ఇరాన్ లోని చాబహార్ పోర్టు నుంచి ఆప్ఘనిస్తాన్ సరిహద్దులోని జహేదాన్ వరకు తలపెట్టిన రైల్వే లైన్ ప్రాజెక్టు ఇండియా చేజారిపోయింది. చాబహార్ పోర్టు ఇండియాకు వ్యూహాత్మకంగా కీలకమైనది. అక్కడినుంచి జహేదాన్ వరకు 628 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ నిర్మాణానికి ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్ (ఐ.ఆర్.సి.ఒ.ఎన్), ఇరాన్ రైల్వేస్ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. అయితే, అమెరికా ఒత్తిడితో ఇండియా గత ఏడాది చమురు దిగుమతులను పూర్తిగా తగ్గించడం, చైనాతో ఇటీవల కుదిరిన 400 బిలియన్ డాలర్ల వ్యూహాత్మక ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒప్పందం కుదిరి నాలుగేళ్ళయినా ఇండియా ఈ ప్రాజెక్టును ప్రారంభించకపోవడాన్ని
2020-07-14 Read Moreతాను డిప్యూటీ సిఎంగా ఉన్న సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ఉధ్వాసనకు గురయ్యారు. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఆయనను అధిష్ఠానం తొలగించింది. సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసినా.. సిఎం అశోక్ గెహ్లాట్ రాజకీయ అనుభవం, చాతుర్యంతో నిన్న సిఎల్పీ సమావేశంలో బలప్రదర్శన చేశారు. మంగళవారం మళ్ళీ సమావేశమైన సీఎల్పీ సచిన్, ఆయన సహచర తిరుగుబాటు నేతలు ఇద్దరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని తీర్మానించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.
2020-07-14ఇటీవల ఇండియాపై విరుచుకుపడుతున్న నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ఇప్పుడు ఏకంగా ‘రామబాణం’ వదిలారు. నిజమైన అయోధ్య ఇండియాలో లేదని, అది తమ దేశంలో ఉందని సోమవారం సరికొత్త వాదన వినిపించారు. ‘రాముడు నేపాలీ, ఇండియన్ కాదు’ అని ఓలి వ్యాఖ్యానించినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. రాముని జన్మస్థలం అయోధ్య.. దక్షిణ నేపాల్ లోని తోరిలో గల వాల్మీకి ఆశ్రమం దగ్గరలో ఉందని, ఉత్తరప్రదేశ్ లో కాదని ఓలి ఉద్ఘాటించారు. సాంస్కృతిక దురాక్రమణలో నేపాల్ బాధితురాలు అని, చరిత్ర వక్రీకరణకు గురైందని ఓలి వాపోయారు.
2020-07-14మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాక బిజెపి రాజస్థాన్ పైన గురి పెట్టింది. ఎమ్మెల్యేలకు ముడుపులు ఇచ్చి తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోందని నిన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించిన నేపథ్యంలో.. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో ఆయన చర్చించనున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలపై రాజస్థాన్ సిఐడి మొన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అశోక్ సింగ్, భరత్ మలాని అనే వ్యక్తుల టెలిఫోన్ సంభాషణల్లో బిజెపి ప్రణాళిక, సచిన్ పైలట్ ఆకాంక్షల ప్రస్తావన ఉన్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
2020-07-12భారత భూభాగాన్ని ఎవరూ (చైనా) ఆక్రమించలేదన్న ప్రధాని మోడీ ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగుతున్నాయి. ‘‘చైనా మా భూమిని గుంజుకున్నదని లడఖ్ వాసులు చెబుతున్నారు. మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదని ప్రధాని చెప్పారు. కచ్చితంగా ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారు’’ అని రాహుల్ శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. చైనా లడఖ్ భూభాగాలను ఆక్రమించిందని ఆ ప్రాంత నేతలు, ప్రముఖులు చెప్పిన క్లిప్పులను కలిపి ఓ వీడియోను రాహుల్ షేర్ చేశారు. ప్రధాని మోడీ లడఖ్ పర్యటనకు వెళ్ళిన రోజే రాహుల్ ఈ వీడియోను షేర్ చేయడం గమనార్హం.
