సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు రోజుల పాటు జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో చివరి రోజైన బుధవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మాజీ ఎంఎల్ఎ గఫూర్, సీనియర్ నేతలు వై. వెంకటేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు, వి. ఉమామహేశ్వరరావు, సిహెచ్ బాబూరావు, డి. రమాదేవి, మంతెన సీతారాం, వి. కృష్ణయ్య, దడాల సుబ్బారావు, బి. తులసీదాస్ సహా 50 మంది నూతన కమిటీలో ఉన్నారు.
2021-12-29ఉత్తరప్రదేశ్ లో నిరసన తెలుపుతున్న రైతులను కారుతో తొక్కించిన కేంద్ర మంత్రి కుమారుడి వ్యవహారంలో నోరు విప్పిన ఏకైక బిజెపి నేత ఎంపీ వరుణ్ గాంధీపై ఆ పార్టీ వేటు వేసింది. కేంద్ర మంత్రి కారు రైతులను తొక్కుకుంటూ వెళ్ళిన వీడియోను వరుణ్ గాంధీ ట్విట్టర్లో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే.. బిజెపి జాతీయ కార్యవర్గం నుంచి ఆయనను, ఆయన తల్లి మేనకా గాంధీని తప్పించారు. చిందిన రైతుల రక్తానికి జవాబుదారీ వహించాలని, న్యాయం జరగాలని వరుణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
2021-10-07దేశంలో ప్రస్తుతం నియంతృత్వం ఉందని, ప్రభుత్వం రైతులపై దాడి చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యూపీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం తొక్కుకుంటూ వెళ్లగా మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి రాహుల్ బుధవారం ఆ రాష్ట్రానికి వెళ్లారు. రాహుల్ గాంధీతోపాటు చత్తీస్ గఢ్, పంజాబ్ సిఎంలు భూపేష్ బఘేల్, చరణ్ జిత్ సింగ్ చని ఉన్నారు. ముందు నిరాకరించిన యూపీ పోలీసులు ఎట్టకేలకు రాహుల్ పర్యటనకు అనుమతి ఇచ్చారు.
2021-10-06స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఎర్రకోటపై నుంచి 8వ సారి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాత హామీనే కొత్తగా ప్రస్తావించారు. కాకపోతే దానికొక కొత్తపేరు పెట్టారు. రూ. 100 లక్షల కోట్ల నిధితో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని గత రెండేళ్ళుగా మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు చెబుతూనే ఉన్నారు. 2019, 2020 ఆగస్టు 15 ప్రసంగాల్లోనూ ఇది ప్రధానాంశంగా ఉంది. గత ఏడాది ‘నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్’ అన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ‘పిఎం గతి శక్తి’ అనే భారీ పథకంగా చెప్పారు.
2021-08-15ఆగస్టు 14ను ఇక నుంచి ‘విభజన ఘోరాల జ్ఞాపక దినం’గా పాటించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 1947లో దేశ విభజన సందర్భంగా భారతీయులు అనుభవించిన బాధను గుర్తించడానికే ఈ కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. విభజన గాయాలను ఎప్పటికీ మరచిపోలేమని, మన లక్షలాది సోదర సోదరీమణులు నిరాశ్రయులయ్యారని, బుద్ధిహీన ద్వేషం-హింస కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని మోదీ ట్వీట్ చేశారు. భారతదేశం రెండుగా విడిపోయిన రోజు ‘‘సామాజిక విభజనల విషాన్ని తొలగించాల్సిన’’ అవసరాన్ని గుర్తు చేస్తోందని పేర్కొన్నారు.
