బిజెపి, జనసేన కలసి పని చేయాలని నిర్ణయించాయి. సందర్భం ప్రభుత్వంపై పోరాటమైనా.. ఎన్నికలైనా.. ఒకటే స్వరం వినిపించాలని నిశ్చయించాయి. గురువారం విజయవాడలో సమావేశమైన జనసేన, బిజెపి ముఖ్య నేతలు ‘‘మూడో ప్రత్యమ్నాయం’’ తామేనని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి. నడ్డాను కలసి వచ్చిన పవన్ కళ్యాణ్, గురువారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ లతో భేటీ అయ్యారు.
2020-01-16కలసి పని చేయాలని నిర్ణయించుకున్న జనసేన, బిజెపి నేతలు గురువారం విజయవాడలో సమావేశమయ్యారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై ఉద్యమం, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన ఎజెండాగా చర్చిస్తున్నట్టు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు సునీల్ దియోధర్, నేతలు పురందేశ్వరి, జి.వి.ఎల్. నరసింహరావు సమావేశంలో ఉన్నారు.
2020-01-16అధికార పార్టీనా.. మజాకా! ఆదాయ వ్యయాల్లో బిజెపి మరెవరికీ అందనంత ఎత్తులో ఉంది. జాతీయ పార్టీలు అధికారికంగా సమర్పించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) మదించింది. 2018-19లో బిజెపికి రూ. 2,410.08 కోట్లు ఆదాయం రాగా, మిగిలిన 5 జాతీయ పార్టీలకు కలిపి అందులో సుమారు సగమే (రూ. 1288.58 కోట్లు) వచ్చింది. బిజెపి రూ. 1005.33 కోట్లు ఖర్చు చేసి రూ. 1,404.75 కోట్లు మిగుల్చుకుంటే...మిగిలిన పార్టీల వ్యయం మొత్తం రూ. 612.24 కోట్లుగా ఉంది.
2020-01-15రష్యాలో బుధవారం అసాధారణ పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని డిమిత్రి మెద్వెదేవ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేసింది. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తలపెట్టిన రాజ్యాంగ సంస్కరణలకోసం ప్రభుత్వ రాజీనామాకు ఆదేశించారు. దేశ ‘‘అధికార సమతుల్యత’’లో గణనీయమైన మార్పులను అధ్యక్షుడు ప్రతిపాదించారని, అందువల్ల ‘‘ప్రస్తుత రూపం’’లో ప్రభుత్వం రాజీనామా చేసిందని మెద్వెదేవ్ చెప్పారు. ఇక తదుపరి నిర్ణయాలన్నీ అధ్యక్షుడే తీసుకుంటారని ఆయన తెలిపారు.
2020-01-15ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవగాహనా రాహిత్యం, ఆత్రం, శాడిజం, నిరంకుశత్వం.. అన్నీ సిఎంలో కనిపిస్తున్నాయని కన్నా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పోలీసు పాలన చేస్తే జగన్ రాక్షస పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన కన్నా... ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాష్ట్రం ఆయన జాగీరు కాదని వ్యాఖ్యానించారు.
2020-01-15జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (14వ తేదీ) కాకినాడలో పర్యటించనున్నారు. నిన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులు జనసేన నాయకులపై దాడి చేయడంతో..అక్కడే తేల్చుకుందామని పవన్ సవాలు విసిరారు. పవన్ రేపు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి కాకినాడ వెళ్తారు. దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలు, నాయకులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడతారు.
2020-01-13వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపి విజయసాయి రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కాళ్లకు నమస్కరించారు. సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకోసం ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో కలసి విజయసాయి రెడ్డి హైదరాబాద్ ప్రగతి భవనానికి వెళ్లారు. కేసీఆర్ వారికి స్వాగతం పలికి హాలులోకి తీసుకెళ్ళాక ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
2020-01-13రాజధానిపై ప్రభుత్వ వైఖరి సరైనదనుకుంటే... 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మాజీ సిఎం చంద్రబాబు అధికార వైసీపీకి సవాలు విసిరారు. ప్రజలు అమరావతి వద్దని ఓటు వేస్తే తాను రాజకీయాలనుంచే తప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను కర్నూలుకు, సీమకు వ్యతిరేకం కాదని, తాను కూడా రాయలసీమ బిడ్డనేనని నొక్కి చెప్పారు. అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు అన్ని ప్రాంతాలవారూ ఒప్పుకొన్నారని చంద్రబాబు చెప్పారు.
2020-01-13జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి)ని దేశవ్యాప్తంగా అమలు చేయడం అనవసరమని, సమర్ధనీయం కాదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. అది జరుగుతుందని కూడా తాను అనుకోవడంలేదని నితీష్ సోమవారం బీహార్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి కూడా అదే చెప్పారని నితీష్ పేర్కొనడం విశేషం. ఎన్.ఆర్.సి, సిఎఎ, ఎన్.పి.ఆర్.లపై నితీష్ కుమార్ స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్ డిమాండ్ చేసినప్పుడు నితీస్ స్పందించారు.
2020-01-13తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కె. చంద్రశేఖరరావు సోమవారం హైదరాబాద్ ప్రగతి భవనంలో సమావేశమయ్యారు. నదీ జలాల సమర్ధ వినియోగం, రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాని సమస్యలు తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, పి. మిథున్ రెడ్డి ప్రగతి భవనానికి వెళ్లారు. కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు, తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ ఉన్నారు.
2020-01-13