2020-07-03‘‘భారత మాత శత్రువులు మీ కోపాన్ని, ప్రతాపాన్ని చూశారు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైన్యాన్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రధాని లడాఖ్ లోని ‘లేహ్’లో ఆకస్మికంగా పర్యటించారు. ఇటీవల గాల్వన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణలో గాయపడిన భారత జవాన్లను ప్రధాని పరామర్శించారు. ఆ ఘర్షణలో మరణించిన సైనికులకు నివాళి అర్పించిన అనంతరం సైనికాధికారులను ఉద్ధేశించి ప్రసంగించారు. ‘‘మీరు, మీతోటి సైనికులు చూపించిన ధైర్యంతో భారతదేశ బలంపై ప్రపంచానికి ఓ సందేశం వెళ్ళింది. మీ మనోధైర్యం హిమాలయ సమానం’’ అని మోడీ సైన్యంపై ప్రశంసల వర్షం కురిపించారు.
2020-07-03తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే హెచ్-1బి వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తానని డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ప్రకటించారు. ఆసియన్ అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసుల అంశాలపై వాషింగ్టన్ లోని డిజిటల్ టౌన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో బిడెన్ ప్రసంగించారు. ఇండియన్లు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్-1బి, ఇతర వర్క్ వీసాలపైన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నవంబరు నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నిక జరగనుండగా.. అమెరికన్ల ఓట్లకు గాలం వేస్తూ ట్రంప్ డిసెంబరు వరకు వీసాలను సస్పెండ్ చేశారు. ‘ఆయన (ట్రంప్) ఈ ఏడాది చివరి వరకే వీసాలు సస్పెండ్ చేశారు. అది నా పాలనల
2020-07-02తైవాన్ ఓ ‘వికృత ప్రజాస్వామ్యం’. ఆ దేశంలో పార్లమెంటును ఆక్రమించుకోవడం అసాధారణమేమీ కాదు. సోమవారం మరోసారి అదే దృశ్యం కనిపించింది. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్ష కొమింటాంగ్ పార్టీ (కెఎంటి) ఎంపీలు రాత్రి పార్లమెంటును ఆక్రమించి ప్రధాన ద్వారానికి గొలుసులు కట్టేశారు. సోమవారం ఉదయం అధికార డీపీపీ సభ్యులు చొరబడి ప్రతిపక్ష సభ్యులపై దాడికి దిగారు. ‘‘ఇది చాలా ప్రమాదకరం. మీ సహచర సభ్యులతో ఇలా ప్రవర్తించకూడదు’’ అంటూ కెఎంటి యువ నేత వేన్ చియాంగ్ అధికార పార్టీ హింసను ఖండించారు. ఈయన తైవాన్ నియంత (తొలి అధ్యక్షుడు) చియాంగ్ కై షేక్ మనవడు.
2020-06-29తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇండియాలో సమావేశాలు జరుగుతున్నాయని నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ఆరోపించారు. దివంగత కమ్యూనిస్ట్ నాయకుడు మదన్ భండారి జ్ఞాపకార్థం తన అధికారిక నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓలి మాట్లాడారు. తన ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉందన్న ఓలి, పడగొట్టే ప్రయత్నాలు విఫలమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇండియాలోని లింపియాధురా- కాలాపాని- లిపులేఖ్ ప్రాంతాలను తమవిగా చూపుతూ నేపాల్ ప్రభుత్వం కొత్త మ్యాప్ ను ప్రచురించడంపై ఇండియా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వ కూల్చివేతకు ఇండియాలో కుట్ర జరుగుతోందని ఓలి ఆరోపించారు.
2020-06-28మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పి.వి. జ్ఞానభూమిలో నివాళులు అర్పించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. పి.వి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ నాయకుడే అయినా తెలంగాణ దిగ్గజ నాయకుడు కాబట్టి ఏడాది పొడవునా జయంతి ఉత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం జ్ఞానభూమిలో కేసీఆర్, మంత్రులతో పాటు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పీవీకి నివాళులు అర్పించారు.
2020-06-28