రాష్ట్రంలో శాంతిభద్రతలను పోలీసులు కాపాడకపోతే తామే రంగంలోకి దిగవలసి వస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)ని హెచ్చరించారు. చంద్రబాబు విశాఖ పర్యటనలో పోలీసుల సమక్షంలోనే వైసీపీ గూండాలు కోడిగుడ్లు, చెప్పులు, రాళ్ళు వేశారని లోకేష్ మండిపడ్డారు. అనుమతి ఇచ్చి నగరంలోకి వెళ్ళకుండా ఆపడం ఏమిటని, బాధ్యులైన పోలీసు అధికారులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.
2020-02-27ప్రతిపక్ష నేత చంద్రబాబును విశాఖ విమానాశ్రయం నుంచి వెనక్కు పంపే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. విమానాశ్రయం వెలుపల నిరసన తెలుపుతున్న చంద్రబాబును అరెస్టు చేసి వీఐపీ లాంజ్ లోకి తీసుకెళ్ళారు. ఉదయం చంద్రబాబు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఆయనను నగరంలోకి వెళ్ళకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఓ దశలో చంద్రబాబు కాన్వాయ్ దిగి రోడ్డుపైనే బైఠాయించారు. రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకోసం విశాఖ వెళ్లిన చంద్రబాబును ‘విశాఖ వ్యతిరేకి’ పేరిట వైసీపీ అడ్డుకుంది.
2020-02-27విశాఖ పర్యటనకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబును, ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన స్థానిక తెలుగుదేశం నేతలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడంతో విమానాశ్రయ ప్రాంతం రణరంగంగా మారింది. విమానం దిగి బయటకు వచ్చే సమయంలో చంద్రబాబు కాన్వాయ్ ఎదుట కొంతమంది పడుకున్నారు. మరికొంతమంది వాహన శ్రేణిపై కోడిగుడ్లు విసిరారు. గంటల తరబడి రోడ్లు బ్లాక్ చేయడంతో సాధారణ ప్రయాణీకులు, ప్రజలు కూడా ఇబ్బందులపాలయ్యారు.
2020-02-27ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు వివాదంపై మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. ఈసారి ఏకంగా ఇండియా రాజధానిలోనే ఈ విషయం చెప్పడం విశేషం. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశంలో ఈ అంశంపై ‘చాలా’ చర్చించానని కూడా ట్రంప్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘‘ఇద్దరు పెద్ద మనుషుల (మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్)తో నాకు మంచి సంబంధాలు ఉన్నందున... నేను చేయగలిగింది చేస్తానని చెప్పాను (మోడీతో)’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
2020-02-25 Read Moreఢిల్లీ అల్లర్లకు కారకులైన వారు తమ పార్టీవారైనా చర్యలు తీసుకోవాలని బిజెపి ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశారు. బిజెపి నేత కపిల్ మిశ్రా ఆదివారం రెచ్చగొట్టే ప్రసంగం చేశాక అల్లర్లు ప్రారంభమైన నేపథ్యంలో గంభీర్ స్పందించారు. ‘‘ఎవరైనా... అతను ఏ పార్టీవాడైనా... అతను కపిల్ మిశ్రా కావచ్చు. మరెవరైనా కావచ్చు. అతను ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని గంభీర్ కోరారు. మొన్న (ఫిబ్రవరి 23న) మొదలైన అల్లర్లు మంగళవారం నాటికి తీవ్రమయ్యాయి. 8 మంది మరణించారు.
2020-02-25తాను బాధ్యతలు స్వీకరించాక ఇండియాకు ఇంథన ఎగుమతులు 500 శాతం పెరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండో రోజు పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన పర్యటనలో ప్రధానంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించినట్టు ట్రంప్ వెల్లడించారు. 3 బిలియన్ డాలర్ల (రూ. 23 వేల కోట్ల) విలువైన అపాచీ, రోమియా హెలికాప్టర్ల అమ్మకానికి ఒప్పందాన్ని ముగించామని.. 5జి వైర్ లెస్ నెట్వర్క్, క్వాడ్ మెకానిజంపై చర్చించామని ట్రంప్ చెప్పారు.
2020-02-25ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి పౌరులను కాపాడుకోవడానికి అమెరికా, ఇండియా ఐక్యమయ్యాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అహ్మాదాబాద్ మోతెరా స్టేడియంలో ప్రసంగించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అధినేత అల్ బాగ్దాదిని అమెరికా చంపిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. తన హయాంలో అమెరికా సైన్యం పూర్తి స్థాయిలో శక్తిమంతంగా తయారైందని ట్రంప్ చెప్పుకొచ్చారు.
2020-02-24అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశాధ్యక్షుడు ద్విముఖ వ్యూహంతో రెండు రోజుల భారత పర్యటనకు వస్తున్నారు. అమెరికాలో ఉన్న 45 లక్షల భారతీయులలో సానుకూలత సాధించడం, అదే సమయంలో ఇండియా నుంచి పొందే హామీలతో అమెరికన్ కంపెనీలు- ఉద్యోగాలకు భరోసా ఇవ్వడం ట్రంప్ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. 24, 25 తేదీల పర్యటనకోసం ఆదివారం రాత్రి ట్రంప్ ఎయిర్ ఫోర్స్1లో భార్య మెలనియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్ లతో కలసి బయలుదేరారు.
2020-02-23గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకోసం అంటూ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’పై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. ‘‘జీవో 344 వైసీపీ వేధింపులకు పరాకాష్ఠ. గత ఐదేళ్ల నిర్ణయాలపై మీరు‘సిట్’ వేశారు. మీ ఐదేళ్ళ పాలనపై వచ్చే ప్రభుత్వం ‘సిట్’ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏంటి’’ అని ఆయన ప్రశ్నించారు. 8 నెలల క్రితం మంత్రివర్గ ఉపసంఘం వేసి.. పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారని మండిపడ్డారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపే వైసీపీ ఎజెండా అని విమర్శించారు.
2020-02-22కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా బీజేపీ ప్రభుత్వం వేధించడం వల్లనే తమ పార్టీ ఎంపీ, బెంగాలీ నటుడు తపస్ పాల్ గుండెపోటుకు గురయ్యారని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తపస్ పాల్ మంగళవారం ముంబై ఆసుపత్రిలో మరణించారు. ఇంతకు ముందు మాజీ ఎంపీ సుల్తాన్ అహ్మద్, ఎంపీ ప్రసూన్ బెనర్జీలను కూడా కేంద్రమే బలి తీసుకుందని మమత ధ్వజమెత్తారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసులో సీబీఐ తపస్ పాల్ ను 2016లో అరెస్టు చేసింది.
2020-02-19 Read More