ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేశారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘‘ఆ భూభాగం చైనాదే అయితే.. 1. మన సైనికులు ఎందుకు చంపబడ్డారు? 2. వారు ఎక్కడ చంపబడ్డారు?’’ అని రాహుల్ శనివారం ట్విట్టర్లో ప్రశ్నించారు. మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదంటూ నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత ప్రధాని మోడీ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముందస్తు పథకం ప్రకారం చైనా దాడి చేస్తే భారత ప్రభుత్వం నిద్రపోయిందని, సమస్యను ఒప్పుకోవడానికి నిరాకరిస్తోందని రాహుల్ నిన్న ధ్వజమెత్తారు.
2020-06-20‘మన సరిహద్దులోకి ఎవరూ చొరబడలేదు. ఏ పోస్టునూ ఆక్రమించలేదు’ అని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. లడఖ్ లో జరిగిన ఘర్షణలపై శుక్రవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మోడీ ఈ మాట చెప్పారు. మన జవాన్లు 20 మంది అమరులయ్యారని, చొరబాటుకు ధైర్యం చేసినవారికి గుణపాఠం చెప్పారని ప్రధాని వ్యాఖ్యానించారు. గత నెలలో లడఖ్ లోని గాల్వన్ లోయ, పాంగాంగ్ ట్సో ప్రాంతాల్లోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చిందని ఆధారసహితంగా వార్తలు వచ్చాయి. దాదాపు నెల రోజుల తర్వాత కేంద్ర రాజ్ నాథ్ సింగ్ ఈ విషయాన్ని అంగీకరించారు. ప్రధాని తాజా ప్రకటన అందుకు భిన్నంగా ఉంది.
2020-06-19గత సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజధాని వికేంద్రీకరణ’, ‘సీఆర్డీయే రద్దు’ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపినందుకు ఆగ్రహించిన అధికార వైసీపీ ఏకంగా శాసన మండలి రద్దుకోసం శాసనసభలో తీర్మానం చేసింది. ఇప్పుడు అదే శాసన మండలి ముందుకు మరోసారి అవే బిల్లులు రావడం విశేషం. మండలి రద్దుకు పార్లమెంటు ఆమోదం తెలపాల్సి ఉండగా.. రాజధాని బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటును వైసీపీ అడ్డుకుంది. ఈ అంశం కోర్టులో ఉండగానే ప్రభుత్వం మరోసారి రాజధాని బిల్లులను శాసనసభలో ఆమోదింపజేసింది. మండలిలో బలం ఉన్న ప్రతిపక్షం ఆయా బిల్లులను ప్రవేశపెట్టకుండానే అడ్డుకుంది. అయితే, మూడు నెలల వ్యవధితో రెండోసారి మండలికి బిల్లులు వచ
2020-06-18చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోడీ ఐదువారాల తర్వాత మౌనం వీడారు. సోమవారం రాత్రి చైనా సైన్యంతో ఘర్షణలో 23 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ‘కరోనా’పై సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా బుధవారం ప్రధాని మాట్లాడారు. జవాన్ల త్యాగం వృధా కాదని జాతికి హామీ ఇచ్చారు. ‘‘దేశ ఐక్యత, సార్వభౌమత్యం మనకు చాలా ముఖ్యం. ఇండియా శాంతిని కోరుకుంటుంది. కానీ, రెచ్చగొడితే తగిన విధంగా సమాధానం చెప్పే సామర్ధ్యం ఉంది’’ అని మోడీ ఉద్ఘాటించారు. మరణించిన జవాన్లకు సంతాపం తెలుపుతూ పిఎం, సిఎంలు 2 నిమిషాలు మౌనం పాటించారు.
2020-06-17చైనా సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 19న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే వర్చువల్ సమావేశంలో రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది. లడఖ్ లోని గాల్వన్ లోయలో మొన్న రాత్రి జరిగిన ఘర్షణలో 23 మంది భారత జవాన్లు మరణించారు. మరికొంత మంది మృత్యువుతో పోరాడుతున్నారు. గత నెలలో గాల్వన్ లోయ, పాంగాంగ్ ట్సో ప్రాంతాల్లో చైనా సైన్యం కొన్ని కిలోమీటర్ల దూరం చొచ్చుకు వచ్చి టెంట్లు వేసుకున్న సంగతి తెలిసిందే.
