జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి). అస్సాంలో సవరణ అత్యంత వివాదాస్పదమైంది. ఇప్పుడా ఎన్‌ఆర్‌సిని కర్ణాటకలో అమలు చేయాలనే ఉద్దేశ్యంతో అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై ధృవీకరించారు. బెంగళూరుకు 40 కి.మీ. దూరంలో సొండెకొప్పలో ఒక ‘డిటెన్షన్ సెంటర్’ను నిర్మించారు కూడా..! 10 అడుగుల ఎత్తైన గోడలు, ముళ్ల కంచెలు, రెండు వాచ్ టవర్లతో కనిపిస్తున్న ఈ నిర్మాణం అనధికారికంగా నివశిస్తున్న విదేశీయులను నిర్బంధించడానికేనని ఓ అధికారి తెలిపారు.

2019-10-04 Read More

దేశంలో మూక హత్యలను నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై బీహార్ లోని ముజఫరాపూర్ పట్టణంలో దేశద్రోహం కేసు నమోదైంది. స్థానిక న్యాయవాది ఒకరి పిటిషన్ పైన పట్టణ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చరిత్రకారుడు రామచంద్రగుహ, ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, సినీ ప్రముఖులు అదూర్ గోపాలక్రిష్ణన్, శ్యాంబెనగల్, అపర్ణాసేన్ సహా 50 మందిపైన కేసు నమోదైంది.

2019-10-04 Read More

జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి) నుంచి పేరు తొలగించినా... ఏ ఒక్క హిందువూ దేశం వదిలి పోనవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. ఇతర దేశాల్లో దాడులకు గురై ఇక్కడికి వచ్చిన హిందువులు దేశంలోనే ఉండిపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అస్సాం పౌర రిజిస్టర్ సవరణలో 19 లక్షల మంది పేర్లు తొలగించగా.. అందులో ముస్లింల కంటే హిందువులే ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో... పశ్చిమబెంగాల్ లోని ఉలుబేరియాలో బిజెపి సహా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ఆంతరంగిక సమావేశం జరిగింది.

2019-09-23 Read More

అయోధ్య రాముని జన్మస్థలం అన్నది హిందువుల విశ్వాసమని, దాన్ని దాటి అందులో హేతుబద్ధత ఏమిటన్న అంశానికి కోర్టు వెళ్లకూడదని రాంలల్లా తరపు న్యాయవాది సూచించారు. రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాదంలో భూయాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు విచారణ బుధవారం ఆరో రోజుకు చేరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింటోంది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై ముస్లింలు హక్కును కోరలేరని న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదించారు.

2019-08-14 Read More

‘ట్రిపుల్ తలాక్’ చెబితే మూడేళ్ళు జైలుపాలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ బద్ధతను ‘సమస్త కేరళ జమియ్యతుల్ ఉలేమా’ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత చట్టబద్ధతే లేని ‘ట్రిపుల్ తలాక్’ను నేరపూరితం చేయడం ఎందుకని ఈ సంస్థ తన పిటిషన్లో ప్రశ్నించింది. అన్ని మతాల పురుషులూ భార్యలను వదిలేస్తుంటే.. ఒక్క ముస్లింలకు మాత్రమే బెయిలు లేకుండా మూడేళ్ల శిక్ష వేయడం అర్ధంలేనిదని ఆక్షేపించింది.

2019-08-02 Read More

లోక్ సభ ఆమోదంతో రాజ్యసభకు వెళ్లిన ట్రిపుల్ తలాక్ బిల్లు అక్కడా పాసైంది. మంగళవారం ఈ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా జెడి(యు), ఎఐఎడిఎంకె వాకౌట్ చేయడంతో నంబర్ గేమ్ ప్రభుత్వానికి అనుకూలంగా మారింది. బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు పడగా, 84 మంది వ్యతిరేకించారు. టిఆర్ఎస్, టీడీపీ గైర్హాజరయ్యాయి. ఈ బిల్లును రాజ్యసభ పరిగణనలోకి తీసుకోవడం ఇది మూడోసారి. ఈ నెల 25వ తేదీన బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది.

2019-07-30 Read More

ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో.. గత ప్రభుత్వం కాపులకు కేటాయించిన 5 శాతం కోటాను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మినహా మిగిలిన వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన అందరికీ ఆ 10 శాతం రిజర్వేషన్ వర్తించేలా జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 5 శాతాన్ని కాపులకు కేటాయించి, మిగిలిన వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి మిగిలిన 5 శాతం వర్తించేలా చట్టం చేసింది.

2019-07-27

కర్నాటక కొత్త సిఎం పేరేంటి..? మొన్నటిదాకా యెడ్యూరప్ప (Yeddyurappa). ఇకపై యెడియూరప్ప (Yediyurappa). రెండవ డి స్థానంలో ఐ చేర్చారు. నిజానికి ఈ సీనియర్ నేత అసలు పేరు అదే (యెడియూరప్ప). తొలిసారి సిఎం అయినప్పుడూ అలాగే ప్రమాణస్వీకారం చేశారు. అయితే, న్యూమరాలజిస్టుల సలహా మేరకు ‘యెడ్యూరప్ప’గా మార్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ పాత పేరుతో ‘యెడియూరప్ప’గా ప్రమాణం చేశారు. యెడియూరప్ప గతంలో తీవ్రమైన ఆరోపణలతో పదవి కోల్పోయి జైలు పాలయ్యారు.

2019-07-26 Read More

‘ట్రిపుల్ తలాక్’ చెప్పినవారిని జైలుకు పంపించేలా రూపొందించిన బిల్లుకు గురువారం లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీలతో పాటు బిజెపి మిత్రపక్షం జెడి(యు) సభ్యులు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. గతంలో ‘ట్రిపుల్ తలాక్’ నిషేధంపై ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, తర్వాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టంది. గురువారం లోక్ సభలో బిల్లుపై ఓటింగ్ జరిగింది. అనుకూలంగా 303 మంది, వ్యతిరేకంగా 82 మంది ఓటు వేశారు.

2019-07-25

చంద్రయాన్-2.. చందమామపైకి ఇండియా రెండో ప్రయోగం.. చంద్రుడిపై పరిశోధనలకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఒక రోవర్ ను జూలై 15వ తేదీన పంపబోతోంది. ఈ నేపథ్యంలో ‘ఇస్రో’ ఛైర్మన్ కె. శివన్ తన కుటుంబంతో సహా ఆదివారం కర్నాటక రాష్ట్రం ఉడుపిలోని శ్రీక్రిష్ణ మఠానికి వెళ్లి పూజలు చేశారు. మఠాధిపతి దర్శనం చేసుకొని ఆశీర్వాదం కోరారు. ‘చంద్రయాన్ 2‘ ల్యాండర్ సెప్టెంబర్ 6వ తేదీన చందమామ దక్షిణధృవాన వాలనుంది.

2019-07-07
First Page 1 2 3 4 5 6 7 8 9 10 Last Page