మునిసిపల్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘‘యూపీకి తికాణా లేదు.. ఇక్కడికొచ్చి నీతులు చెబుతాడట. ఆయనొచ్చి హైదరాబాద్ లో ఊరేగుతున్నాడు.’’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడేనాటికి తలసరి ఆదాయంలో దేశంలో 13వ స్థానంలో ఉన్నామని, ఇప్పుడు 5వ స్థానానికి పెరిగామని, అలాంటి తమకు 28వ స్థానంలో ఉన్న యూపీ ముఖ్యమంత్రి వచ్చి చెప్పడమేమిటని కేసీఆర్ ప్రశ్నించారు.

2020-11-28

వరద సాయం కోసం నిధులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. కర్నాటకకు, ఇతర రాష్ట్రాలకు అడిగిన వెంటనే నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘‘ప్రధానమంత్రిని 1300 కోట్లు ఇవ్వమని అడిగాను. 13 పైసలు కూడా ఇవ్వలేదు.. ఏం మేము భారతీయులం కామా? భారత దేశంలో లేమా’’ అని నిలదీశారు. వరద సాయం చేయలేదు కానీ, బిజెపి నేతలు ఇప్పుడు వరదలా హైదరాబాద్ కు వస్తున్నారని ఎద్దేవా చేశారు.

2020-11-28

ప్రపంచాన్ని మార్చిన మార్క్సిజం, ఫ్రెడెరిక్ ఎంగెల్స్- కారల్ మార్క్స్ స్నేహ ఫలితమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఉద్ఘాటించారు. ప్రజలకోసం కారల్ మార్క్స్ తో ఎంగెల్స్ స్నేహం చేశారని, వారిద్దరిదీ అమర స్నేహమని కొనియాడారు. మార్క్సిస్టు మహోపాధ్యాయుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఫ్రెడెరిక్ ఎంగెల్స్ 200వ జయంతి సందర్భంగా అంతర్జాల సభలో రాఘవులు మాట్లాడారు. కొన్ని విషయాలను మార్క్స్ కంటే ముందే ఎంగెల్స్ ప్రతిపాదిస్తే, మార్క్స్ వాటిని లోతుగా అధ్యయనం చేసి అభివృద్ధి చేశారని రాఘవులు చెప్పారు.

2020-11-28

సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి హైదరాబాద్ ఏమైనా చైనాలో ఉందా.. పాకిస్తాన్లో ఉందా? అని తెలంగాణ మంత్రి కెటి రామారావు బిజెపి నేతలను ప్రశ్నించారు. ఒక మతాన్ని భూతంలా చూపించి మిగిలినవారిని రెచ్చగొట్టే పని చేస్తున్నారంటూ.. కేవలం నాలుగు ఓట్ల కోసం హైదరాబాద్ ను దెబ్బ తీయవద్దని హితవు పలికారు. మత కలహాలతో కర్ఫ్యూలు విధిస్తే.. హైదరాబాద్ కు గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ వంటి సంస్థలు వస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. డిసైసివ్ నాయకత్వం కావాలా.. డివైసివ్ నాయకత్వమా? తేల్చుకోవాలన్నారు.

2020-11-27

దేశవ్యాప్తంగా ముస్లిం ఓటు బ్యాంకును చీలుస్తూ బిజెపికి సహాయపడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీకి బెంగాల్ సిఎం మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సహా 17 మంది ముఖ్య నాయకులను తృణమూల్ కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. బీహార్ ఎన్నికల్లో 5 సీట్లు గెలిచి మిగిలిన చోట్ల కూడా ఓట్లు చీల్చి ఎన్డీయే ప్రభుత్వ పునరుద్ధరణకు పరోక్షంగా దోహదపడింది ఎంఐఎం. ఇప్పుడు 27 శాతం ముస్లిం జనాభా ఉన్న బెంగాల్ పైన దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నేతల గోడదూకుడు గట్టి దెబ్బే.

2020-11-24

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్ ప్రముఖులకు చోటు లభించనున్నట్టు సమాచారం. అమెరికా మాజీ సర్జెన్ జనరల్, ప్రస్తుతం బైడెన్ బృందంలో కోవిడ్19 సలహాదారుగా వ్యవహరిస్తున్న వివేక్ మూర్తిని ఆరోగ్య మంత్రిగా, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అరుణ్ మజుందార్ ను ఇంధన శాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ రాసింది. మెకానికల్ ఇంజనీర్ అయిన మంజుందార్ ఇంధన వ్యవహారాలలో బైడెన్ కు సలహాదారుగా ఉన్నారు.

2020-11-18

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. మరోసారి సుభాష్ చంద్రబోస్ తెరపైకి వచ్చారు. ఆయన జన్మదినమైన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని మమత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాజాగా లేఖ రాశారు. అలాగే 1945 ఆగస్టు 18న నేతాజీ అదృశ్యం కావడంపై స్పష్టమైన నిర్ధారణకోసం కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని మోదీ స్వయంగా పరిశీలించాలని మమత కోరారు.

2020-11-18

కరోనా కారణంగా వాయిదా పడిన పంచాయతీ ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని యోచిస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్.ఇ.సి) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలూ తీసుకున్న నేపథ్యంలో రమేష్ కుమార్ ఈ అంశంపై మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజుకు 10 వేలు నమోదయ్యే దశ నుంచి 753 వరకు తగ్గిందని ఆయన గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూలు విడుదలైన విషయాన్ని తన ప్రకటనలో ప్రస్తావించారు.

2020-11-17

హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. డిసెంబర్ 1న పోలింగ్ నిర్వహించి 4వ తేదీన ఓట్లు లెక్కించనున్నారు. 150 డివిజన్లు ఉన్న జి.హెచ్.ఎం.సి.లో 50 బిసిలకు (అందులో 25 మహిళలకు), 10 ఎస్సీలకు (అందులో 5 మహిళలకు), 2 ఎస్టీలకు (అందులో ఒకటి మహిళకు) రిజర్వు అయ్యాయి. ఓపెన్ కేటగిరిలోనూ సగం (88 సీట్లలో 44) మహిళలకు ఉంటాయి. మేయర్ పదవి మహిళ (జనరల్)కు రిజర్వు అయింది. బుధవారమే నామినేషన్ల స్వీకరణ మొదలై 20వ తేదీతో ముగుస్తుంది.

2020-11-17

పార్లమెంటు శీతాకాల సమావేశాల రద్దు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకేసారి బడ్జెట్ సమావేశాలను జనవరి చివరి వారం నుంచి నిర్వహించాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. కరోనా నియంత్రణలోకి రాని ఈ పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం తెలివైన పని కాదని ఓ ముఖ్యుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కరోనా కారణంగా వర్షాకాల సమావేశాలను కూడా కుదించారు. సెప్టెంబర్ 14న ప్రారంభమై కేవలం 8 పని దినాలతో 24న ముగిశాయి.

2020-11-16
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page