151 సీట్లు వచ్చాయనే ధీమాతో ఇష్టానుసారం వ్యవహరిస్తే అవి పోవడానికి ఎక్కువ సమయం పట్టదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. రాజధాని తరలింపునకు నిరసనగా సిపిఎం శుక్రవారం విజయవాడ ‘ధర్నా చౌక్’లో తలపెట్టిన 24 గంటల దీక్షలో మధు పాల్గొన్నారు. జర్మనీ పార్లమెంటులో నియంత హిట్లర్ కు ఓ సమయంలో 600కు పైగా సీట్లు వచ్చాయని, చివరికి ఆత్మహత్య చేసుకున్నాడని ఈ సందర్భంగా మధు చెప్పారు.

2020-02-14

ఐటీ సోదాల్లో అవినీతి బయటపడినందున మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లను అరెస్టు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు మాజీ పి.ఎస్. వద్దనే రూ. 2000 కోట్ల అవినీతికి సంబంధించిన ఆధారాలు దొరికాయని ఐటీ శాఖ ప్రకటనను ఉటంకిస్తూ చెప్పారు. కదిలింది తీగ మాత్రమేనని, డొంక కూడా కదులుతుందని అంబటి చెప్పారు. అరెస్టు చేయకపోతే చంద్రబాబు వ్యవస్థలను ‘మేనేజ్’ చేస్తారని వ్యాఖ్యానించారు.

2020-02-14

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కు సంబంధించిన ‘ప్రతిమ’, పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న ‘మెగా ఇంజనీరింగ్’, ఢిల్లీకి చెందిన షాపూర్జీ కంపెనీల్లో ఐటీ సోదాలపై మాట్లాడాలని జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాలు చేశారు. ‘‘ఆ పేర్లు ఎత్తితే మీ తోకలు కట్ అవుతాయి. హైదరాబాద్, ఢిల్లీ వెళ్తే మీ వీపులు పగులుతాయి. అందుకే అవేవీ మాట్లాడకుండా చంద్రబాబుపై బురద వేస్తారా?’’ అని శుక్రవారం మండిపడ్డారు.

2020-02-14

తనను చట్ట విరుద్ధంగా సస్పెండ్ చేశారంటూ ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఎ.బి. వెంకటేశ్వరరావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సిఎటి)ని ఆశ్రయించారు. రాజకీయ ఒత్తిళ్లతో జరిగిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయగా, అధికారికంగా గురువారమే ఏబీకి సమాచారం చేరింది. ఆయన వెంటనే ట్రిబ్యునల్ లో పిటషన్ దాఖలు చేశారు. గత మే 31 నుంచి తనకు వేతనం కూడా చెల్లించడంలేదని ఏబీ ట్రిబ్యునల్ కు నివేదించారు.

2020-02-13

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల ఇండియా పర్యటనకు సిద్ధమవుతున్న వేళ.. ఆ దేశ సెనెటర్లు నలుగురు కాశ్మీర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. సెనెటర్లు క్రిస్ వాన్ హాలెన్, టాడ్ యంగ్, రిచర్డ్ జె. డర్బిన్, లిండ్సే ఒ. గ్రహమ్ ఉమ్మడిగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపీకి బుధవారం లేఖ రాశారు. 370 అధికరణ రద్దు చేశాక మానవ హక్కుల స్థితి, ఇండియాలో మత స్వేచ్ఛపై అంచనాకు రావాలని కోరారు. అత్యంత సుదీర్ఘ కాలం ఇంటర్నెట్ ను నిలిపివేసిన ప్రజాస్వామ్య దేశం ఇండియానేనని వారు ఎత్తి చూపారు.

2020-02-13 Read More

రాజకీయ, వ్యక్తిగత, రాష్ట్ర సంబంధ అంశాల జమిలి ఎజెండాతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలన్న జగన్ విన్నపాలను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. శాసన మండలి రద్దు నిర్ణయం ప్రతిష్ఠాత్మకంగా మారింది. వీటితోపాటు రాష్ట్ర విభజన హామీలు కూడా కేంద్ర హోం శాఖకు సంబంధించినవే. ఢిల్లీలో బీజేపీ ఘోర పరాజయం తర్వాత అమిత్‌షా అపాయింట్ మెంట్ దొరికడం గమనార్హం.

2020-02-13

‘‘గెలుపు గుర్రాలకే టికెట్లు’’... ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులను ఫిల్టర్ చేయడానికి ఉపయోగించే తారక మంత్రం ఇది. ఆ విషయంపై సుప్రీంకోర్టు ఏమందంటే..‘‘నేర చరిత్ర ఉన్న అభ్యర్ధిని ఎంపిక చేయడానికి గెలువు అవకాశం ఒక్కటే కారణం కాకూడదు.. అభ్యర్ధుల ఎంపిక వారి ప్రతిభ, సాధించిన అంశాల ఆధారంగా జరగాలి. ఓ అభ్యర్ధిని ఎంపిక చేయడానికి గల కారణాలను ఆ పార్టీ ప్రచురించాలి’’. నేర చరితులపై గురువారం ఇచ్చిన తీర్పులో ఈ వ్యాఖ్యలు చేసింది.

2020-02-13

ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈ నెల 23న భారత్ బంద్ నిర్వహించాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఆజాద్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను కోర్టును గౌరవిస్తా. కానీ, కోర్టు ఈ కేసులో తప్పు చేసింది.. ప్రభుత్వం ఇవ్వకపోతే రిజర్వేషన్లు కోరలేమని కోర్టు చెప్పింది. మమ్మల్ని ప్రభుత్వ దయకు వదిలేసింది. దీన్ని అంగీకరించబోం. ఇవి మా ప్రాథమిక హక్కులు. ఎలా తీసుకోవాలో మాకు తెలుసు’’ అని ఉద్ఘాటించారు.

2020-02-12

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సమయం కేటాయించిన ప్రధాని, వివిధ అంశాలపై విన్నపాలను సావధానంగా విన్నట్లు సమాచారం. విభజన హామీల అమలు, పోలవరం పెండింగ్ నిధుల విడుదలకు విన్నవించిన జగన్.. రాష్ట్రంలో శాసన మండలి రద్దు, రాజధాని తరలింపు వంటి రాజకీయ అంశాలపైనా కేంద్రం మద్ధతు కోరినట్లు చెబుతున్నారు.

2020-02-12

సీనియర్ ఐపిఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, అందువల్ల ‘లుకవుట్’ నోటీసు జారీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మొన్న సస్పెన్షన్ కు గురైన ఎ.బి.పై సోమవారం చెవిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో ఎ.బి. వెంకటేశ్వరరావు సాటి ఐ.పి.ఎస్.లను వేధించారని, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్, భూదందాలకు పాల్పడ్డారని చెవిరెడ్డి ఆరోపించారు.

2020-02-10
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page