ఉమ్మడి ఏపీ విభజన సమయంలో హామీ ఇచ్చిన మేరకు ‘ప్రత్యేక కేటగిరి హోదా’, ఇతర బాధ్యతలను కేంద్రం నిర్వర్తించాలని కోరుతూ వామపక్షాలు ఆందోళనకు దిగనున్నాయి. ఈ నెల 12 నుంచి 17వ తేదీవరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, 17న కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చాయి. తొమ్మిది వామపక్ష పార్టీల నాయకులు శుక్రవారం విజయవాడలోని ఎం.బి. భవన్లో సమావేశమయ్యారు. అనంతరం సిపిఎం, సిపిఐ కార్యదర్శులు మధు, రామక్రిష్ణ వివరాలను వెల్లడించారు.
2020-02-07కేరళ బడ్జెట్ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీ కేంద్రానికి ఓ రాజకీయ సందేశం పంపింది. బడ్జెట్ ప్రసంగం మళయాళ కాపీ అట్టపైన ‘‘గాంధీ మరణం’’ చిత్రాన్ని ప్రదర్శించారు ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్. కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోందని చెప్పారు. ‘‘సందేశం ఇదే..మాకు గుర్తుంది. మహాత్ముడు హత్యకు గురయ్యాడు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పూజించే హిందూ మతవాదులచేత హత్యగావించబడ్డాడు. ప్రజలు మరువరు’’ అని ఇసాక్ ఉద్ఘాటించారు.
2020-02-07ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ గ్రామ స్థాయి ఫ్యాక్షనిస్టులా ప్రవర్తిస్తున్నాడని బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ఒకప్పుడు కాశ్మీర్, బీహార్ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారని, ఇప్పుడు ఏపీ పరిస్థితి ఆయా రాష్ట్రాల కంటే ఘోరంగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ రాష్ట్రం గురించి సమీక్ష చేయవలసిన అవసరం ఉందని బైరెడ్డి అభిప్రాయపడ్డారు. సిఎంను ఉద్ధేశించి ‘‘ఈకోతి ఏపీ అనే వనాన్ని సర్వ నాశనం చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.
2020-02-07తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి, సిఎం అయ్యాక ఇప్పుడు ఎందుకు ఉపసంహరించుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఎవరిని కాపాడటం కోసం ఈ పని చేశారని వర్ల నిలదీశారు. ఈ విషయంలో వివేకానందరెడ్డి సతీమణి, కుమార్తెలకు.. వారితో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2020-02-07సిఎం జగన్మోహన్ రెడ్డి మూడో కన్ను తెరిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు భస్మం అవుతారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఎన్ని వేషాలు వేసినా జగన్ క్షమాగుణం, ఓర్పు వల్లనే మనగలుగుతున్నారని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గాంధీ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అనిల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాము మంత్రులం కావడంకంటే ముందు జగన్మోహన్ రెడ్డి భక్తులమని, పదవి పోయినా భక్తులుగా ఉండటమే గొప్ప అని పేర్కొన్నారు.
2020-02-07అస్సాంలో ‘‘శాశ్వత శాంతి’’ ఉదయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ‘బోడో శాంతి ఒప్పందం’పై కోక్రఝార్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు మోడీ శుక్రవారం హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై అస్సాంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాక.. తొలిసారి మోడీ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టారు. డిసెంబరులో జపాన్ ప్రధాని ‘షింజో అబె’తో గౌహతిలో జరగాల్సిన సమావేశాన్ని, జనవరిలో ‘ఖేలో ఇండియా’ క్రీడోత్సవ పర్యటనను కూడా మోడీ రద్దు చేసుకున్నారు.
2020-02-07మతతత్వాన్ని వ్యతిరేకించే కేరళ ప్రభుత్వం.. మహాత్మాగాంధీని నాథురాంగాడ్సే (ఆర్ఎస్ఎస్) హత్య చేస్తున్న సందర్భాన్ని.. బడ్జెట్ 2020-21 ప్రసంగ పాఠం కవర్ పేజీపై చిత్రించింది. ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ‘‘ఇండియాలో ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం ముఖాముఖి తలపడ్డాయి. ఢిల్లీ పాలకులు ద్వేషభాషలోనే మాట్లాడుతున్నారు. వారి అనుయాయులు హింస, దాడులనే కర్తవ్యంగా భావిస్తున్నారు. పాలనా యంత్రాంగం పూర్తిగా మతతత్వానికి లొంగిపోయింది’’ అనే వాఖ్యాలనే ముందుమాటగా చదివారు.
2020-02-07విశాఖలో గత ప్రభుత్వం భూమి కేటాయించిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ బోగస్ అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటులో చెప్పడంపై టీడీపీ మండిపడింది. పనికిమాలిన ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’లో సిఎం జగన్మోహన్ రెడ్డికి షేర్లు ఎందుకు ఉన్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నించారు. రూ. 9 కోట్ల విలువైన షేర్లు ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’లో ఉన్నట్లు జగన్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న విషయాన్ని పట్టాభి వెల్లడించారు. డబ్బు సంపాదించుకోవడానికైతే ఆ కంపెనీ ఓకేనా? అని ప్రశ్నించారు.
2020-02-07తాను కష్టపడి కంపెనీలను తెస్తే ప్రస్తుత సిఎం ‘పిచ్చి తుగ్లక్’ పాలనలో పారిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ‘కియా’ పరిశ్రమ తమిళనాడుకు వెళ్లిపోవచ్చనే ‘రాయిటర్స్’ కథనంపై చంద్రబాబు స్పందించారు. ‘కియా’కు ఇచ్చిన రాయితీలను ఉపసంహరిస్తామని, ఉద్యోగాలు తమ పార్టీవారికే ఇవ్వాలని, లారీ కాంట్రాక్టులూ తమకే ఇవ్వాలని వైసీపీ నేతలు ‘కియా’ యాజమాన్యాన్ని బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు.
2020-02-06‘‘జగన్మోహన్ రెడ్డికి దమ్ము-ధైర్యం ఉంటే... మండలిని కాదు, శాసనసభను రద్దు చేయాలి. 151 మందితో మళ్లీ ప్రజల తీర్పు కోరాలి’’ అని తెలుగుదేశం పార్టీ నేత కోవెలమూడి రవీంద్ర (నాని) సవాలు విసిరారు. గురువారం గుంటూరులో అమరావతి పరిరక్షణ దీక్షా శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అమరావతిని నాశనం చేశారని రవీంద్ర ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. కమ్మవారే ఉద్యమం చేస్తున్నారన్న ఆరోపణలపై ‘‘వాళ్లకు కళ్ళున్నాయా..లేదా’’ అంటూ మండిపడ్డారు.
2020-02-06