2020-06-17‘కరోనా’ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తాజాగా ‘గుజరాత్ నమూనా’పై ట్వీట్ పెట్టారు. కోవిడ్ 19 మరణాల రేటు ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ‘‘గుజరాత్ నమూనా బట్టబయలైంది’’ అని విమర్శించారు. గుజరాత్: 6.25%, మహారాష్ట్ర: 3.73%, రాజస్థాన్: 2.32%, పంజాబ్:2.17%, పుదుచ్ఛేరి: 1.98%, జార్ఖండ్: 0.5%, చత్తీస్ గఢ్: 0.35% అంటూ మరణాల రేట్లను తన ట్వీట్ లో పేర్కొన్నారు.
2020-06-16రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన అధిపతి గవర్నర్. అందుకే ‘నా ప్రభుత్వం’ అంటుంటారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు కాక ముందు అధికార పార్టీ ఇచ్చే హామీలతో గవర్నరుకు సంబంధం ఉండదు. రాను రాను ఈ విచక్షణ లోపిస్తోంది. మంగళవారం ఏపీ అసెంబ్లీని ఉద్ధేశించి ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అధికార పార్టీ ఎన్నికల హామీలను ప్రస్తావించారు. 122 హామీలలో 77 అమలు చేశామని, మరో 39 పరిశీలనలో ఉన్నాయని, మేనిఫెస్టోలో లేని 40 అంశాలనూ అమలు చేశామని గర్వంగా చెప్పారు. తన ప్రభుత్వం ఎన్ని పథకాలను అమలు చేసిందో గవర్నర్ చెప్పవచ్చు. కానీ, తనవి కాని ఎన్నికల హామీల ప్రస్తావన అవాంఛనీయం.
2020-06-162019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు తనను కాళ్లా వేళ్లా బ్రతిమాలితేనే వైసీపీలో చేరి నర్సాపురం లోక్ సభ స్థానంలో పోటీ చేశానని ఎంపి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తనంతట తాను వైసీపీలో చేరలేదని, తాను కాబట్టే అక్కడ గెలిచానని ఉద్ఘాటించారు. జగన్ సీటు ఇస్తేనే ఎంపీగా గెలిచాడంటూ నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలను రఘురామకృష్ణంరాజు తోసిపుచ్చారు. తనను తన కులంవాడి చేతనే తిట్టించాలని ప్రసాదరాజును ఉపయోగించారని, దీనివల్ల ఆయనకు మంత్రి పదవి రావచ్చని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
2020-06-16ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది సోమవారం ఉదయం అదృశ్యమయ్యారు. వారిని గూఢచారులుగా చిత్రించేందుకు పాకిస్తాన్ భద్రతా సంస్థలే తీసుకెళ్ళి ఉంటాయని భావిస్తున్నారు. రెండు వారాల క్రితం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారులను గూఢచర్యం ఆరోపణలతో భారత ప్రభుత్వం బహిష్కరించినందుకు ప్రతిచర్యగా ఈ పని చేసి ఉండొచ్చు. ఇస్లామాబాద్ లో అదృశ్యమైన ఇద్దరూ సిఐఎస్ఎఫ్ డ్రైవర్లుగా ప్రాథమిక సమాచారం. శుక్రవారం ఉదయం ఇంటినుంచి బయలుదేరిన వారిద్దరూ కార్యాలయానికి చేరలేదు.
2020-06-15ఇండియాలోని కాలాపని, లిపులేఖ్, లింపియాధురా వంటి భూభాగాలను తమ దేశంలో కలిపి చూపించిన కొత్త రాజకీయ పటానికి నేపాల్ పార్లమెంటు దిగువ సభ ఆమోదం తెలిపింది. ప్రధాని కెపి శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, మాధేసీ పార్టీ మద్ధతిచ్చాయి. 275 మంది సభ్యుల ప్రతినిధి సభ ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అన్ని పార్టీల సభ్యులూ బిల్లుపై సంతకాలు చేశారు. శతాబ్దాల దౌత్యపరమైన అవమానాలను తిప్పికొట్టిందంటూ ప్రభుత్వాన్ని మావోయిస్టు అగ్రనేత ప్రచండ ప్రశంసించారు.
2020-06-13