రాష్ట్రంలో అరాచకంపై పోలీసులు, పాలనాధికార యంత్రాంగంతో పాటు గవర్నరు కూడా చేతులెత్తేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి కోర్టులే దిక్కని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలపై గవర్నరుకు రెండు- మూడు సార్లు ఫిర్యాదు చేశామని, ఆయన నుంచి ఏ స్పందనా లేదని యనమల శుక్రవారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. లా అండర్ ఆర్డర్ సిఎం చేతుల్లో ఉందని, పోలీసు వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఫాసిస్టులా పాలిస్తున్నారని దుయ్యబట్టారు.
2020-03-13స్థానిక ఎన్నికల్లో హింస జగన్ మనస్తత్వాన్ని బయటపెట్టిందని బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవధర్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విజయవాడలో జనసేన, బిజెపి ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది ఎన్నికల కాదని.. ఎంపికలు మాత్రమేనని దేవధర్ విమర్శించారు. అయితే, ఈ అంశంపై విమర్శలు చేసే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని, వాళ్ళు స్థానిక సంస్థలకు ఎన్నికలే జరపలేదని పేర్కొన్నారు.
2020-03-12‘‘రాష్ట్ర నాయకులను పంపితే.. ఎందుకు వెళ్లారని బుద్ధి ఉన్నవాడెవడైనా అడుగుతాడా? ఈ లెక్కన జగన్ కూడా పులివెందులలో ఉండాలి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బొండా ఉమ, బుద్ధా వెంకన్న మాచర్ల ఎందుకు వెళ్లారన్న వైసీపీ నేతలపైన, గురువారం రాజ్ భవన్ వద్ద ఈ ప్రశ్న అడిగిన విలేకరిపైనా చంద్రబాబు విరుచుకుపడ్డారు. జరిగిన ఘటనలపైన నిజ నిర్ధారణకోసం అన్ని జిల్లాలకూ నాయకులను పంపుతామని స్పష్టం చేశారు. దాడులపై మాట్లాడుతూ ‘‘రాజశేఖరరెడ్డిని చూశా. ఇంకా చాలామంది రౌడీలను చూశా’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
2020-03-12టి.ఆర్.ఎస్. రాజ్యసభ అభ్యర్ధులుగా సిటింగ్ సభ్యుడు కె. కేశవరావు, మాజీ స్పీకర్ (ఉమ్మడి ఏపీ అసెంబ్లీ) కె.ఆర్. సురేష్ రెడ్డి పేర్లను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లూ.. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం టి.ఆర్.ఎస్.కే దక్కుతాయి. కేకే, కేఆర్ శుక్రవారం నామినేషన్లను దాఖలు చేయనున్నారు. తమ పేర్లను ప్రకటించినందుకు వారిద్దరూ ముఖ్యమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
2020-03-12స్థానిక ఎన్నికల్లో ఫ్యాక్షనిజం కనిపించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఫ్యాక్షనిస్టులు వేరేవాళ్ళను టెండర్లు వేయనీయకుండా పేపర్లను లాక్కున్నట్టే.. ఎన్నికల్లో తాము ఒక్కరే ఉండాలని ఇతరుల నామినేషన్ పత్రాలను చించేశారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలసి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. పొగరుబోతు ఎద్దుకు ముకుతాడు వేసినట్టే ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని కన్నా ప్రజలకు విన్నవించారు.
2020-03-12తాను తమిళనాడు సిఎం కావాలనుకోవడం లేదని, పార్టీ అధ్యక్షుడిగానే ఉంటానని సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రకటించారు. గురువారం చెన్నైలో రజినీ మక్కల్ మంద్రం (ఆర్ఎంఎం) కార్యకర్తలు, విలేకరులను ఉద్ధేశించి రజినీకాంత్ మాట్లాడారు. విద్యావంతుడు, దూరదృష్టిగల ఓ యువకుడు ముఖ్యమంత్రి అవుతాడని రజినీ చెప్పారు. సిఎం పరిపాలిస్తే పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారని, తప్పు జరిగితే తొలుత ప్రశ్నించేది తామేనని చెప్పుకొచ్చారు. అయితే, పార్టీ ఎప్పుడు ప్రారంభించేదీ రజినీ ఈసారి కూడా వెల్లడించలేదు.
2020-03-12కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియాకు మోడీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. సింధియా యూపీఎ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆయనను బిజెపి తరపున రాజ్యసభకు ఎంపిక చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన సింధియా గ్రూపు నేతల్లో ఒకరికి... మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వవచ్చని సమాచారం. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో కమలనాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి సిద్ధమవుతోంది.
2020-03-10కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలసిన తర్వాత సింధియా తన రాజీనామా లేఖను (నిన్నటి తేదీతో) ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆయనకు మద్ధతుగా నిన్ననే బెంగళూరు క్యాంపులోకి చేరిన 19 మంది ఎమ్మెల్యేలు మంగళవారం తమ రాజీనామా లేఖలను గవర్నరుకు పంపించారు. కమలనాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింధియా బీజేపీతో కలసినట్టు ఈ పరిణామాలతో స్పష్టమైంది. గత ఏడాది ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్ సిఎం అవుతాననుకున్న సింధియా ఆశలకు కమలనాథ్ గండికొట్టారు.
2020-03-10 Read Moreకడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఇంత కాలం వైఎస్ కుటుంబానికి ప్రత్యర్ధిగా ఉన్న సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసిన ఓడిపోయిన సతీష్ రెడ్డి, ఇప్పుడు వైసీపీ గూటికే చేరబోతున్నారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లపై పోటీ చేసినందుకు సతీష్ రెడ్డికి టీడీపీ ఎం.ఎల్.సి. సీటుతో పాటు వైస్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. అయితే, తనకు సరైన ఆదరణ లభించలేదని సతీష్ రెడ్డి మంగళవారం తన అనుచరుల వద్ద వాపోయారు.
2020-03-10అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడుతుంటే మీ కళ్లు కనిపించడంలేదా? అని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఇసి)ని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఆయన అనుచరులు ఇతరులను నామినేషన్లు వేయవద్దంటూ బెదిరించారని, చంద్రబాబు సోమవారం ఓ వీడియోను ప్రదర్శించారు. ‘మంత్రికి సిగ్గుందా’ అని ప్రశ్నించారు. 90 శాతం స్థానాలు రాకపోతే మంత్రి పదవి ఉండదని సిఎం జగన్ బెదిరించడంతో అడ్డగోలుగా అక్రమాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
2020-03-09