ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, అచ్ఛెన్నాయుడు గవర్నరును కలసినవారిలో ఉన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులపై అణచివేత చర్యలు, శాసన మండలి ఛైర్మన్.. ఇతర సభ్యుల పట్ల మంత్రులు వ్యవహరించిన తీరు తదితర పరిణామాలను గవర్నరుకు వివరించారు.

2020-01-24

తన స్వార్ధంకోసం చంద్రబాబు కౌన్సిల్ ప్రతిష్ఠను మంటగలిపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి విమర్శించారు. విజయసాయి శుక్రవారం వివిధ ట్వీట్లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ‘‘ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నాడు. పప్పునాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. యనమల లాంటి తిరస్కృతులకు చరమాంకం చేదు జ్ఞాపకంగా మిగులుతుంది’’ అని విజయసాయి పేర్కొన్నారు.

2020-01-24

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కొందరు తమ పదవులు పోయినా పర్లేదని ముఖ్యమంత్రి నిర్ణయాలకు మద్ధతు పలుకుతున్నారు. మొన్న శాసనసభలో రాజధాని తరలింపు (వికేంద్రీకరణ) బిల్లుకు మద్ధతు తెలిపిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి.. తన రాజకీయ భవిష్యత్తు ఏమైనా పర్లేదని వ్యాఖ్యానించారు. గురువారం మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.. శాసన మండలిని రద్దు చేయాలని సిఎంకు సూచించారు. బోస్ మండలి సభ్యుడిగా మంత్రివర్గంలో ఉన్నారు.

2020-01-23

ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడంకోసం మేధావులతో ఏర్పాటు చేసుకున్న శాసన మండలి చట్టాలను అడ్డుకునే వేదికగా మారిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులతో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లునూ అడ్డుకున్నదని మండలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘వాళ్ళ పిల్లలు ఇంగ్లీషు మీడియంకు పోవాలి. పేదల పిల్లలు వద్దు’ అని వ్యాఖ్యానించారు. ఎస్.సి, ఎస్.టి.లకు ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు అంశాన్నీ ఆలస్యం చేసిందన్నారు.

2020-01-23

ప్రతిపక్ష టీడీపీ మెజారిటీతో నడుస్తున్న శాసన మండలిపై అధికార వైసీపీ కన్నెర్ర చేసింది. రాజధాని ‘వికేంద్రీకరణ’ బిల్లును ‘సెలక్ట్ కమిటీ’ పేరిట నిలువరించిన మండలిని కొనసాగించాలా? వద్దా? అన్న కోణంలో ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో చర్చను చేపట్టింది. మండలి ఛైర్మన్ నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని, లేని విచక్షణాధికారాన్ని వినియోగించారని మంత్రులు ఆరోపించారు. మండలి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు.

2020-01-23

రాజధాని ‘వికేంద్రీకరణ’, సీఆర్డీయే రద్దు బిల్లులపై తక్షణ విచారణ అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. శాసనసభ బిల్లులను ఆమోదించినా.. మండలి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తారని పిటిషనర్ల తరపు న్యాయవాది అశోక్ భాన్ కోర్టుకు నివేదించారు. అలా చేస్తే ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

2020-01-23

చంద్రబాబు తన తొత్తును తెచ్చి మండలి ఛైర్మన్ సీటులో కూర్చోబెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఛైర్మన్ షరీఫ్ చట్టాలపై గౌరవం లేని వ్యక్తి అని విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికేంద్రీకరణ’ బిల్లును ఛైర్మన్ నిన్న సెలక్ట్ కమిటీ పరిశీలనకు నివేదించిన నేపథ్యంలో బొత్స గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డివిజన్ కోరకుండా బిల్లును సెలక్ట్ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు.

2020-01-23

సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసిన ‘రాజధాని వికేంద్రీకరణ’ బిల్లు మరో మూడు నెలలు వెలుగు చూసే అవకాశం లేదు. ఈలోగా శాసనసభ మరోసారి ఆ బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. అలాగని ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడమూ కుదరదు. బిల్లు ఉపసంహరణకూ అవకాశం లేదు. మూడు నెలలు దాటితే మండలి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా అసెంబ్లీ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ పరిస్థితిని ముందే ఊహించినందునే..మంత్రులు అధికారమంతా ఉపయోగించి మండలిలో పోరాడారు.

2020-01-23

బుధవారం సామాజిక మాథ్యమాల్లో తమిళ, తెలుగు హీరోల అభిమానుల మధ్య వివాదం తలెత్తింది. పరస్పర అవహేళనలతో పోస్టులు పెడుతున్నారు. #TeluguRealHeroes #UnrivalledTamilActors #AsuranKaaBaapNaarappa అనే ‘హ్యాష్ ట్యాగ్’లు ట్రెండింగ్ అయ్యాయి. తమిళ సూపర్ హిట్ సినిమా ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ పోస్టరుతో వెంకటేశ్ అభిమానులు పెట్టిన పోస్టు వివాదానికి కేంద్ర బిందువుగా చెబుతున్నారు. అదే కారణమా లేక మరొకటా అని తేలాల్సి ఉంది.

2020-01-22

కేంద్రంలో బి.జె.పి. సొంతగా మెజారిటీ సాధించి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక...దేశంలో ప్రజాస్వామ్యం తిరోగమించింది!. ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ ‘‘డెమోక్రసీ ఇండెక్స్’’ ఐదేళ్ళ డేటాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మోడీ అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం ‘డెమోక్రసీ ఇండెక్స్’లో ఇండియా స్కోరు 7.92గా ఉంది. 2015లో 7.74కు తగ్గి 2016లో స్వల్పంగా పెరిగింది (7.81కి). తిరిగి 2017లో 7.23కు, 2019లో ఏకంగా 6.90కు పడిపోయింది.

2020-01-22
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page