అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి లను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. తమ వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారనే కారణంతో జెసిపై కేసు నమోదైంది. 154 లారీలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారని, బి.ఎస్-3 వాహనాలను బి.ఎస్-4 కింద నమోదు చేయించారని రాష్ట్ర రోడ్డు రవాణా అధారిటీ అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ లో ప్రభాకరరెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేసి అనంతపురం తరలిస్తున్నారు. నిన్న తెలుగుదేశం శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

2020-06-13

తమ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడును 100 మంది పోలీసులు అక్రమంగా, చట్టవిరుద్ధంగా కిడ్నాప్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. బలహీనవర్గాలకు వైసీపీ చేస్తున్న మోసంపై పోరాడుతున్నందుకే సిఎం జగన్ కక్ష కట్టి కిడ్నాప్ చేయించారని విమర్శించారు. అచ్చెన్నను ఎక్కడికి తీసుకెళ్ళారో తెలియదని.. కుటుంబ సభ్యులకు, తనకు కూడా ఫోనులో అందుబాటులో లేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జ్యోతిరావుఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

2020-06-12

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. టీడీపీకి బలమైన స్వరంగా ఉన్న శాసనసభాపక్ష ఉపనేత కె. అచ్చెన్నాయుడును శుక్రవారం ఉదయం రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అచ్చెన్న కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇఎస్ఐ కొనుగోళ్ళలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారనేది అభియోగం. ‘ఫైబర్ నెట్’, చంద్రన్న కానుక పథకాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని నిన్ననే (గురువారం) మంత్రివర్గం నిర్ణయించింది.

2020-06-12

ఇండియాలో ‘లాక్ డౌన్’ లక్ష్యమూ, ఉద్ధేశమూ నెరవేరలేదని.. విఫలమైనట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నాలుగు దశల ‘లాక్ డౌన్’ ప్రధాని ఆశించిన ఫలితాలను ఇవ్వలేదన్న రాహుల్.. కరోనా వైరస్ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ఏమిటని ప్రశ్నించారు. పేదలకు, రాష్ట్రాలకు నేరుగా నిధులు ఇవ్వాలని రాహుల్ మరోసారి డిమాండ్ చేశారు. కరోనా వైరస్ అసాధారణంగా పెరుగుతున్న దశలో ‘లాక్ డౌన్’ ఎత్తివేస్తున్న ఏకైక దేశం ఇండియానేనని రాహుల్ వ్యాఖ్యానించారు.

2020-05-26

ఇండియా నుంచి అక్రమ మార్గాల్లో నేపాల్ లోకి ప్రవేశించిన భారతీయులు ‘కరోనా’ను వ్యాపింపజేస్తున్నారని ఆ దేశ ప్రధానమంత్రి కె.పి. ఓలి విమర్శించారు. చైనా, ఇటలీ కంటే ఇండియా నుంచి వచ్చిన వైరస్ మరింత ప్రాణాంతకంగా కనిపిస్తోందని ఆయన పార్లమెంటు సాక్షిగా వ్యాఖ్యానించారు. ఇండియన్లను సరిగ్గా పరీక్షించకుండా దేశంలోకి తేవడంలో కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల పాత్ర ఉందనీ ఆయన ఆక్షేపించారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాలను తమవిగా చూపుతూ ‘కొత్త మ్యాప్’ విడుదల చేశాక ‘కరోనా’ విషయంలోనూ నేపాల్ కఠువుగా మాట్లాడటం గమనార్హం.

2020-05-20

‘‘దుర్మార్గం.. పచ్చి మోసం.. దగా.. అంకెల గారడీ.. అంతా గ్యాస్’’ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘20 లక్షల కోట్ల ప్యాకేజీ’పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందన ఇది. ‘కరోనా’ను ఎదుర్కోవడానికి రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలని తాము కోరుతుంటే.. బిక్షగాళ్ళుగా భావించి కేంద్రం ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి సడలింపుతో రాష్ట్రాలు అప్పు చేసి రాష్ట్రాలే తీరుస్తాయని, కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వదని, దానికి కేంద్రం పెట్టిన షరతులు దరిద్రంగా ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం ఫ్యూడల్ పద్ధతిలో వ్యవహరిస్తోందని, ఆపత్కాలంలో రాష్ట్రాలపై పెత్తనం చేయడం సమాఖ్య వ్యవస్థకే విఘాతమని విమర్శించ

2020-05-18

విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ అరెస్టు తీరును ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్రంగా తప్పు పట్టారు. డాక్టర్ సుధాకర్ చేతులు వెనక్కి కట్టి పోలీసు కొడుతున్న వీడియోను చంద్రబాబు ఆదివారం సామాజిక మాథ్యమాల్లో పోస్టు చేశారు. దళిత వైద్యుడి పట్ల ఈ ప్రవర్తన పౌర సమాజానికి కళంకం అని బాబు మండిపడ్డారు. ఈ చర్య అనాగరికమని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వపు ఈ విపరీత చర్య మనుషులు, జంతువులకు మధ్య ఉన్న తేడాను చెరిపేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.

2020-05-17

శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. బుధవారం తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా యాజమాన్య బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ను కలసి ఈ అంశంపై చర్చించారు. ఏపీ కొత్త ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి కేటాయించిన 512 టిఎంసిల నుంచే తీసుకుంటామని ఆ ప్రభుత్వం చెబుతున్నా.. దానిపై సరైన పర్యవేక్షణ లేదని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు.

2020-05-13

శ్రీశైలం ఎగువన కృష్ణా నది నీటిని తోడి రాయలసీమకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రయత్నం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కృష్ణా నీటి యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి అంశంపై బోర్డు ఆమోదం లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తప్పని కేసీఆర్ పేర్కొన్నారు. రోజుకు 3 టిఎంసిల నీటిని తోడిపోసేలా ఓ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేసీఆర్ స్పందించా

2020-05-11

‘లాక్ డౌన్’లో మద్యం షాపులు తెరవడంతో నిన్న నెలకొన్న రచ్చకు బాధ్యత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేతదేనని ప్రభుత్వం ఆరోపించింది. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ద్వారా కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి క్యూలో నిలబెట్టారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆరోపించారు. ‘‘మాస్కులు వేసుకోకండి. గ్లౌజులు వేసుకోకండి. సామాజిక దూరం పాటించకుండా ఒకరిమీద ఒకరు పడుతున్నట్టు లైన్లో ఉండండి.. అని చెప్పి పార్టీ సానుభూతిపరులను, కార్యకర్తలను వైన్ షాపులపైకి ఎగదోయడం హేయం, దుర్మార్గం’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

2020-05-05
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page