శాసన మండలి రద్దయితే మంత్రి పదవులు కోల్పోయే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ లకు ముందస్తు బహుమతి ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ ఇద్దరినీ రాజ్యసభ అభ్యర్ధులుగా ఎంపిక చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వారిద్దరూ ఓడిపోగా ఎమ్మెల్సీలను చేసి మంత్రి పదవులు ఇచ్చారు. రాజధాని బిల్లులను ఆపినందుకు మండలిపై మండిపడ్డ జగన్, ఆ సభ రద్దుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయించిన సంగతి తెలిసిందే. వైసీపీ తరపున పారిశ్రామికవేత్తలు అయోధ్యరామిరెడ్డి, పరిమల్ నత్వానిలను కూడా రాజ్యసభ అభ్యర్దులుగా ఎంపిక చేశారు.

2020-03-09

మహా సంపన్నుడు ముఖేష్ అంబానీ సిఫారసులకు తిరుగులేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. అంబానీ సన్నిహిత పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేశారు. కొద్ది రోజుల క్రితం నత్వానితో కలసి అంబానీ రాష్ట్రానికి వచ్చి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ వేశారు. బీజేపీ సూచనతో జరిగిన ఈ భేటీకి రాజకీయ, ఆర్థిక కోణాల్లో ప్రాధాన్యత ఉంది. రాజశేఖరరెడ్డి మరణంలో సోనియాగాంధీ, అంబానీ పాత్ర ఉందంటూ జగన్ అనుయాయులు ఆరోపణలు చేశారు.

2020-03-09

తలసరి విద్యుత్ వినియోగంలో (1890 యూనిట్లతో) తెలంగాణ దేశంలోనే నెంబర్1 అని రాష్ట్ర సీఎం కేసీఆర్ శనివారం అసెంబ్లీలో పదే పదే చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఊరూరా ప్రతి సభలోనూ ‘నెంబర్ 1’ కథ ప్రతిధ్వనించింది. పై గ్రాఫు చూస్తే ఇందులో నిజమెంతో తెలిసిపోతుంది. ఇప్పటి తెలంగాణ వినియోగం కంటే.. 2016-17లో గోవా, గుజరాత్, పంజాబ్, చత్తీస్ గఢ్, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో తలసరి వినియోగం ఎక్కువ. 2018-19లోనూ గుజరాత్, గోవా, హర్యానా, పంజాబ్, చత్తీస్ గఢ్ ముందున్నాయి. ఏడాదిన్నరగా కేసీఆర్ కరెంటు కథను కౌంటర్ చేసినవారే లేరు.

2020-03-08

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25కు పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారు. తెలంగాణలో 10 జిల్లాలను 33 చేసిన తర్వాత కలిగిన ప్రయోజనాలను చూసి ఏపీలో కూడా జిల్లాల పెంపునకు నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో త్వరలో 25 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.

2020-03-07

తిరుగుబాటు ఆరోపణలతో సౌదీ రాజ కుటుంబంలోని ఇద్దరు ప్రముఖులను యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అరెస్టు చేయించారు. నిర్బంధానికి గురైనవారిలో సౌదీ రాజు సాల్మన్ చిన్న తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ (యువరాజుకు బాబాయి), రాజు మరో సోదరుడి కుమారుడు మహ్మద్ బిన్ నయేఫ్ (యువరాజు కజిన్) ఉన్నారు. 2017లో నయేఫ్ స్థానంలోనే బిన్ సల్మాన్ యువరాజుగా బాధ్యతలు స్వీకరించారు. రాజు కుమారుడైన బిన్ సల్మాన్ గత మూడేళ్లలో అధికారంపై పట్టు సంపాదించారు. గతంలో అవినీతి ఆరోపణలతో కొందరు రాజకుటుంబీకులను నిర్బంధించారు.

2020-03-07

‘‘ఎస్. బ్యాంకు విఫలమైతే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. తప్పు లేదు. కస్టమర్లు నష్టపోకూడదు. మరి అదే విధానం అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఎందుకు వర్తించడంలేదు? కేంద్రం ఎందుకు స్పందించడంలేదు’’ అని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య ప్రశ్నించారు. రాజధానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు నష్టపోయే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని బుచ్చయ్య విమర్శించారు. ‘‘బ్యాంకులు చేసిన తప్పుకు పరిహారం చెల్లిస్తున్న కేంద్రం.. ఏపీ ప్రభుత్వం తప్పు విషయంలో పెద్దన్న పాత్ర పోషించదా?’’ అని నిలదీశారు.

2020-03-07

ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికలకోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పోస్టులకు గాను 6 బి.సి, ఎస్.సి, ఎస్.టి.లకు రిజర్వు అయ్యాయి. పశ్చిమ గోదావరి (బిసి), అనంతపురం (బిసి మహిళ), శ్రీకాకుళం (బిసి మహిళ), తూర్పు గోదావరి (ఎస్.సి), గుంటూరు (ఎస్.సి. మహిళ), విశాఖపట్నం (ఎస్.టి. మహిళ) రిజర్వు అయ్యాయి. జనరల్ సీట్లలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు మహిళలకు కేటాయించారు. మొత్తంగా 7 జడ్పీ పీఠాలు మహిళలకు దక్కాయి. కడప, చిత్తూరు, కర్నూలు, విజయనగరంలలో ఏ రిజర్వేషనూ లేదు. వాటిలో మూడు రాయలసీమవే కావడం గమనార్హం.

2020-03-06

నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భారత ప్రజాస్వామ్య విలువలనుంచి ఆందోళనకరంగా వైదొలగుతోందని ‘‘ఫ్రీడం ఇన్ ద వరల్డ్ 2020’’ నివేదిక విమర్శించింది. ఫ్రీడం హౌస్ సంస్థ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఇండియాకు తిమోర్ లెస్తె, సెనెగల్ వంటి దేశాలతో సమానంగా 83వ ర్యాంకు ఇచ్చింది. స్వేచ్ఛాయుత దేశాల్లో ఇదే చివరి ర్యాంకు. ఇండియా స్కోరు 4 పాయింట్లు తగ్గి 71కి చేరింది. 25 పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఇదే గరిష్ఠ పతనం. ట్యునీషియా మాత్రమే అంతకంటే తక్కువ స్కోరును నమోదు చేసింది.

2020-03-05 Read More

ప్రభుత్వ భవనాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు చీవాట్లు పెట్టినా ధోరణి మారలేదు. ఉగాది రోజున పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ళ పట్టాలకూ వైసీపీ వర్ణాలు అద్దింది ప్రభుత్వం. బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశంలో ఈ పత్రాన్ని అందరికీ చూపించారు. 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలకోసం 43,141 ఎకరాల భూమిని సిద్ధం చేశామని, అందులో 26,976 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, యుద్ధ ప్రాతిపదికన మార్కింగ్ చేసి లబ్దిదారులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

2020-03-04

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పథకానికీ సొంత పేర్లు పెట్టుకోవడం పాలకులకు పరిపాటిగా మారింది. చంద్రబాబుతో పోలిస్తే యువకుడైన సిఎం జగన్ ఇప్పటికే ఆరు పథకాలకు తన పేరు పెట్టుకున్నారు. తాజాగా పేదల ఇళ్ళ నిర్మాణ పథకానికీ తన పేరు, తండ్రి పేరు కలిపి పెట్టాలని నిర్ణయించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహచరులంతా దీనికి ‘మమ’ అన్నారు. ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆయా కాలనీలకు ‘‘వైఎస్ఆర్ జగనన్న కాలనీలు’’గా నామకరణం చేయనున్నట్టు ప్రకటించింది.

2020-03-04 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page