని, ఆ ఆరోపణలను ఖండిస్తున్నానని పృథ్వీ చెప్పారు.

2020-01-12

కాకినాడ రాజకీయ రణరంగమైంది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటివద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. నిన్న పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి ‘నువ్వు చేసే పనులు లం.. చేసినట్టు చేస్తున్నావు దొంగ నా కొ..కా’ అని ఎమ్మెల్యే బూతులు తిట్టారు. అందుకు నిరసనగా ఆదివారం జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటికి ప్రదర్శనగా వెళ్ళారు. ఎమ్మెల్యే అనుచరులు కర్రలతో, రాళ్ళతో దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు.

2020-01-12

అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ జనాభా రిజస్టర్ (ఎన్.పి.ఆర్), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి) రద్దయ్యే వరకు పోరాటం కొనసాగించాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. శనివారం విజయవాడ సింగ్ నగర్ లో సిఎఎకి వ్యతిరేకంగా జరిగిన సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి. శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ, ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడారు.

2020-01-11

ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ‘సైతాన్’గా అభివర్ణించారు. తాను ఎన్ని చేసినా.. ఇంకేదో చేస్తాడని భావించి ప్రజలు 151 సీట్లు ఇస్తే, ఉన్మాదంతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. విశాఖకు అదానీ డేటా సెంటరును, లులు గ్రూపును తెస్తే తరిమేశాడని చంద్రబాబు చెప్పారు. ‘ఈ ‘సైతాన్’ను ఏసు ప్రభువు కూడా క్షమించడు’ అని దుయ్యబట్టారు. శనివారం తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీ, బహిరంగ సభలలో చంద్రబాబు పాల్గొన్నారు.

2020-01-11

తెలంగాణ బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై పార్టీ నేతలు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అరవింద్ పార్టీ టికెట్లు అమ్ముకున్నారని, ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని ఆరోపిస్తూ అసంతృప్త నేతలు హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఆందోళనకు దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కృష్ణదాస్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. లక్ష్మణ్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా నేతలు వినిపించుకోలేదు.

2020-01-11
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page