ఢిల్లీలో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో జరిగిన ఎన్నికల సభలో పవన్ ప్రధాని నరేంద్ర మోదీతో కలసి పాల్గొన్నారు. తన ప్రసంగంలో మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ దేశ ప్రయోజనాల కోసమే పని చేస్తారంటూ, ‘‘ఎన్నికల ప్రయోజనాల కోసమే అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసేవారు కాదు, ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసేవారు కాదు. ఎన్నికల ప్రయోజనాల కోసమే అయితే రామమందిరం నిర్మించేవారు కాదు, పెద్ద నోట్లను రద్దు చేసేవారు కాదు’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ప్రంపంచ దేశాలు మెచ్చేలా మోదీ విదేశాంగ విధానం ఉందని కీర్తించారు.
2023-11-07ప్రజల తరఫున పోరాడుతున్న అందరిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులపై 60 వేలకు పైగా కేసులు బనాయించారని పేర్కొంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం రాజ్ భవన్ లో గవర్నరును కలిసింది. రాష్ట్రంలో ప్రజలపై కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో గవర్నరుకు వివరించామని లోకేష్ విలేకరులకు తెలిపారు.
2023-11-07ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నవంబర్ 2న అరెస్టు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రిమాండులో ఉండగా, దానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు ఇ.డి. సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న ఆయన హాజరైనప్పుడు అరెస్టు చేస్తారని, తమ పార్టీలోని పెద్ద నాయకులు అందరినీ జైలులో పెట్టి "ఆప్"ను అంతమొందించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఢిల్లీ మంత్రి ఆతిషి ఆరోపించారు.
2023-10-31ఇవే తనకు చివరి ఎన్నికలన్న చంద్రబాబు మాటల్లో ఓటమి భయం, నిస్పృహ కనిపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడూ సెల్ టవర్లు ఎక్కి దూకేస్తామని బెదిరించే వారిలాగే ఇప్పుడు ‘అధికార భగ్నప్రేమికుడు’ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ‘ఇదేం ఖర్మరా బాబూ’ అనుకుంటున్నారని జగన్ సోమవారం నరసాపురం సభలో వ్యాఖ్యానించారు.
2022-11-21జి20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా వెళ్ళనున్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇండోనేషియాలో ఉండే ప్రధాని, జి20 సదస్సులో భాగంగా జరిగే సమావేశాల్లో పాల్గొనడంతోపాటు పలు ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. ఇండోనేషియాలోని భారత సంతతితో కూడా ఆయన సమావేశమవుతారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి గురువారం చెప్పారు.
2022-11-10ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన ప్రకారం... దేశంలోని 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి 100 సంవత్సరాలు పడుతుందని ఢిల్లీ సిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దేశంలోని 14,500 పాఠశాలలను ఆధునీకరించనున్నట్టు ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. ప్రతీ విద్యార్థీ అగ్రశ్రేణి విద్యను ఉచితంగా పొందనిదే దేశం పురోగమించదని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు.
2022-09-06ప్రధాన మంత్రి కావాలనే ఆకాంక్ష గానీ ఆశయం గానీ తనకు లేవని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత నితీష్ మొదటిసారిగా రాహుల్ గాంధీని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ... ప్రధాని పదవి ఆకాంక్షపై ఊహాగానాలకు తెర దించారు.
2022-09-05వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉద్ఘాటించారు. తాను కాదంటే తప్ప ఎమ్మెల్యే సీటుకు ఎవరూ రారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటుకు వేరేవారు వస్తారని, తాను ఎంపీ సీటుకు పోటీ చేస్తానని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ నేతలకు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విన్నవించారు. ‘‘నా ఇష్టం తప్ప.. ఈ పార్టీలో నన్ను బలవంతంగా పంపిచేవాళ్లు లేరు’’ అని పుల్లారావు వ్యాఖ్యానించారు.
2022-01-01ఆంధ్రప్రదేశ్ మందు బాబులకు బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రంలో కోటి మంది మందు తాగుతున్నారని, వారంతా వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేసి గెలిపిస్తే చీప్ లిక్కర్ ను రూ. 70కే సరఫరా చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హామీ ఇచ్చారు. అంతే కాదు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే రూ. 50కే ఇస్తామని కూడా ఆయన ఉద్ఘాటించారు. జగన్ ప్రభుత్వంపై ‘ప్రజా ఆగ్రహ సభ’ పేరిట విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వీర్రాజు ఈ హామీ ఇచ్చారు.
2021-12-28జనవరి 6న యుఎఇ వెళ్ళాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని విదేశీ పర్యటన వాయిదా పడింది. ఇండియాలో రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యుఎఇలో సోమవారం 1,732 కేసులు నమోదయ్యాయి. అరబ్ ఎమిరేట్స్ లో భాగమైన అబుదాబి.. దేశంలోకి ప్రవేశంపై ఆంక్షలు విధించింది.
2021-12-29