‘2019 ప్రజాస్వామ్య సూచీ’ ప్రపంచ ర్యాంకులలో ఇండియా 10 స్థానాలు దిగజారి 51కి చేరింది. ఒక్క ఏడాదే సూచీ 7.23 పాయింట్ల (2018) నుంచి 6.90 స్థాయికి పడిపోయింది. ‘‘పౌర హక్కుల పతనం’’మే ఇందుకు ప్రధాన కారణంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఇఐయు) విశ్లేషించింది. ‘‘ప్రజాస్వామ్య తిరోగమనం’’గా దీన్ని అభివర్ణించింది. ఈ సంస్థ 2016 నుంచి ‘డెమోక్రసీ ఇండెక్స్’ను ప్రకటిస్తోంది. 2019 ర్యాంకులను బుధవారం వెల్లడించింది.

2020-01-22

వికేంద్రీకరణ పేరిట రాజధానిని విశాఖపట్టణానికి తరలించే బిల్లును నిన్న శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో మంగళవారం అమరావతి స్తంబించింది. రాజధాని ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా మరోసారి బంద్ నిర్వహించారు. పోలీసులు అణచివేతకు దిగినందున వారికి తాగునీరు సహా ఏమీ ఇవ్వకూడదని నిరసనకారులు నిర్ణయించారు. నిరసన శిబిరాల వద్ద రాజధాని తరలింపు బిల్లు ప్రతులను దగ్ధం చేశారు.

2020-01-21

రాజధాని తరలింపు వెనుక లక్ష్యం ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదని, విశాఖపట్నం భూములేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు రూ. 1400 కోట్లు ఇచ్చుకున్నాడంటూ ‘అందులో 700 కోట్లు ఉత్తరాంధ్రకు ఎందుకు ఇవ్వలేదు’ అని ప్రశ్నించారు. ఆ 1400 కోట్లు రాయలసీమ మొత్తానికి ఇచ్చినా సంతోషించేవారమని కన్నా పేర్కొన్నారు. సోమవారం రాత్రి ‘రాజధాని తరలింపు’ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కన్నా మాట్లాడారు.

2020-01-21

రాజధాని తరలింపు విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్న టీడీపీ విన్నపానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. ‘కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తే టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా’ అని ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ విషయంలో టీడీపీ విఫలమైందని విమర్శించారు. 33 వేల ఎకరాలు సమీకరించానని గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబునాయుడు.. ఐదు శాశ్వత భవనాలు కట్టలేని చేతగానివాడిగా చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.

2020-01-21

జగన్మోహన్ రెడ్డి తన తండ్రినే స్ఫూర్తిగా తీసుకొని అమరావతి సహా అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగించాలని మాజీ సీఎం చంద్రబాబునాయుడు హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రానికి తన తర్వాత సిఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్టును, ఇతర ప్రాజెక్టులను నిలిపివేయలేదని గుర్తు చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేసిన వై.ఎస్.కు కూడా పేరొచ్చిందని బాబు పేర్కొన్నారు. మూడు రాజధానులు సఫలం కావని సోమవారం అసెంబ్లీ చర్చలో చంద్రబాబు ఉద్ఘాటించారు.

2020-01-20

గుజరాత్ పటేల్ ఉద్యమ నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు హార్దిక్ పటేల్ శనివారం రాత్రి అరెస్టయ్యారు. 2015లో ఆయనపై నమోదైన ‘దేశద్రోహం’ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారంట్ జారీ అయింది. వారంట్ జారీ అయిన కొద్ది గంటల్లోనే అహ్మదాబాద్ జిల్లా పోలీసులు పటేల్ ను అరెస్టు చేశారు. 2015 ఆగస్టు 25న అహ్మదాబాద్ నగరంలో పటేళ్ళ భారీ ర్యాలీలో హింస చోటు చేసుకుంది. ఇందుకు హార్దిక్ ను బాధ్యుడిగా పేర్కొంటూ ‘దేశద్రోహం’ కేసు నమోదు చేశారు.

2020-01-18

ఉక్రెయిన్ దేశ ప్రధానమంత్రి ఒలెక్సీ హోంచారుక్ (35) తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖ అందినట్టు దేశాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. ఒలెక్సీ పదవి చేపట్టి ఐదు నెలలు కూడా కాలేదు. ఆగస్టు 29న ఆయన ప్రధానిగా నామినేట్ అయ్యారు. ఉక్రెయిన్ దేశానికి చిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తి ఒలెక్సీ.

2020-01-17

రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సి.ఆర్.డి.ఎ) రద్దు ప్రతిపాదన తనకు తెలియదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో హై పవర్ కమిటీ సభ్యుల సమావేశం అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడారు. రాజధానిపై చెన్నై ఐఐటి నివేదిక ఇచ్చిందనే మాట కూడా అవాస్తవమని స్పష్టం చేశారు. అమరావతి రైతులపై తమకు సానుభూతి ఉందన్న బొత్స ‘చంద్రబాబు మాయలో పడొద్దు’ అంటూ వారికి సూచించారు.

2020-01-17

షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఒ) వార్షిక సమావేశంకోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను ఇండియా ఆహ్వానించనుంది. 8 సభ్య దేశాలు, మరో 4 పరిశీలక భాగస్వామ్య దేశాలను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ గురువారం చెప్పారు. ‘‘ఇమ్రాన్ ఖాన్ ను ఆహ్వానిస్తున్నారా’’ అని విలేకరులు అడిగినప్పుడు ‘‘అవును’’ అని రవీష్ చెప్పారు. ఎస్.సి.ఒ. సమావేశానికి ఇండియా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.

2020-01-16 Read More

ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సాకె శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎన్. తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలిలను ఎఐసిసి నియమించింది. ఈ ముగ్గురి ఎంపిక వ్యూహాత్మకంగా జరిగినట్టు చెబుతున్నారు. శైలజానాథ్ (అనంతపురం), తులసిరెడ్డి (కడప) రాయలసీమ వాసులు. మస్తాన్ వలి గుంటూరు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ పౌరసత్వ సవరణ చట్టానికి మద్ధతు తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ మైనారిటీలు, దళితులపై ఫోకస్ పెట్టడం గమనార్హం.

2020-01-16
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page