శాంతిని కోరుకుంటూనే బలగంతోనూ స్పందించగలమని తూర్పు లడఖ్ లో చూపించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. దేశంకోసం పోరాడిన సైనికులను ఆదివారం ‘మన్ కీ బాత్’లో మోడీ కొనియాడారు. ‘‘2020 శుభప్రదం కాదని చాలా మంది భావిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఎదురవుతుందని 6-7 నెలల క్రితం మనకు తెలుసా? అనేక ఇతర ఇబ్బందులను మనం ఎదుర్కొంటున్నాం - తుపానులు, భూకంపాలు, మిడతల దాడులు, అవి అంత ఇబ్బంది కాకపోయినా పొరుగు దేశాలనుంచి కూడా’’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ ఏడాదే కొత్త శిఖరాలను అధిరోహిస్తామని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.
2020-06-28ఢిల్లీలో నిన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను, ఎన్నికల సంఘం అధికారులను కలసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.. శనివారం కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్, కిషన్ రెడ్డి లతో సమావేశమయ్యారు. సొంత పార్టీ (వైసీపీ) నేతలు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విన్నవించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తన ప్రాణానికి వైసీపీ కార్యకర్తల నుంచి ముప్పు ఉన్నందునే నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్లు చెప్పారు. తిరుమల ఆస్తుల అమ్మకం నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకే బెదిరింపులు వచ్చాయని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
2020-06-27 Read Moreరాజ్యసభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు కాంగ్రెస్ నేతలు శనివారం బిజెపిలో చేరారు. మార్చి, జూన్ మాసాల్లో రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలలో వీరు ఉన్నారు. మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ సభ్యుల ఎన్నిక ‘కరోనా’ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. జూన్ 19న ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతిపక్షాలకు రాజ్యసభ సీట్లు దక్కకుండా ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించడానికి పలు రాష్ట్రాల్లో రాజీనామాలు చేయించింది బిజెపి. ప్రభుత్వాలను పడగొట్టడానికి కూడా రాజీనామాలు చేయించి.. ఉప ఎన్నికల్లో తమ పార్టీ సీట్లు కేటాయించడమూ తెలిసిందే.
2020-06-27‘కరోనా’ వైరస్ దేశంలో కొత్త ప్రాంతాలకు శరవేగంగా విస్తరిస్తుంటే... దానిపై పోరాడటానికి ప్రధానమంత్రి నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ఐసిఎంఆర్ ప్యానల్ లేదు, మంత్రుల గ్రూపు సమావేశాల్లేవు, విలేకరుల సమావేశాల్లేవు- కోవిడ్ కేసులు పెరుగుతున్నా మోడీ ప్రభుత్వం వెనక్కు వెళ్తోంది’’ అనే శీర్షికన ‘ద ప్రింట్’ రాసిన కథనాన్ని రాహుల్ గాంధీ శనివారం ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘ప్రధాని మౌన వహించారు. ఆయన లొంగిపోయారు. మహమ్మారిపై పోరాడటానికి నిరాకరిస్తున్నారు’’ అని రాహుల్ దుయ్యబట్టారు. ‘కరోనా’ను ఓడించడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రణాళికే లేదని విమర్శించారు.
2020-06-27శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆ ఖాళీలోనే తిరిగి ఎన్నిక కావడంకోసం వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. మండలి రద్దుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయించిన ముఖ్యమంత్రి జగన్... ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు రాజ్యసభ సభ్యత్వాల రూపంలో పరిహారం ఇచ్చారు. డొక్కాను మాత్రం అదే మండలి సభ్యత్వంకోసం అభ్యర్ధిగా నిలపడం గమనార్హం.
2020-06-25చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి వర్చువల్ పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కీలకమైన అంశాలపై ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొని వ్యూహరచన చేయడానికి పార్లమెంటు ఒక్కటే సరైన వేదిక అని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అభిప్రాయపడ్డారు. 1962 ఇండో-చైనా యుద్ధ సమయంలో పార్లమెంటు సమావేశాల ఏర్పాటుకు అటల్ బిహారీ వాజపేయి డిమాండ్ చేయగా నెహ్రూ అంగీకరించారని గుర్తు చేశారు. ముఖ్యమైన అంశాలు ఉన్నా పార్లమెంటరీ కమిటీలు కూడా సమావేశం కావడంలేదని ఆయన ఆక్షేపించారు.
2020-06-25తనకు ‘కరోనా’ పాజిటివ్ వచ్చిందనే పేరిట అదుపులోకి తీసుకొని నిజంగానే ‘కోవిడ్19’ తెప్పించాలని కుట్ర చేశారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. విజయవాడ పరీక్ష ఫలితం (పాజిటివ్)పై అనుమానం వచ్చి హైదరాబాద్ నగరంలో పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని దీపక్ రెడ్డి గురువారం వెల్లడించారు. ‘కోవిడ్19’ పేరిట తనను హతమార్చే కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయాలను ఈ స్థాయికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
2020-06-25‘కరోనా’ రేఖ పెరుగుతుండగా మోడీ ప్రభుత్వం అభివృద్ధి రేఖను మట్టి కరిపించిందని గత కొంత కాలంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తాజాగా మరో వ్యంగ్యాస్త్రం వదిలారు. దేశంలో పెరుగుతున్నది ‘కరోనా’ రేఖ మాత్రమే కాదంటూ ఓ గ్రాఫును బుధవారం సామాజిక మాథ్యమాల్లో షేర్ చేశారు. వైరస్ కొత్త కేసుల పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ ధరలను పోలుస్తున్న లైన్ చార్టు అది. అందులో మూడు రేఖలూ దాదాపు ఒకే విధంగా పైపైకి వెళ్ళడం విశేషం. మోడీ ప్రభుత్వం ‘కరోనా’ మహమ్మారికి, పెట్రోల్ - డీజిల్ ధరలకు కళ్ళెం వదిలేసిందని ఆ పోస్టులో రాహుల్ వ్యాఖ్యానించారు.
2020-06-24ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో సిబ్బందిని 50 శాతం తగ్గించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో ఇస్లామాబాద్ లోని భారత మిషన్ నుంచి కూడా అంతే సంఖ్యలో సిబ్బందిని ఉపసంహరించాలని నిర్ణయించింది. 7 రోజుల్లోగా ఈ తగ్గింపును పూర్తి చేయనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఇటీవల గూఢచర్యానికి పాల్పడ్డారని ఇద్దరు పాకిస్తాన్ దౌత్యాధికారులను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నందుకు ప్రతిగా ఇస్లామాబాద్ లో ఇద్దరు భారత దౌత్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
2020-06-23ఏపీ ‘ఎన్నికల కమిషనర్’ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను కలవడంలో రహస్యమేమీ లేదని ఎంపీ సుజనా చౌదరి వివరణ ఇచ్చారు. ‘కరోనా’ కారణంగా లాక్ డౌన్ ప్రకటించాక తాను పార్క్ హయత్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నానని, అక్కడే అనేక మందిని కలుస్తున్నానని పేర్కొన్నారు. ఈ నెల 13న తమ పార్టీ నేత కామినేని శ్రీనివాస్ అపాయింట్ మెంట్ సమయంలో వచ్చి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళారని, అది సాధారణంగా జరిగే కలయికేనని సుజనా స్పష్టం చేశారు. రమేష్ కుమార్ తో భేటీ మర్యాదపూర్వకమని, తమకు కుటుంబ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు సంబంధం లేని సమావేశాలను ఒకటిగా చూపుతున్నారని ఆక్షేపించారు.
2020-06-23