ఇరాక్ లోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ ఈనెల 8న జరిపిన దాడిలో 11 మంది సైనికులు గాయపడ్డారని అమెరికా మిలిటరీ శుక్రవారం తెలిపింది. తమ కుర్ద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చిన నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడికి దిగిన సంగతి తెలిసిందే. అయితే, దాడి జరిగిన రోజు ఎవరూ గాయపడలేదని వార్తలు వచ్చాయి.
2020-01-172020 అమెరికా జనాభా లెక్కల్లో తమను ‘ప్రత్యేక జాతి’గా గుర్తించనున్నట్టు సిక్కు సంస్థలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రత్యేక కోడ్ ను జోడించినట్టు అమెరికా సెన్సస్ బ్యూరో అధికారి షగుఫ్త అహ్మద్ తెలిపారు. అమెరికాలో సిక్కుల ప్రత్యేక గుర్తింపుకోసం ‘యునైటెడ్ సిఖ్స్’ గత రెండు దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తోంది. విద్వేషపూరిత నేరాలకు సిక్కులు బాధితులవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ పెరిగింది.
2020-01-15 Read Moreఆవుపేడ, మూత్రంపై రైతులు ఆదాయం పొందేలా చేయగలిగితే ఒట్టిపోయిన తర్వాత వదిలేయకుండా ఉంటారని కేంద్ర మంత్రి, బి.జె.పి. నాయకుడు గిరిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవుపేడపై మరిన్ని పరిశోధనలు చేయాలని, ఒట్టిపోయిన ఆవులు కూడా భారం కాకుండా చూడాలని శాస్త్రవేత్తలకు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లకు కేంద్ర మంత్రి విన్నవించారు. ‘‘వీధి ఆవులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సమస్య’’గా మారాయని సింగ్ చెప్పారు.
2020-01-14 Read Moreపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా ఢిల్లీ ‘షహీన్ బాగ్’లో జరుగుతున్న నిరసనకు ఆదివారం మద్ధతు పెరిగింది. అన్ని విశ్వాసాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో పోగై సర్వమత ప్రార్ధనలు చేశారు. మత సామరస్యాన్ని చాటుతూ... చాలా పొడవైన జాతీయ పతాకాన్ని చేతబూని ప్రదర్శన నిర్వహించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ పఠనము, భజనలూ, సిక్కు కీర్తనలు సాగాయి. అదే సమయంలో రాజ్యాంగ పీఠికను చదువుతూ సోషలిస్టు, సెక్యులర్ విలువలను కాపాడతామని ప్రతినబూనారు.
2020-01-13భారత రాజ్యాంగం ముసాయిదాను రూపొందించింది ఒక బ్రాహ్మణుడని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్ నగరంలో జరుగుతున్న ప్రపంచ బ్రాహ్మణ సదస్సులో శనివారం త్రివేది మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ కూడా బంగాల్ నరసింగ్ రావుకు క్రెడిట్ ఇచ్చారని, ఆయన బ్రాహ్మణుడని త్రివేది చెప్పారు. అంతే కాదు.. భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించడానికి 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారని కూడా ఈ పెద్ద మనిషి చెప్పుకొచ్చారు.
2020-01-04గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో హరిక్రిష్ణ సరస్సు వద్ద గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 2017లో ప్రారంభించిన సరస్సు వద్ద పార్కులో ఈ విగ్రహం 2018లో ఏర్పాటైంది. సూరత్ డైమండ్ వ్యాపారి సావ్జీభాయ్ ఢోలాకియాకి చెందిన ఫౌండేషన్ ఈ సరస్సును తవ్వించింది. సరస్సు తవ్వకాన్ని వ్యతిరేకించేవారు గానీ, సంఘ వ్యతిరేక శక్తులు గానీ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
2020-01-04 Read More‘‘పాకిస్తాన్లో హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పార్శీలు, జైనులు, బౌద్ధులు కలిపి 23 శాతం ఉండేవారు. ఇప్పుడు 3 శాతానికి తగ్గారు. ఆ 20 శాతం ఎక్కడికి వెళ్లారు?’’... బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి. నడ్డా ప్రశ్న ఇది. ‘‘వాళ్ల మతం మార్చారా? బహిష్కరించారా? వాళ్ళే పారిపోయారా? ప్రపంచం తెలుసుకోవాలనుకుంటోంది’’ అని నడ్డా శనివారం వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పాకిస్తాన్ బాధిత మైనారిటీలకోసమేనని బిజెపి చెబుతోంది.
2020-01-04కర్నాటక బిజెపి ఎమ్మెల్యే జి. సోమశేఖరరెడ్డి శుక్రవారం మైనారిటీలను బహిరంగంగా బెదిరించారు. ‘‘మేము 80 శాతం ఉన్నాం. మీరు కేవలం 17 శాతం. మేము మీకు వ్యతిరేకంగా రంగంలోకి దిగితే ఏమవుతుందో ఊహించుకోండి’’ అని ఓ సభలో సోమశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. అతి పెద్ద మైనింగ్ కుంభకోణంలో నిందితుడు గాలి జనార్ధనరెడ్డికి ఈయన అన్న. జనార్ధనరెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయనకు బెయిలుకోసం ఆంధ్రా సీబీఐ జడ్జికి లంచం ఇవ్వజూపిన కేసులో సోమశేఖరరెడ్డి నిందితుడు.
2020-01-04 Read Moreపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలలో తీర్మానం చేయాలని కేరళ సిఎం పినరయి విజయన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నవించారు. శుక్రవారం ఆయన 11 రాష్ట్రాల (బీజేపీయేతర) సిఎంలకు లేఖలు రాశారు. సిఎఎ ప్రాథమికంగా వివక్షాపూరితమని, భారత రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విజయన్ తన లేఖలో పేర్కొన్నారు. సిఎఎ రద్దు కోరుతూ కేరళ అసెంబ్లీ గత నెల 31న తీర్మానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
2020-01-03 Read Moreజమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా పుట్టిన రోజును, కాశ్మీర్ అమరుల దినోత్సవాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ సెలవుల జాబితా నుంచి తప్పించింది కేంద్ర పాలనలోని యంత్రాంగం. స్వాతంత్రానికి పూర్వం 1931జూలై 13న రాజా హరిసింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై ఆయన సైన్యం కాల్పులు జరిపింది. అందులో మరణించినవారిని స్మరిస్తూ ఏటా ఆ రోజును అమరుల దినోత్సవంగా పాటిస్తున్నారు. ఇప్పుడా వారసత్వానికి స్వస్తి పలికారు.
2019-12-28