ఎన్నికల వ్యూహకర్త, జెడి(యు) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్, పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ బహిష్కరణకు గురయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్ధతు ఇవ్వడంపై ఈ ఇద్దరూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఎఎకి మద్ధతు రాజ్యాంగ వ్యతిరేకమే కాక... జెడి(యు) లౌకిక ప్రస్థానాన్ని కూడా ఉల్లంఘించడమని వ్యాఖ్యానించారు. సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇది బిజెపి మిత్రుడైన నితీష్ కు కోపం తెప్పించింది.
2020-01-30 Read Moreనరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఓ పెద్ద ఉపశమన వార్త. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ వాయిదా పడింది. మార్చి రెండో పక్షానికి ఓటింగ్ వాయిదా వేయడంపై ఓటింగ్ నిర్వహించారు. వాయిదాకు అనుకూలంగా 271 ఓట్లు, వ్యతిరేకంగా 191 ఓట్లు నమోదయ్యాయి. యూరోపియన్ పార్లమెంటులోని 5 ప్రధాన రాజకీయ గ్రూపులు సిఎఎ వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఓటింగ్ వాయిదా దౌత్య విజయమని కేంద్రం పేర్కొంది.
2020-01-29 Read Moreభారత బ్యాడ్మింటన్ దిగ్గజాల్లో ఒకరైన సైనా నెహ్వాల్ బుధవారం బి.జె.పి.లో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమెకు కాషాయ కండువా కప్పారు. సైనా సోదరి చంద్రాన్హు నెహ్వాల్ కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంకోసం చాలా కష్టపడుతున్నారని, క్రీడలకోసమూ ఖేలో ఇండియా వంటి పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా సైనా పేర్కొన్నారు.
2020-01-29శాసన మండలికి ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ దండగేనన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యను తెలంగాణ ఎంపీ కె. కేశవరావు తప్పు పట్టారు. అది ‘పూర్తిగా నాన్సెన్స్’ అని వ్యాఖ్యానించారు. ఏ పరిణతి చెందిన ప్రజాస్వామ్యంలోనైనా రెండో ఆలోచనకు తావుంటుందని, ఎగువ సభ చాలా అవసరమని కేకే పేర్కొన్నారు. మంగళవారం కేకే హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
2020-01-28శాసన మండలిని పునరుద్ధరించడానికి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారో అసెంబ్లీ వేదికగా వీడియో ప్రదర్శించారు ప్రస్తుత సిఎం జగన్. దీనికి బదులుగా చంద్రబాబు సోమవారం రాత్రి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి... అరడజను అంశాల్లో జగన్ మాట మార్చారంటూ ‘అప్పుడు, ఇప్పుడు’ క్లిప్పింగ్స్ ప్రదర్శించారు. రాజధాని, ప్రత్యేక హోదా, 45 సంవత్సరాలకే పెన్షన్, సన్నబియ్యం వంటి అంశాలు వాటిలో ఉన్నాయి.
2020-01-27‘‘ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బెదిరించి ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన నువ్వు సచ్చీలుడివా?’’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఒక్కొక్క ఎమ్మెల్సీకి రూ. 5 కోట్ల నుంచి 20 కోట్ల దాకా ఆఫర్ చేశారని, పోతుల సునీతకు వైసీపీ కండువా కప్పారని విమర్శించారు. బీటీ నాయుడు ఇంటిపై దాడి చేశారని, మరో ఎమ్మెల్సీ కోల్డ్ స్టోరేజీని సీజ్ చేశారని చంద్రబాబు ఆక్షేపించారు.
2020-01-27శాసన మండలి రద్దు కాలేదని, రద్దు ప్రతిపాదన మాత్రమే ప్రభుత్వం చేసిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. మండలి రద్దు అధికారం ప్రభుత్వానికి, అసెంబ్లీకి లేదని.. పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి మాత్రమే చేయగలరని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుందని, అప్పటిదాకా ఈ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటామని యనమల స్పష్టం చేశారు. ‘‘మీ ఆటలు మండలిలో సాగవు’’ అని సిఎంను ఉద్ధేశించి చెప్పారు.
2020-01-27ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి లను మించిన నేత ప్రస్తుత సిఎం జగన్మోహన్ రెడ్డి అని అధికార పార్టీ సభ్యుడు పార్ధసారథి అసెంబ్లీలో ప్రశంసించారు. గతంలో రాష్ట్రానికి కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవ రెడ్డి వంటి మహామహులు ముఖ్యమంత్రులైనా వారెవరూ ప్రజల మనసుల్లో నిలువలేదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే ప్రజల మనసుల్లో ఉన్నారంటూ.. ఇప్పుడు జగన్ వారిని మించిపోయారని ‘శాసన మండలి రద్దు’పై చర్చ సందర్భంగా చెప్పారు.
2020-01-27శాసన మండలిని రద్దు చేస్తామన్నది ముఖ్యమంత్రి బెదిరింపు మాత్రమేనని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. నిజంగా అలాంటి ఉద్దేశమే ఉంటే... మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలతో ముందుగా రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. పదవులు పోతాయనే భయం టీడీపీ ఎమ్మెల్సీలకు లేదని ఉద్ఘాటించారు.
2020-01-26ఒక్క సంవత్సరం ఆగితే శాసన మండలిలో తమకే మెజారిటీ వస్తుందని, టీడీపీ ఎమ్మెల్సీలను కొనవలసిన అవసరం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మండలిని రద్దు చేయడానికి సోమవారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చన్న అనుమానాల మధ్య సజ్జల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టీడీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో 17 మంది తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా సజ్జల చెప్పుకొచ్చారు.
2020-01-26