పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి) విషయంలో ముస్లింలకు అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. బుధవారం ఆయన ‘నవ మాసాలు-నవ మోసాలు’ నినాదంతో ప్రభుత్వంపై సమరానికి ‘ప్రజా చైతన్యయాత్ర’ చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్టూరులో తొలి సభ ప్రారంభంలోనే పర్చూరు నియోజకవర్గ ముస్లింల విన్నపంపై చంద్రబాబు స్పందించారు.
2020-02-19మాజీ సిఎం చంద్రబాబుకు, ఆయన తనయుడు..మాజీ మంత్రి నారా లోకేష్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తగ్గించిందని టీడీపీ నేతలు మంగళవారం ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణను డీజీపీ కార్యాలయం ఖండించింది. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉందని, ఎలాంటి మార్పులూ చేయలేదని మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. విజయవాడలో 135 మందితో, హైదరాబాద్ లో 48 మందితో (మొత్తం 183 మందితో) చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నట్టు తెలిపింది.
2020-02-19సెలక్ట్ కమిటీల ఏర్పాటు విషయంలో శాసన వ్యవస్థ సచివాలయ కార్యదర్శి తన ఆదేశాలను లెక్క చేయకపోవడంపై ఆగ్రహంతో ఉన్న శాసన మండలి ఛైర్మన్ ఎంఎ షరీఫ్ ఈ విషయమై గవర్నరు బిశ్వబూషణ్ హరిచందన్ తో చర్చించనున్నారు. రాజధాని తరలింపునకు ఉద్ధేశించిన రెండు బిల్లులను సెలక్ట్ కమిటీలకు పంపాలని నిర్ణయించిన షరీఫ్, కమిటీల ఏర్పాటు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కార్యదర్శిని ఆదేశించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ ఒత్తిడితోనే ఛైర్మన్ ఆదేశాలను కార్యదర్శి ధిక్కరించారనే ఆరోపణలున్నాయి.
2020-02-18మహాత్మాగాంధీ ఆదర్శాలతో ఉంటారా లేక నాథురాం గాడ్సేని సమర్ధించేవారితోనా? అన్నది బీహార్ సీఎం నితీష్ కుమార్ తేల్చి చెప్పాలని జెడి(యు) బహిష్కృత నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డిమాండ్ చేశారు. ‘‘గాంధీ, జెపి, లోహియా ఆదర్శాలను వదిలేది లేదని నితీష్ చెబుతారు. అదే సమయంలో గాడ్సే సిద్ధాంతాన్ని సమర్ధించేవారితో ఉంటారు. ఈ రెండూ కలసి సాగలేవు’’ అని ప్రశాంత్ వ్యాఖ్యానించారు. 2005లో పేద రాష్ట్రంగా ఉన్న బీహార్ ఇప్పటికీ అదే స్థితిలో కొనసాగుతోందంటూ నితీష్ అభివృద్ధి నమూనాను తప్పు పట్టారు.
2020-02-18ఈ నెల 21వ తేదీని ‘రెడ్ బుక్ డే’గా పాటిస్తున్నట్లు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు వెల్లడించారు. మార్క్స్-ఏంగెల్స్ రచించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ లక్ష కాపీలను తెలుగు ప్రజలకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. 1848లో రచించిన ఈ 50 పేజీల చిరుగ్రంథం ప్రపంచాన్ని చుట్ట చుట్టినట్లుగా పాఠకులకు పరిజ్ఞానాన్ని అందిస్తుందని, సమకాలీన భారత సమాజానికి అది చాలా అవసరమని రాఘవులు చెప్పారు. పెట్టుబడి పర్యవసానాలను అర్దం చేసుకోవడానికి ఈ గ్రంథాన్ని అందరూ చదవాలని పిలుపునిచ్చారు.
