‘లాక్ డౌన్’ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులనుంచి రైల్వే శాఖ ఛార్జీలు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా తప్పు పట్టారు. వలస కార్మికుల ప్రయాణ ఛార్జీలను కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుందని సోమవారం ప్రకటించారు. విదేశాల్లో చిక్కుకున్నవారికి ఉచిత విమానయానం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వానికి గుర్తుకొచ్చిన బాధ్యత, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల విషయంలో ఎందుకు లేదని సోనియా ప్రశ్నించారు. రైల్వే శాఖ ‘పిఎం కేర్స్’ నిధికి రూ. 150 కోట్లు ఇచ్చిందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో ఒక్క ఈవెంట్ కు రూ. 100 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు.
2020-05-04ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ)కు నిధులను నిలిపివేస్తున్నట్టు అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన నేపథ్యంలో.. చైనా అదనపు గ్రాంటును మంజూరు చేసింది. ఇంతకు ముందు కేటాయించిన గ్రాంటుకు అదనంగా 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 230 కోట్లు) తాజాగా ప్రకటించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ గురువారం విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఇంతకు ముందు చైనా 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 154 కోట్లు) సమకూర్చింది.
2020-04-23ప్రభుత్వాలను కూల్చి కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అన్న రాజకీయ ప్రక్రియ ‘కరోనా’ కాలంలోనూ ఆగలేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కమలనాథ్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్, గత నెలరోజులుగా ‘ఏక వ్యక్తి ప్రభుత్వం’ నడుపుతున్నారు. మంగళవారమే ఐదుగురితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఇద్దరు కమలనాథ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ రెబల్స్. మార్చిలో కమలనాథ్ ప్రభుత్వం నుంచి తప్పుకొన్న తుల్సీ సిలావత్, గోవింద్ సింగ్ రాజ్ పుత్ ఈ మధ్యాహ్నం సివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
2020-04-21అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదృశ్య శత్రువు నుంచి దాడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. అమెరికా పౌరుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వలసల నిలిపివేతపై ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల కానుంది. ‘కరోనా’ వైరస్ ప్రపంచమంతా విస్తరించి అమెరికాను గడగడలాడిస్తోంది. ఇప్పటిదాకా 24,78,948 మందికి వైరస్ సోకగా 1,70,399 మంది మరణించారు. అమెరికాలో 7,87,901 మందికి సోకితే 42,364 మంది చనిపోయారు. అమెరికా ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది.
2020-04-21తాను చంద్రబాబుకు అమ్ముడుపోయానని వ్యాఖ్యానించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని, పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. కొరియా నుంచి చత్తీస్ గఢ్ రూ. 337కే కొన్న ‘కరోనా’ టెస్టు కిట్లను ఏపీ రూ. 730కి కొనడాన్ని తాను ప్రశ్నిస్తే.. విజయసాయిరెడ్డి అధికార మదంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 16 నెలలు జైలుకెళ్లి వచ్చి బెయిలుపై ఉన్న విజయసాయిరెడ్డి తనపై మాట్లాడటం ఆకాశం పైన ఉమ్మి వేయడమేనని కన్నా వ్యాఖ్యానించారు.
2020-04-20ఆంధ్రాలో ప్రభుత్వ పథకాలకు సొంత పేర్లు, భవనాలకు పార్టీల రంగులు సర్వసాధారణం. అమెరికాలో కూడానా?! ‘కరోనా’ పరిహారం చెక్కులపై ట్రంప్ పేరు ముద్రించాలని అధికార యంత్రాంగానికి మంగళవారం ఆదేశాలు అందాయి. ఈ కారణంతోనే.. లక్షల మంది ప్రజలకు చెక్కుల పంపిణీ ఆలస్యం కానుంది. అమెరికాలో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) పంపిణీ కార్యక్రమంలో అధ్యక్షుడి పేరు పెట్టడం ఇదే మొదటిసారి కానుంది. చెక్కులపై సాధారణంగా అధికారులే సంతకాలు పెడుతుంటారు. ఈసారి తానే సంతకం చేయాలని ట్రంప్ ఉత్సాహపడ్డారు.
2020-04-15ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ)కు నిధులను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ‘విఫల’మైందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘కరోనా’ ప్రభావంపై సమాచారాన్ని చైనా కప్పిపుచ్చిందని, దానికి డబ్ల్యుహెచ్ఒ సహకరించిందని గత కొద్ది రోజులుగా ట్రంప్ ఆరోపిస్తున్నారు. ‘‘అక్కడేం జరుగుతోందో ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని ట్రంప్ మంగళవారం (అమెరికా కాలమానం) విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. డబ్ల్యుహెచ్ఒ నిర్వహించిన పాత్రపై అమెరికా సమీక్షించనున్నట్టు చెబుతున్నారు.
2020-04-15అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా ఖరారైన జో బైడెన్ కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్ధతు ప్రకటించారు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన స్నేహితుడికి మద్ధతు తెలిపినందుకు గర్వంగా ఉందని ఒబామా మంగళవారం ఒక వీడియో సందేశంలో చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వంకోసం పోటీ పడిన బెర్నీ శాండర్స్ తప్పుకోవడంతో జో బైడెన్ పేరు ఖరారైంది. శాండర్స్ తప్పుకోవడంలోనూ ఒబామా కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వచ్చాయి.
2020-04-14దేశంలో ‘కరోనా’ వైరస్ సృష్టించిన ప్రస్తుత పరిస్థితి ‘జాతీయ ఎమర్జెన్సీ’ వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మరిన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన సంకేతాలిచ్చారు. 21 రోజుల ‘లాక్ డౌన్’ వచ్చే వారం (14న) ముగుస్తున్నందున.. మోడీ బుధవారం వివిధ పార్లమెంటరీ పార్టీల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాను ముఖ్యమంత్రులతో మాట్లాడుతూనే ఉన్నానని, వారితో పాటు జిల్లా కలెక్టర్లలోనూ ‘లాక్ డౌన్’ ఒక్కసారిగా ఎత్తివేయవద్దనే విషయంలో ఏకాభిప్రాయం ఉందని మోడీ చెప్పారు. ఆంతరంగిక సమావేశంలో ప్రధాని మాట్లాడిన అంశాల ఆడియో క్లిప్ ను ఆయన కార్యాలయమే లీక్ చేసింది.
2020-04-08‘కరోనా’పై పోరాటంకోసం ప్రపంచం మొత్తం నుంచి వ్యక్తిగత రక్షణ పరికరాలు, మందులను దిగుమతి చేసుకుంటున్న అమెరికాకు.. వియత్నాం నుంచి 4,50,000 సూట్లు దిగుమతి అయ్యాయి. బుధవారం ఉదయం (అమెరికా కాలమానం) డాలస్ విమానాశ్రయంలో ఈ మొత్తం దిగినట్టు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. అయితే, క్రెడిట్ మొత్తాన్ని తమ కంపెనీలకే ఇచ్చుకున్నారు ట్రంప్. రెండు ‘గ్రేట్ అమెరికన్ కంపెనీలు’ డ్యూపాంట్, ఫెడ్ ఎక్స్, వియత్నాంలోని మిత్రుల భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందన్న ట్రంప్.. థ్యాంక్స్ మాత్రం తమ కంపెనీలకే చెప్పారు.
2020-04-09