చంద్రబాబు పాలనతోనే ఆర్థిక కష్టాలు వచ్చాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారన్న చంద్రబాబు ఆరోపణలపై మంత్రి గురువారం స్పందించారు. రాష్ట్ర విభజననాటికి మార్కెట్ రుణాలు రూ. 97 వేల కోట్లు ఉంటే చంద్రబాబు దిగిపోయేనాటికి రూ. 1.92 లక్షల కోట్లకు పెరిగాయని, గ్యారంటీలు రూ. 9,500 కోట్ల నుంచి రూ. 75 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. ఇంతా చేసి రూ. 60 వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా తమ నెత్తిన పెట్టారని బుగ్గన వ్యాఖ్యానించారు.

2020-02-06

అనంతపురం ‘కియా’ కార్ల ఫ్యాక్టరీ తరలిపోవచ్చన్న ‘రాయిటర్స్’ కథనంతో అధికార వైసీపీ ఉలికిపడింది. ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కావడంతో..పలువురు స్పందించారు. ప్రభుత్వం నుంచి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, మంత్రి బుగ్గన ఆ కథనాన్ని ఖండించారు. కియాను బెదిరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మాధవ్ ఫ్యాక్టరీ మరింత విస్తరిస్తుందని చెప్పుకొచ్చారు. పార్లమెంటు లోపల మిథున్ రెడ్డి, బయట విజయసాయిరెడ్డి కూడా వివరణ ఇచ్చారు.

2020-02-06

ఉన్మాద ముఖ్యమంత్రి శాశ్వతంగా ఉండబోడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని పెదపరిమి గ్రామంలో రైతుల దీక్షా శిబిరాన్ని బుధవారం చంద్రబాబు సందర్శించారు. దుర్మార్గులైన వైసీపీ నేతలు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారని దుయ్యబట్టారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన తన పట్ల కనీస మర్యాద లేకుండా వైసీపీ నేతలు బూతు పంచాంగం వినిపిస్తున్నారని విమర్శించారు.

2020-02-05

5-0 తేడాతో అసాధారణ స్థాయిలో న్యూజీలాండ్ టి20 సిరీస్ దక్కించుకున్న ఇండియా, వన్డే సిరీస్ తొలి మ్యాచులో ఓడింది. ఛేజింగ్ లో 348 పరుగుల భారీ స్కోరు సాధించి న్యూజీలాండ్ ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో 1-0 తేడాతో ముందడుగు వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. న్యూజీలాండ్ తన లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

2020-02-05

ఏపీకి ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వాలని మాట్లాడితే రాజకీయంగా ఇబ్బంది పడతారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు హెచ్చరించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, దాన్ని మళ్లీ తెరపైకి తెమ్మని సిఎం కోరుతున్నారని, ఆ అవకాశం లేదని.. ఆలోచన కూడా కేంద్రానికి లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. లేని అంశంపై రాజకీయం చేస్తే అది జగన్ మెడకే చుట్టుకుంటుందని వ్యాఖ్యానించారు.

2020-02-05

విశాఖపట్నంలో 4000 ఎకరాలు అమ్మి అభివృద్ధి చేస్తామని జగన్ ప్రభుత్వం అంటోందని, అలా చేసేది మూర్ఖులని మాజీ సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ఎవరైనా భూమి అమ్మి తాగితే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. బుధవారం రాయపూడి గ్రామంలో మాట్లాడుతూ.. జగన్ నిర్ణయాలతో అమరావతితో పాటు రాష్ట్రం మొత్తం నష్టపోతోందని చంద్రబాబు విమర్శించారు. తమ హయాంలో విశాఖకు వచ్చిన కంపెనీలు ఇప్పుడు వెనక్కు వెళ్ళిపోయాయని చెప్పారు.

2020-02-05

అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు లెక్కలోవి కావని, దానికి మించి ఇంకా వస్తాయని తాను అనుకోవడంలేదని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంకా ఇస్తే మరో రూ. 1000 కోట్లకు మించకపోవచ్చని పేర్కొన్నారు. సిఎం బుధవారం విజయవాడలో ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా రూ. లక్షా 3 వేల కోట్లు అవసరమైనచోట తాను మరో ఆరేడు వేల కోట్లు ఖర్చు చేసినా...సముద్రంలో నీటి చుక్కలానే కనిపించదని పేర్కొన్నారు.

2020-02-05

మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న ఢిల్లీ రాష్ట్రానికి 2020 కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు అమాంతం పెరిగాయి. శాసనసభలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్ఛేరిలకు కలిపి రూ. 47,408 కోట్లు కేటాయింపుల్లో చూపారు. 2018-19లో ఈ రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 7,955 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఈ మొత్తం రూ. 28,419 కోట్లకు పెరుగుతుందని సవరించిన అంచనాల్లో కేంద్రం పేర్కొంది.

2020-02-01

జనజేన పార్టీకి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. గురువారం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయంతో మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది’’ అని ఆ లేఖలో పవన్ ను ఆక్షేపించారు.

2020-01-30

జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సే తరహాలోనే ప్రధాని నరేంద్ర మోడీలో అణువణువునా విద్వేషం నిండి ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గురువారం గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నియోజకవర్గంలో ‘సేవ్ కాన్స్టిట్యూషన్’ ర్యాలీ నిర్వహించారు. ‘‘గాడ్సే, మోడీ మధ్య తేడా లేదు. ఒక్క విషయంలో తప్ప... గాడ్సేని నమ్ముతానని చెప్పే ధైర్యం మోడీకి లేదు’’ అని రాహుల్ పేర్కొన్నారు.

2020-01-30 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page