2021-08-14లడఖ్ సరిహద్దుల్లో చైనా చొరబాట్లకు సంబంధించి మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ‘‘మోదీ, ఆయన సేవకులు వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారు’’ అంటూ సోమవారం పొద్దున్నే ఓ ఘాటైన ట్వీట్ చేశారు. ఆ భూభాగాన్ని ఎప్పుడు వెనుకకు తీసుకుంటామని రాహుల్ ప్రశ్నించారు. గత ఏడాది సరిహద్దు ఘర్షణల తర్వాత 11 విడతలుగా చర్చలు జరిగాయి. కొద్ది నెలల విరామం తర్వాత సోమవారం జరిగిన 12వ దఫా చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయని వచ్చిన వార్తా కథనాన్ని రాహుల్ షేర్ చేశారు.
2021-08-02అస్సాం-మిజోరాం సరిహ్దదు ఘర్షణ మరింత జఠిలంగా మారుతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, నలుగురు అస్సాం సీనియర్ పోలీసు అధికారులపై మిజోరాం పోలీసులు హత్యాయత్నం, కుట్ర కేసులు నమోదు చేశారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద ఈ నెల 26న జరిగిన ఘర్షణలో అస్సాం పోలీసులు ఆరుగురు చనిపోయారు. అస్సాం పోలీసులు 200 మంది తమ పోలీసు పోస్టుపై దాడికి వచ్చారని పేర్కొంటూ సోమవారమే మిజోరాంలో కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు అస్సాం పోలీసులు కూడా ఈ ఘటనపై బుధవారం కేసు నమోదు చేశారు.
2021-07-30మోదీ ప్రభుత్వంలో కొత్త మంత్రి మీనాక్షి లేఖి రైతు సంఘాల నేతలపై నోరు చేసుకున్నారు. జంతర్ మంతర్ ‘రైతు పార్లమెంటు’ వద్ద ఒక మీడియా వ్యక్తిపై దాడి జరిగిందని ఆరోపించిన మంత్రి, ‘‘వాళ్లు రైతులు కాదు... రౌడీలు. ఇవి నేరపూరిత చర్యలు. జనవరి 26న జరిగినవి కూడా సిగ్గుపడవలసిన నేరపూరిత చర్యలే. ప్రతిపక్షాలు ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు కొన్ని నెలలుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
2021-07-22మోదీ ప్రభుత్వాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. ఇజ్రాయెలీ కంపెనీ ఎన్.ఎస్.ఒ. నిఘా సాఫ్ట్ వేర్ ‘పెగాసస్’ను ఉపయోగించి 2018-2019 మధ్య భారీ స్థాయిలో గూఢచర్యానికి పాల్పడ్డట్టు వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులతో పాటు తన సొంత మంత్రులు, సంఘపరివారంలోని సహచరులను కూడా వదల్లేదు. ఫోన్లలో స్పైవేర్ ను చొప్పించి సమాచారాన్ని, సంభాషణలను సేకరించారు. రాహుల్ గాంధీ, కొత్త ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్, మరో మంత్రి ప్రహ్లాద్ పటేల్, సన్నిహిత మంత్రి స్మృతి ఇరానీ, వి.హెచ్.పి. నేత ప్రవీణ్ తొగాడియా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బాధిత జాబితాలో ఉన్నారు.
2021-07-19తనతో సెల్ఫీ దిగాలనుకునేవారు రూ. 100 చెల్లించాలని మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠాకూర్ షరతు విధించారు. ఆ మొత్తం పార్టీ (బిజెపి) స్థానిక విభాగంలో డిపాజిట్ చేయాలని సూచించారు. ‘‘మిత్రులారా, మీకు తెలుసు.. సెల్ఫీలు దిగడం వల్ల చాలా కాలహరణం జరుగుతోంది. కొన్ని గంటలు ఆలస్యమవుతోంది.. సెల్ఫీలు దిగాలనుకునే ఎవరైనా స్థానిక పార్టీ విభాగం ట్రెజరర్ వద్ద 100 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఆ మొత్తాన్ని పార్టీకోసం వినియోగిస్తాం’’ అని ఠాకూర్ చెప్పారు.
2021-07-18