దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో ఓవైపు కె.సి.ఆర్. కుటుంబం మాత్రమే ఉందని కొల్లాపూర్ సభలో రాహుల్ అన్నారు. ‘‘ప్రజల తెలంగాణ అంటే... మహాలక్ష్మి పథకం కింద ప్రతి వివాహిత మహిళకు నెలకు 2,500; రూ. 500కే గ్యాస్ సిలిండర్; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం; ఇందిరమ్మ ఇళ్ళు; పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్; యువ వికాసం.’’ అని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇచ్చిన హామీలన్నిటినీ మొదటి కేబినెట్ సమావేశంలోనే నెరవేర్చామని చెప్పారు.

2023-10-31

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలను బిజెపి, బిఆర్ఎస్ నేతలు కలసి లూటీ చేశారని కాంగ్రెెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో జరిగిన అతిపెద్ద మోసం అని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మించిన కొద్ది కాలానికే బ్యారేజీ కుంగిపోయిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించిన ప్రతి రూపాయినీ ప్రజల నుంచి పన్నుల రూపంలో దోపిడీ చేశారని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై రూ. 31 వేల చొప్పున భారం మోపారని రాహుల్ దుయ్యబట్టారు.

2023-10-31
First Page 1 2 Last Page