జెడి(యు)కు తక్కువ సీట్లు వచ్చినా నితీష్ కుమార్ నే బిహార్ ముఖ్యమంత్రిగా నిర్ణయించిన బిజెపి, తమ పార్టీకి చెందిన ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టబోతోంది. ఎమ్మెల్యేలు తార్ కిషోర్ ప్రసాద్, రేణు దేవి లను శాసనసభా పక్ష నేత, ఉప నేతలుగా ఎంపిక చేసింది. తద్వారా నితీష్ కు ఇద్దరు డిప్యూటీలు ఉంటారన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇప్పటిదాకా డిప్యూటీ సిఎంగా ఉన్న సుశీల్ కుమార్ మోడీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం ఉంది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్.జె.డి.కి 75, బిజెపికి 74, జెడియుకు 43 సీట్లు వచ్చాయి.
2020-11-15అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ మద్ధతుదారులు చేపట్టిన ర్యాలీలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆదివారం వాషింగ్టన్ నగరంలో కొన్ని పదుల వేలాది మంది ట్రంప్ కు మద్ధతుగా కదం తొక్కారు. ఈ సందర్భంగా వారికి, వారి వ్యతిరేకులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. 21 మందిని అరెస్టు చేసి 8 తుపాకులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించినా.. ప్రస్తుత అధ్యక్షుడు ఓటమిని అంగీకరించడంలేదు.
2020-11-15లడఖ్ లోని లేహ్ స్వయంపాలక కొండప్రాంత అభివృద్ధి మండలి (LAHDC- Leh)కి జరిగిన ఎన్నికల్లో 26 స్థానాలకు గాను బిజెపి 15 గెలుచుకుంది. మిగిలిన తొమ్మిది కాంగ్రెస్ వశమయ్యాయి. 2015 ఎన్నికలతో పోలిస్తే బిజెపికి మూడు సీట్లు తగ్గాయి. కేవలం 1.33 లక్షల జనాభా గల లేహ్ కోసం... బిజెపి ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో పోరాడింది. 8 మంది కేంద్ర మంత్రులు బిజెపి తరపున ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడటానికి రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు హోదా కల్పించాలన్న డిమాండ్ కు బిజెపి మద్ధతు ఇచ్చింది. అయినా సీట్లు తగ్గడం గమనార్హం.
2020-10-26పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడెందుకు కాదంటున్నదో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం అంగీకరించిందని గుర్తు చేశారు. 22 మంది వైసీపీ ‘పనికిమాలిన’ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం కోసం కేంద్రంపై పోరాడాలని సూచించారు. లోకేష్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
2020-10-262017లో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్ చేసిన ఓ తీర్మానం పోలవరానికి శాపమైందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. నిర్వాసితుల పునరావాసం సహా ప్రాజెక్టు మొత్తం కేంద్రం బాధ్యత అయినప్పుడు, నిర్మాణ బాధ్యతను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎందుకు తీసుకుందని మంత్రి ప్రశ్నించారు. ‘మీ ప్యాకేజీల కోసం కాదా’ అని టీడీపీని ప్రశ్నించారు. రూ. 29 వేల కోట్ల పునరావాస ప్యాకేజీని వదిలేసి 2013 నాటి అంచనాలతో ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సిఎం జగన్ ప్రధానమంత్రిని కలుస్తారని చెప్పారు.
2020-10-26పాకిస్తాన్, చైనా స్వాధీనం చేసుకున్న భారత భూభాగంలో ప్రతి అంగుళాన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని బిజెపి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రవీందర్ రైనా ఉద్ఘాటించారు. అందుకోసం సైనిక బలాన్ని వినియోగించడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. చైనా, పాకిస్తాన్ లో యుద్ధం తేదీని మోదీ ముందే నిర్ణయించారని నిన్న యూపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ బిజెపి నేత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ అధినేత మోహగ్ భగవత్... శక్తి, వ్యాప్తిలో చైనా కంటే ఇండియా పెద్దగా ఎదగాలని నిన్ననే వ్యాఖ్యానించారు.
2020-10-26చైనా, పాకిస్తాన్ లతో దేశం ఎప్పుడు యుద్ధం చేయాలో ప్రధాని మోదీ ముందే నిర్ణయించారా? అవునంటున్నారు ఉత్తరప్రదేశ్ బిజెపి శాఖ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్. ఈ వివాదాస్పదాస్పద వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ‘‘రామమందిరం, ఆర్టికల్ 370 తరహాలోనే పాకిస్తాన్, చైనాలతో యుద్ధం ఎప్పుడు జరుగుతుందో మోదీ నిర్ణయించారు’’ అని సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘సంబంధిత తేదీ నిర్ణయమైంది’’ అని ఉద్ఘాటించారు. బిజెపి ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
2020-10-25 Read Moreచైనా మన భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నదని, కేంద్ర ప్రభుత్వం-ఆర్ఎస్ఎస్ అందుకు అనుమతించాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆదివారం ఆర్ఎస్ఎస్ విజయదశమి సమావేశంలో ఆ సంస్థ అధిపతి మోహన్ భగవత్ చేసిన ప్రసంగానికి రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ‘‘లోలోపల మోహన్ భగవత్ కు నిజం తెలుసు. దాన్ని ఎదుర్కోవడానికి ఆయన భయపడుతున్నారంతే. నిజం ఏమిటంటే... చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. భారత ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ దాన్ని అనుమతించాయి’’ అని రాహుల్ గాంధీ ట్వీటారు.
2020-10-25శక్తిలోనూ, వ్యాప్తిలోనూ చైనా కంటే ఇండియా పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆకాంక్షించారు. ఆ దేశ విస్తరణ ప్రణాళికల గురించి ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. భగవత్ ఆదివారం ఆర్ఎస్ఎస్ విజయ దశమి వార్షిక సమావేశంలో మాట్లాడారు. ‘‘మహమ్మారి సమయంలో చైనా మన సరిహద్దులను ఆక్రమించింది’’ అని భగవత్ చెప్పారు. పౌరసత్వ (సవరణ) చట్టం ఏ మతానికీ వ్యతిరేకం కాదంటూ ‘‘ఇది వారి జనాభాను తగ్గించడానికి ఉద్దేశించినదని కొంతమంది మన ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు’’ అని భగవత్ విమర్శించారు.
2020-10-25స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. వచ్చే మూడు నెలల్లో కరోనా వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందన్న హెచ్చరికలను మంత్రి ప్రస్తావించారు. మార్చిలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక... ‘కరోనా’ వ్యాప్తి నిరోధానికంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసులు భారీగా పెరిగినా... ప్రపంచమంతటా ఎన్నికలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనూ ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఇసి ఈ నెల 28న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
2020-10-23