2020-02-18ప్రపంచ జనాభాలో 10 శాతం (76 కోట్ల మంది), చైనాలో సగానికి పైగా ‘కరోనా నిర్బంధం’లో ఉన్నారని ‘ఈనాడు.నెట్’ సోమవారం ప్రచురించింది. ‘కరోనా’ను కట్టడి చేయడానికి చైనా మావో తరహాలో సామాజిక నియంత్రణలను విధించిందన్న ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం దీనికి ఆధారంగా కనిపిస్తోంది. ‘కరోనా’ ప్రాంతాల పర్యవేక్షణకు చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ లక్షలాది మందిని నియమించాయని రాస్తూనే.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలంతా ‘నిర్బంధం’లో ఉన్నట్టు పొంతన లేకుండా రాశారు. ఆ వికృత కథనానికి కాపీ ‘ఈనాడు’ వార్త.
2020-02-17బ్రిటిష్ ఎంపీ డెబ్బీ అబ్రహమ్స్ (లేబర్ పార్టీ)ని దేశంలోకి అనుమతించడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. అది కూడా.. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత! డెబ్బీ కాశ్మీర్ పై ఏర్పాటైన ఓ బ్రిటిష్ పార్లమెంటరీ గ్రూపుకు నేతృత్వం వహించడమే ఇందుకు కారణం. గత ఆగస్టులో కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత, యు.కె.లోని భాతర హై కమిషనర్ కు అబ్రహమ్స్ ఓ లేఖ రాశారు. భారత ప్రభుత్వ చర్య కాశ్మీర్ ప్రజల విశ్వాసానికి ద్రోహం చేయడమేనని ఆమె పేర్కొన్నారు.
2020-02-17చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఒక్కడి దగ్గరే రూ. 2000 కోట్లు దొరికాయంటూ వైసీపీ ఊదరగొడుతుంటే.. రూ. 2.63 లక్షల నగదు, 12 తులాల బంగారమేనని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. సాక్ష్యంగా ఆదాయ పన్ను శాఖ పంచనామా నివేదికను బహిర్గతం చేసింది. శ్రీనివాస్ సహా పలువురు వ్యక్తులు, కంపెనీలకు చెందిన 40 ప్రదేశాల్లో 10 రోజుల క్రితం ఐటి సోదాలు జరిగాయి. మొత్తం రూ. 2000 కోట్ల మేరకు అనధికార లావాదేవీలు జరిగాయని ఐటి పేర్కొంది. అయితే, అంత మొత్తం ఒక్క శ్రీనివాస్ వద్దే దొరికినట్లు ప్రచారం సాగింది.
2020-02-16శాసన మండలి రద్దుకోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానంపై తదుపరి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. తనకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మండలి అంశంపై మొన్న ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించిన జగన్, శుక్రవారం అమిత్ షాకు కూడా నివేదించారు. హత్యాచారం కేసుల్లో ‘మరణ శిక్ష’ ప్రతిపాదిస్తూ శాసనసభ ఆమోదించిన ‘దిశ’ బిల్లుకు చట్ట రూపం ఇవ్వాలని జగన్ కోరారు. విభజన హామీలపై మరోసారి వినతిపత్రం సమర్పించారు.
2020-02-14రాజధాని తరలింపునకు ఉద్ధేశించిన రెండు బిల్లులపై సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలన్న శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఆదేశాలను కార్యదర్శి మరోసారి ధిక్కరించారు. కమిటీల ఏర్పాటు ప్రతిపాదన శాసన నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ఫైలును తిప్పి పంపారు. మొదటిసారి కార్యదర్శి ఫైలును తిప్పి పంపగానే అధికార పార్టీ నేతలు ఓ వాదన ముందుకు తెచ్చారు. 14 రోజుల గడువులోగా సెలక్ట్ కమిటీలు ఏర్పాటు కానందున.. బిల్లులు ఆమోదం పొందినట్టుగానే భావించాలని వారు చెబుతున్నారు.
2020-02-14