సొంత నియోజకవర్గాల్లో స్థానిక సంస్థలను కోల్పోతే మంత్రి పదవులకు రాజీనామా చేయవలసి ఉంటుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహచర మంత్రులను హెచ్చరించారు. ఎమ్మెల్యేలైతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఉండకపోవచ్చని కూడా వ్యాఖ్యానించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. అధికారులు నిష్క్రమించిన తర్వాత రాజకీయ చర్చ జరిగింది. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను ఆ జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు తీసుకోవాలని జగన్ స్పష్టం చేశారు.

2020-03-04

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని వ్యతిరేకిస్తున్నవారిని దేశద్రోహులుగా చిత్రిస్తూ కాల్చి చంపాలని ఓవైపు బీజేపీ నేతలు ర్యాలీలు చేస్తుంటే.. ఆ పార్టీ పాలనలో ఉన్న మహారాష్ట్ర మున్సిపాలిటీ ఒకటి సిఎఎ, ఎన్.ఆర్.సి.లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. పర్బని జిల్లాలోని సేలు మున్సిపాలిటీలో ఫిబ్రవరి 28న కౌన్సిల్ సమావేశం జరిగింది. సిఎఎ-ఎన్.ఆర్.సి. వ్యతిరేక తీర్మానానికి మెజారిటీ మద్ధతు ఇవ్వగా.. ఎవరూ వ్యతిరేకించలేదు. ఇంతకు ముందే బిజెపి భాగస్వామిగా ఉన్న బీహార్ ప్రభుత్వం ఎన్.ఆర్.సి. వ్యతిరేక తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన సంగతి తెలిసిందే.

2020-03-02 Read More

తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన యువ నాయకులు ఆదివారం కుటుంబ సమేతంగా హైదరాబాద్ నగరంలో సమావేశమయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో ఎక్కువ మంది సీనియర్ నాయకుల రాజకీయ వారసులే కనిపించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు అఖిలప్రియ, కిడారి శ్రవణ్ కుమార్, ఇతర నేతలు పరిటాల శ్రీరామ్, కరణం వెంకటేశ్, టీజీ భరత్, బొజ్జల సుధీర్ రెడ్డి, లోకేష్ మిత్రుడు కిలారి రాజేశ్ విందుకు హాజరైనవారిలో ఉన్నారు. వారికి చంద్రబాబు రాజకీయ బోధ చేశారు.

2020-03-02

సామాజిక పింఛన్లపై పత్రికల్లో ఆదివారం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పు పట్టారు. 2019 జనవరి నుంచి జూన్ వరకు తమ ప్రభుత్వం రూ. 2000 పెన్షన్ ఇస్తే... జగన్ అసత్యాలు చెబుతున్నారని సామాజిక మాథ్యమాల్లో విమర్శించారు. ‘‘మీ నాయన కేవలం రూ. 200 ఇస్తే మా నాయన 2014లో వెయ్యి రూపాయలు, 2019లో రెండు వేలు చేశారు’’ అని లోకేష్ పేర్కొన్నారు. రూ. 3 వేలు ఇస్తామని మోసం చేసిన జగన్ రూ. 250 మాత్రమే పెంచారని విమర్శించారు.

2020-03-02

మాజీ సిఎం రాజశేఖరరెడ్డిని అంబానీ చంపించారనే ఆరోపణలతో ప్రస్తుత సిఎం జగన్ మనుషులు రాష్ట్రంలో రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేశారని, ఇప్పుడు ఆ అంబానీకి సత్కారం చేయడం ఏమిటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. టీడీపీ, బిజెపి, కాంగ్రెస్ నేతలు పలువురు ఆదివారం ఈ అంశంపై మాట్లాడారు. జగన్ ఆరోపణలతో రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేసి అనేక మంది జైలు పాలయ్యారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించగా.. ఆనాటి ఆరోపణలు అబద్ధమైతే చెప్పాలని బిజెపి నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు డిమాండ్ చేశారు.

2020-03-02

ఆప్ఘనిస్తాన్ నుంచి తన సేనలను పూర్తిగా విరమించుకునేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం శనివారం తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి ఇండియా ప్రతినిధి కూడా హాజరయ్యారు. ఇది జరిగిన కొద్ది గంటల తర్వాాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఏదైనా అనుకోనిది జరిగితే తిరిగి ఫుల్ ఫోర్సుతో వస్తాం’’ అని ట్రంప్ హెచ్చరించారు. తాను అతి త్వరలోనే తాలిబన్ నేతలను కలుస్తానని ఆయన ప్రకటించారు.

2020-03-01

ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ మరణం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్ ను ఆమ్ ఆద్మీ పార్టీ సస్పెండ్ చేసింది. గురువారం తాహిర్ పైన హత్య కేసు నమోదైన నేపథ్యంలో ‘ఆప్’ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. రాళ్ళు, ఫైర్ బాంబులు విసిరిన గుంపులో తాను ఉన్నట్టు తాహిర్ అంగీకరించారు. అయితే, తాను దాడి చేయలేదని, తానే ప్రత్యర్ధి గుంపు లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

2020-02-27 Read More

ఏపీ విభజన చట్టంలో కొన్ని అంశాలను అనాలోచితంగా చొప్పించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పర్యవసానాలను ఆలోచించకుండా అసెంబ్లీ సీట్ల పెంపు వంటి హామీలు ఇచ్చారని గత యుపిఎ ప్రభుత్వాన్ని విమర్శించారు. కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విలేకరులు ప్రస్తావించినప్పుడు...దేశవ్యాప్తంగా చేపట్టకుండా కేవలం ఒకటి రెండు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే, ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు.

2020-02-28

అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల మధ్య ‘శాంతి ఒప్పందం’పై సంతకాల కార్యక్రమానికి భారత ప్రతినిధి హాజరు కాబోతున్నారు. శనివారం దోహాలో జరిగే కార్యక్రమంలో ఖతార్ లోని భారత రాయబారి పి. కుమారన్ పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. 2001లో ఆప్ఘనిస్తాన్లో యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి 2,400 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్లకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఇండియా పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది.

2020-02-28 Read More

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ‘హేట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణించారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్. త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన పార్టీ గిరిజన విభాగం 22వ మహాసభలలో ఆమె మాట్లాడారు. ‘‘షహీన్ బాగ్ కు విద్యుత్ షాక్ తగిలేలా ఇవిఎంలపై బటన్లను గట్టిగా నొక్కాలని ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అమిత్ షా పిలుపు ఇచ్చారు. ఒక హోం మంత్రి ఆ విధంగా ప్రసంగిస్తారా? అందుకే అంటున్నా.. అతను హోం మంత్రి కాదు. హేట్ మంత్రి’’ అని కారత్ పేర్కొన్నారు.

2020-02-22
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page