పౌరసత్వ సవరణ బిల్లు (సిఎబి)లో మతాల పేర్లు ప్రస్తావించవద్దని నిపుణులు చెప్పినా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదట. బిల్లులో ‘హిందు, సిక్కు, పార్సి’ అంటూ మతాల పేర్లు వద్దని, ‘పీడిత మైనారిటీలు’ అని పేర్కొనాలని 7, 8, 9 లోక్ సభలకు సెక్రటరీ జనరల్ గా పని చేసిన రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ 2016లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి సూచించారట. ఇప్పుడు కోర్టు ద్వారాగానీ, పార్లమెంటు చట్ట సవరణ ద్వారా గానీ చట్టాన్ని ‘సరి’ చేయవచ్చని ఆయన చెబుతున్నారు.
2019-12-28కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి, బిజెపి చిరకాల మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి)కి తాము వ్యతిరేకమని ప్రకటించింది. ఎన్.ఆర్.సి. ప్రక్రియ ముస్లింలలో భయాందోళనలను సృష్టించిందని అకాలీదళ్ గురువారం పేర్కొంది. ‘‘మా పార్టీ కూడా మైనారిటీలదే (సిక్కులు). మైనారిటీలను భయపెట్టే ఏ చర్యకైనా మేము వ్యతిరేకమే’’ అని అకాలీదళ్ రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ స్పష్టం చేశారు.
2019-12-26కొద్ది రోజుల క్రితం మంగళూరు పోలీసు కాల్పుల్లో మరణించిన ఇద్దరి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కర్నాటక సిఎం యెడియూరప్ప ఇప్పుడు మాట మార్చారు. హింసాత్మక ఘటనల్లో వారిద్దరూ అమాయకులని దర్యాప్తులో రుజువయ్యేవరకు పరిహారం చెల్లించబోమని బుధవారం స్పష్టం చేశారు. మంగళూరు ఘటనలపై ఓవైపు సిఐడి దర్యాప్తు, మరోవైపు మెజిస్టీరియల్ విచారణ జరుగుతోంది.
2019-12-25‘‘జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్)కు, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి)కి సంబంధం లేదు’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. న్యూస్ ఏజన్సీ ఎ.ఎన్.ఐ.తో మాట్లాడుతూ... ఎన్.ఆర్.సి.పై కేంద్ర మంత్రివర్గంలో గానీ, పార్లమెంటులో గానీ చర్చ జరగలేదని, ఈ విషయమై పిఎం మోడీ చెప్పింది నిజమేనని పేర్కొన్నారు. ఎన్.ఆర్.సి.పై దేశవ్యాప్తంగా చర్చించవలసిన అవసరం లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు.
2019-12-25తన ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్.ఆర్.సి)కి వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పౌరసత్వ సవరణ బిల్లు (సిఎబి)కి కొద్ది రోజుల క్రితమే పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ మద్ధతు తెలిపింది. ఆ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో... ఎన్.ఆర్.సి.ని మాత్రం అమలు చేయబోమని వైసీపీ ప్రకటించింది.
2019-12-23మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టానికి సవరణలు చేస్తూ రూపొందించిన సిఎఎకి దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతుండగా అధికార బీజేపీ ఒక్కటే అక్కడక్కడా మద్ధతు ర్యాలీలు చేస్తోంది. ఆర్.ఎస్.ఎస్. కేంద్ర స్థానమైన నాగపూర్ లో ఆదివారం బిజెపి, దాని మాతృ సంస్థ, అనుబంధ సంస్థ లోక్ అధికార్ మంచ్ ర్యాలీ నిర్వహించాయి. ‘‘సిఎఎకు నాగపూర్ స్వాగతం’’ అనే నినాదంతో కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు.
2019-12-22ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి బిజెపినే కారణమని సమాజ్ వాదీ పార్టీ (ఎస్.పి) ఆరోపించింది. ప్రభుత్వంలోనే కూర్చున్నవాళ్లే అల్లర్లను ప్రేరేపించారని, బిజెపి ఉద్దేశపూర్వకంగా ద్వేషాన్ని వెదజల్లుతోందని ఎస్.పి. అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. నిజమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ప్రజలను భయపెడుతోందని విమర్శించారు.
2019-12-22మెజారిటీ (హిందువులు) సహనం కోల్పోతే ‘గోద్రా తరహా’ పరిస్థితి పునరావృతమవుతుందని కర్నాటక బిజెపి మంత్రి సి.టి. రవి హెచ్చరించారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తే కర్నాటక తగలబడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యు.టి. ఖాదర్ ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్పను హెచర్చించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. మంగళూరులో గురువారం జరిగిన ఆందోళనలను ‘‘గోద్రా రైలు దహనం’’తో పోల్చిన మంత్రి, గోద్రాలో ఆ తర్వాత ఏమి జరిగిందో గుర్తు చేసుకోవాలని ఖాదర్ ను హెచ్చరించారు.
2019-12-20పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ తో పాటు ఎస్.ఎం.ఎస్.లు, కాల్స్ కూడా నిలిపివేశాయి టెలికం కంపెనీలు. ప్రభుత్వ ఆదేశాలమేరకు సేవలను నిలిపివేస్తున్నట్టు ఎయిర్ టెల్, వోడాఫోన్ నిర్ధారించాయి.
2019-12-19అయోధ్యలో రామమందిరాన్ని ఆకాశమంత ఎత్తున నాలుగు నెలల్లోపల నిర్మిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. సోమవారం జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఓవైపు నాలుగో దశ పోలింగ్ జరుగుతుండగా ఐదో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో అమిత్ షా ప్రచారం సాగింది. నాలుగో దశలో 15 అసెంబ్లీ సీట్లకు సోమవారం పోలింగ్ జరిగింది. ఐదో దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. 23వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
2019-12-16