మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టానికి కేంద్రం చేసిన సవరణలతో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ అట్టుడికిపోయింది. దీంతో ప్రభుత్వం యూనివర్శిటీకి ఆకస్మికంగా సెలవులు ప్రకటించింది. జనవరి 5వ తేదీ వరకు యూనివర్శిటీని మూసివేస్తున్నట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. అలీఘర్ నగరంలో ఇప్పటికే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టారు.
2019-12-15లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ సీట్లలో షెడ్యూల్డు కులాలు, తెగల సభ్యులకు రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాలు పొడిగిస్తూ ప్రతిపాదించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్ సభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని 334వ అధికరణంలో నిర్దేశించిన 70 సంవత్సరాల కాలపరిమితి వచ్చే నెలలో ముగుస్తుండటంతో, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడం తప్పనిసరి అయింది. తాజా సవరణతో రిజర్వేషన్లు 2030 జనవరి 20వరకు కొనసాగుతాయి.
2019-12-10దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ జెరూసలేం యాత్రకు అవకాశం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ భాషా చెప్పారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 100 మందితో కూడిన జెరూసలెం యాత్రికుల తొలి బృందానికి గురువారం జండా ఊపి ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు.
2019-12-05అయోధ్యలో వివాదాస్పద స్థలానికి రాముడే యజమాని అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకు సాక్ష్యాలుగా ఆ స్థలానికి సమీపంలోనే ఉన్న రామ్ చబుత్ర, సీతా రసోయి తదితర కట్టడాలను పేర్కొంది. వివాదాస్పద స్థలంలోనే రాముడు జన్మించాడన్నది హిందువుల విశ్వాసమని, ముస్లింలు కూడా ఆ మాటే అంటారని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ఆధారాలతోనే తాము (వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మించాలని) తీర్పు ఇస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
2019-11-09వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు శనివారం ఉదయం తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7 ఎకరాల స్థలంలో రామాలయం నిర్మించాలని, మసీదు కోసం 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాబ్రీ మసీదు కూల్చివేతను చట్ట విరుద్ధ చర్యగా ప్రకటిస్తూనే.. ఆ స్థలం రామ జన్మభూమిగా ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ తీర్పు చెప్పింది. మసీదు కింద మరో నిర్మాణం ఉందన్న ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికను ఉటంకించింది.
2019-11-09ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి లోని శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర పాదాలు తాకి నమస్కరించిన గవర్నర్, ఆశీర్వాదం కోరి ఆయన కాళ్ల దగ్గరే కూర్చున్నారు. స్వరూపానందతో పాటు వారసుడు, యువకుడైన స్వాత్మానందేంద్ర కూడా పీఠాలపై కూర్చోగా గవర్నర్ వారి ముందు కింద కూర్చుండిపోయారు.
2019-10-31దేశంలో మత, కుల ఘర్షణలు తగ్గాయా? అవుననే అంటోంది ఎన్.సి.ఆర్.బి. విడుదల చేసిన ‘క్రైమ్స్ ఇన్ ఇండియా 2017’ నివేదిక. 2017లో 723 మత సంబంధమైన ఘర్షణల కేసులు నమోదయ్యాయి. 2015లో 789 కేసులు, 2016లో 869 కేసులు నమోదయ్యాయి. కులపరమైన ఘర్షణ కేసుల్లో మరింత తగ్గుదల కనిపిస్తోంది. 2015లో 2,428 కేసులు, 2016లో 2295 కేసులు నమోదు కాగా 2017లో 805 మాత్రమే నమోదైనట్టు ఎన్.సి.ఆర్.బి. నివేదిక పేర్కొంది. అయితే, అల్లర్ల కేసులు వరుసగా 65255, 61974, 58,880 కేసులు నమోదయ్యాయి.
2019-10-22స్వయంప్రకటిత ‘‘కల్కి భగవాన్’’ విజయకుమార్ ఆశ్రమం, ఇతర ఆవాసాల నుంచి ఆదాయ పన్ను అధికారులు రూ. 93 కోట్ల మేరకు నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజులుగా ఏపీలోని వరదయ్యపాలెం కల్కి ఆశ్రమంలోనూ... బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని ఇతర ఆవాసాల్లోనూ అధికారులు సోదాలు చేశారు. మరో రూ. 500 కోట్లు అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారు. రూ. 43.9 కోట్ల నగదు, 2.5 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 18 కోట్లు), 88 కేజీల బంగారం (రూ. 26 కోట్లు), 1271 కేరట్ల వజ్రాలు (రూ. 5 కోట్లు) సీజ్ చేశారు.
2019-10-19అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు రాక ముందే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మందిర నిర్మాణంపై ప్రకటన చేశారు. ఆ స్థలంలో రామమందిర నిర్మాణం డిసెంబర్ 6వ తేదీన ప్రారంభమవుతుందని సాక్షి మహారాజ్ ప్రకటించారు. 1992లో డిసెంబర్ 6నే బాబ్రీ మసీదును కూల్చివేసిన విషయం తెలిసిందే. అదే రోజు రామందిర నిర్మాణం ప్రారంభం కావడం విశేషమని సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. బాబర్ భారతీయ ముస్లింల పూర్వీకుడు కాడని, ఒక ఆక్రమణదారుడని సాక్షి వ్యాఖ్యానించారు.
2019-10-16 Read Moreరామ మందిరం - బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు ఈ నెల 17వ తేదీన ముగుస్తున్న నేపథ్యంలో అయోధ్యలో 144వ సెక్షన్ విధించారు. అది డిసెంబర్ 10వరకు అమల్లో ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసేలోగా అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతుందన్న సంకేతాలు ఇదివరకే అందాయి. మధ్యవర్తిత్వం విఫలమయ్యాక జస్టిస్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు జడ్జిల బెంచ్ ఆగస్టు 6వ తేదీనుంచి రోజువారీగా ఈ కేసును విచారిస్తోంది.
2019-10-13 Read More